తగ్గిన విజయ నూనె ధరలు | Vijaya oil prices slashed down | Sakshi
Sakshi News home page

తగ్గిన విజయ నూనె ధరలు

Published Sun, Jul 2 2017 1:34 AM | Last Updated on Sat, Jul 6 2019 3:20 PM

తగ్గిన విజయ నూనె ధరలు - Sakshi

తగ్గిన విజయ నూనె ధరలు

వేరుశనగ నూనె రూ.2, పామాయిల్‌ రూ.1 తగ్గింపు
సాక్షి, హైదరాబాద్‌: జీఎస్టీ అమలు నేపథ్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని విజయ నూనెల ధరలు తగ్గాయి. మూడు రకాల నూనెలను ధర తగ్గించి వినియోగదారులకు అందించాలని నిర్ణయించినట్లు ఆయిల్‌ఫెడ్‌ విజయ నూనెల మార్కెటింగ్‌ మేనేజర్‌ బి.రాజేశం ‘సాక్షి’కి తెలిపారు. ఈ నేపథ్యంలో వేరుశనగ నూనె పాత ధర లీటరుకు రూ.107 ఉండగా, దాన్ని రూ.105కు తగ్గించారు.

పామాయిల్‌ లీటర్‌కు రూ.61 ఉండగా, ఇప్పుడు రూ.60కి చేరింది. రైస్‌బ్రాన్‌ నూనె ధర రూ.70 ఉండగా, దానిపై 10 పైసలు మాత్రమే తగ్గించారు. సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధర అన్ని కంపెనీల కంటే తక్కువగా ఉండటంతో అదే ధరను కొనసాగించనున్నట్లు రాజేశం పేర్కొన్నారు. ఆయిల్‌ఫెడ్‌ విక్రయిస్తున్న వాటిల్లో పామాయిల్‌ వాటానే 40 శాతంగా ఉంది. చౌక ధర దుకాణాలు, అంగన్‌వాడీ కేంద్రాలకు కూడా ఈ నూనెనే సరఫరా చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement