palmoil
-
తగ్గిన విజయ నూనె ధరలు
వేరుశనగ నూనె రూ.2, పామాయిల్ రూ.1 తగ్గింపు సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ అమలు నేపథ్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని విజయ నూనెల ధరలు తగ్గాయి. మూడు రకాల నూనెలను ధర తగ్గించి వినియోగదారులకు అందించాలని నిర్ణయించినట్లు ఆయిల్‌ఫెడ్ విజయ నూనెల మార్కెటింగ్ మేనేజర్ బి.రాజేశం ‘సాక్షి’కి తెలిపారు. ఈ నేపథ్యంలో వేరుశనగ నూనె పాత ధర లీటరుకు రూ.107 ఉండగా, దాన్ని రూ.105కు తగ్గించారు. పామాయిల్ లీటర్‌కు రూ.61 ఉండగా, ఇప్పుడు రూ.60కి చేరింది. రైస్‌బ్రాన్ నూనె ధర రూ.70 ఉండగా, దానిపై 10 పైసలు మాత్రమే తగ్గించారు. సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర అన్ని కంపెనీల కంటే తక్కువగా ఉండటంతో అదే ధరను కొనసాగించనున్నట్లు రాజేశం పేర్కొన్నారు. ఆయిల్‌ఫెడ్ విక్రయిస్తున్న వాటిల్లో పామాయిల్ వాటానే 40 శాతంగా ఉంది. చౌక ధర దుకాణాలు, అంగన్వాడీ కేంద్రాలకు కూడా ఈ నూనెనే సరఫరా చేస్తున్నారు. -
పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పరిశీలించిన మంత్రులు
అప్పారావుపేట (దమ్మపేట): అప్పారావుపేటలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మంగళవారం పరిశీలించారు. ఈ ఫ్యాక్టరీ అవసరాన్ని తోటి మంత్రులకు, స్పీకర్‌కు తుమ్మల వివరించారు. దమ్మపేట మండలంలోని దాదాపు 15వేల ఎకరాల్లో పామాయిల్ పంట సాగవుతోందని వారితో చెప్పారు. అప్పారావుపేటలో నూతన పరిజ్ఞానంతో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నట్టు మంత్రులతో ఆయిల్‌ఫెడ్ ఎండీ మురళి చెప్పారు. ఈ ఫ్యాక్టరీ పూర్తయితే ఆయిల్ రికవరీ శాతంతోపాటు రైతుల పంటలకు ధర పెరుగుతుందని చెప్పారు. నూతన సాంకేతిక పరిజ్ఙానంలో భాగంగా ముందుగా ఇక్కడ గంటకు 30 టన్నుల పామాయిల్ గెలలు క్రషింగ్ అయ్యేలా మినషరీని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. తర్వాత పంట దిగుబడుల ఆధారంగా గంటకు 60 టన్నులు క్రషింగ్ అయ్యేలా మిషనరీని ఏర్పాటు చేస్తామన్నారు. -
పామాయిల్ పంపిణీకి గ్రహణం
నెల్లూరు(పొగతోట): తెల్లకార్డు లబ్ధిదారులకు రేషన్‌షాపుల ద్వారా ప్రతి నెలా జరిగే పామాయిల్ పంపిణీకి గ్రహణం పట్టింది. మూడు నెలలుగా పామాయిల్ పంపిణీ ప్రక్రియ నిలిచిపోవడంతో పేదలు అవస్థ పడుతున్నా రు. అధిక ధరలు చెల్లించి బజారు లో నూనెలు కొనుగోలు చేయలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పామాయిల్ పంపిణీకి టీడీపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలిసింది. జిల్లాలో 8.50 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. వీటి లబ్ధిదారులకు ప్రతి నెలా 8.50 లక్షల పామాయిల్ ప్యాకెట్లను సబ్సిడీపై పంపిణీ చేస్తున్నారు. లీటర్ పామాయిల్ ధర మార్కెట్ లో రూ.65 నుంచి రూ.70 పలుకుతుండగా రేషన్‌దుకాణాల ద్వారా రూ.40కే అందిస్తున్నారు. ఈ క్రమంలో పేద ప్రజలందరూ ఈ పామాయిల్‌తోనే వంట చేసుకుంటున్నారు. అయితే మూడు నెలలుగా ఈ పామాయిల్ పంపిణీకి బ్రేక్ పడింది. రేషన్‌డీలర్లు డీడీలు తీసినా బియ్యం సరఫరా చేసి సరిపెట్టుకుంటున్నారు. ఈ విషయమై సివిల్ సప్లయీస్ డీఎం ధర్మారెడ్డి మాట్లాడుతూ పామాయిల్ పంపిణీపై ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని వెల్లడించారు. ఆదేశాలు వస్తే పంపిణీకి చర్యలు తీసుకుంటామని చెప్పారు. చంద్రబాబు ఫొటో కోసమేనా ! ఇటీవల వరకు పంపిణీ అయిన పామాయిల్ ప్యాకెట్లపై సోనియాగాంధీ, మన్మోహన్సింగ్, అప్పటి సీఎం కిరణ్, మంత్రి శ్రీధర్‌బాబు ఫొటోలు ఉండేవి. వాటి స్థానంలో ప్రస్తుత సీఎం చంద్రబాబు, మంత్రుల ఫొటోలు ముద్రించడం కోసమే ప్రభుత్వం ఉత్తర్వుల జారీలో తాత్సారం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద వీరి ఫొటోల పంచాయితీ ప్రజలను కష్టాలపాల్జేస్తోంది.