నెల్లూరు(పొగతోట): తెల్లకార్డు లబ్ధిదారులకు రేషన్‌షాపుల ద్వారా ప్రతి నెలా జరిగే పామాయిల్ పంపిణీకి గ్రహణం పట్టింది. మూడు నెలలుగా పామాయిల్ పంపిణీ ప్రక్రియ నిలిచిపోవడంతో పేదలు అవస్థ పడుతున్నా రు. అధిక ధరలు చెల్లించి బజారు లో నూనెలు కొనుగోలు చేయలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పామాయిల్ పంపిణీకి టీడీపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలిసింది. జిల్లాలో 8.50 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. వీటి లబ్ధిదారులకు ప్రతి నెలా 8.50 లక్షల పామాయిల్ ప్యాకెట్లను సబ్సిడీపై పంపిణీ చేస్తున్నారు. లీటర్ పామాయిల్ ధర మార్కెట్ లో రూ.65 నుంచి రూ.70 పలుకుతుండగా రేషన్‌దుకాణాల ద్వారా రూ.40కే అందిస్తున్నారు.
ఈ క్రమంలో పేద ప్రజలందరూ ఈ పామాయిల్‌తోనే వంట చేసుకుంటున్నారు. అయితే మూడు నెలలుగా ఈ పామాయిల్ పంపిణీకి బ్రేక్ పడింది. రేషన్‌డీలర్లు డీడీలు తీసినా బియ్యం సరఫరా చేసి సరిపెట్టుకుంటున్నారు. ఈ విషయమై సివిల్ సప్లయీస్ డీఎం ధర్మారెడ్డి మాట్లాడుతూ పామాయిల్ పంపిణీపై ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని వెల్లడించారు. ఆదేశాలు వస్తే పంపిణీకి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
చంద్రబాబు ఫొటో కోసమేనా !
ఇటీవల వరకు పంపిణీ అయిన పామాయిల్ ప్యాకెట్లపై సోనియాగాంధీ, మన్మోహన్‌సింగ్, అప్పటి సీఎం కిరణ్, మంత్రి శ్రీధర్‌బాబు ఫొటోలు ఉండేవి. వాటి స్థానంలో ప్రస్తుత సీఎం చంద్రబాబు, మంత్రుల ఫొటోలు ముద్రించడం కోసమే ప్రభుత్వం ఉత్తర్వుల జారీలో తాత్సారం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద వీరి ఫొటోల పంచాయితీ ప్రజలను కష్టాలపాల్జేస్తోంది.
పామాయిల్ పంపిణీకి గ్రహణం
Published Thu, Jul 3 2014 2:00 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement