పొడిచర్మం ఎప్పుడూ పొడిబారుతూనే ఉంటుంది. చలికాలంలో అందరికీ ఈ సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ఈ కాలం చర్మానికి బ్లీచ్ వాడకూడదు. ఎక్కువగా రబ్ చేయకూడదు. అలాగే మృదువుగా ఉండాలని నూనెలను వాడకూడదు. స్నానం చేయడానికి ముందు గోరువెచ్చని నూనెను మర్దనాకు ఉపయోగించాలి. స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజర్, బయటకు వెళితే సన్‌స్క్రీన్ రాసుకోవాలి. రోజూ తీసుకునే ఈ జాగ్రత్తలు చలికాలంలోనూ చర్మాన్ని మృదువుగా వస్తాయి.
చలి ఒక్కసారిగా ఎక్కువైంది. గాల్లో తేమ తగ్గి చర్మం పొడిబారుతోంది. కాలానుగుణంగా వచ్చే సమస్యలను ఎదుర్కోవడానికి మన దగ్గర ఎప్పుడూ బాణాల్లాంటి చిట్కాలు ఉంచుకోవాలి.
కొబ్బరినూనె, తేనె కలిపి పెదవులపై రాసి, మసాజ్ చేయాలి. రోజులో కొన్నిసార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే పెదవులు పొడిబారడం, పగుళ్ల సమస్యలు తగ్గి, మృదువుగా అవుతాయి.
నువ్వుల నూనె, ఆప్రికాట్ నూనె, విటమిన్ ‘ఇ’ నూనెలను రెండేసి టీ స్పూన్ల చొప్పున తీసుకొని కలపాలి. అందులో రెండు అంగుళాల అల్లం ముక్కను తురిమి వేసి మరిగించాలి. ఇందులో అరకప్పు కోకా బటర్‌ను కరిగించి కలపాలి. ఒక బాటిల్‌లో పోసి రోజుకు రెండు సార్లు శరీరానికి మసాజ్ చేసుకోవాలి. పొడి చర్మానికి ఇది మేలైన మిశ్రమం.
రాత్రి పడుకునే ముందు వెనిగర్ కలిపిన గోరువెచ్చని నీటిలో పది నిమిషాల సేపు పాదాలను ఉంచాలి. తర్వాత తడి లేకుండా తుడిచి, మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా చేస్తే పాదాలపై చర్మం మృదువుగా మారుతుంది. పగుళ్లు తగ్గుముఖం పడతాయి.
రెండు టేబుల్ స్పూన్ల తేనెలో, రెండు టీ స్పూన్ల పచ్చి పాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, గొంతుకు, మెడకు ప్యాక్ వేయాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పొడిచర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది.
కప్పు పెరుగులో, పావు కప్పు పెసర పిండి, గుడ్డులోని తెల్లసొన కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు, మాడుకు, శిరోజాలకు పట్టించాలి. పావు గంట తర్వాత తలస్నానం చేయాలి. ప్రతి మూడు రోజులకోసారి ఇలా నెలరోజుల పాటు చేస్తే చుండ్రు, జుట్టు ఊడిపోవడం తగ్గుతుంది.
చలితో చెలిమి
Published Wed, Nov 6 2013 11:49 PM | Last Updated on Sat, Sep 2 2017 12:20 AM
Advertisement