Beauty Tips In Telugu: How To Get Rid Of Dark Circles Under Eyes And Thick Eyebrows - Sakshi
Sakshi News home page

Black Circles Under Eyes: పచ్చిపాలు.. కొబ్బరి నూనె! ఇలా చేస్తే కళ్ల చుట్టూ ఉన్న నల్లని వలయాలు మాయం

Published Sat, Dec 3 2022 2:14 PM | Last Updated on Sat, Dec 3 2022 3:18 PM

Beauty Tips To Get Rid Of Black Circles Under Eyes And Thick Eyebrows - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

Eye Care- Beauty Tips In Telugu: కొన్నిసార్లు  మాటల్లో చెప్పలేని భావాలను కళ్లు వ్యక్తపరుస్తాయి. అలాంటి కళ్లకు సంబంధించిన సంరక్షణ తీసుకుంటే కలువల్లాంటి కళ్లు మీసొంతం అవుతాయి ఇలా...

ఒత్తైన కనుబొమ్మలు
►పడుకోబోయే ముందు రోజ్‌ వాటర్‌లో కాటన్‌ని ముంచి, కళ్ల చుట్టూ శుభ్రపరచుకుంటే దుమ్ము, ధూళి పోయి కళ్లు తేజోవంతమవుతాయి.
►రాత్రి కనుబొమలకు, కను రెప్పలకు ఆముదం పట్టించి, తెల్లవారి కడిగేస్తే కనుబొమలు, రెప్పలు ఒత్తుగా అవుతాయి.

ముడతలు మాయం
►కళ్ల చుట్టూ తేనెతో మసాజ్‌ చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే కళ్లచుట్టూ ఉన్న ముడతలు మటుమాయం అవుతాయి.

నల్లని వలయాలు తగ్గుముఖం
►పచ్చిపాలలో కాటన్‌ ముంచి, కళ్లచుట్టూ సుతిమెత్తగా మర్దనా చేయాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే కళ్ల చుట్టూ ఉన్న నల్లని వలయాలు తగ్గుముఖం పడతాయి.
►కీరా జ్యూస్‌లో, రోజ్‌ వాటర్‌ కలపాలి. ఈ మిశ్రమాన్ని కళ్ల చుట్టూ అప్లై చేసి, 30 నిమిషాల తరువాత కడిగేయాలి.
►టొమాటో జ్యూస్‌లో నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని కళ్ల చుట్టూ అప్లై చేసి అర గంట తరువాత కడిగెయ్యాలి.
►కొబ్బరినూనెతో కళ్ల చుట్టూ సుతిమెత్తగా మర్దనా చేయాలి. వారంలో రెండుసార్లు ఇలా చేస్తే కళ్లకి అలసటతగ్గడమే కాకుండా నల్లటి వలయాలు కూడా నయం అవుతాయి.

చదవండి: Menthi Podi: షుగర్‌ పేషెంట్లు రాత్రి వేళ మెంతి గింజల్ని పాలలో ఉడకబెట్టి తాగితే.. 
Urinary Infections: ఎక్కువ సేపు మూత్రాన్ని ఆపుకొంటే జరిగే అనర్థాలివే! ముఖ్యంగా వర్కింగ్‌ వుమెన్‌లో ఈ సమస్యలు..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement