Rashmika Mandanna's Beauty Secret For Glowing Skin And Healthy Hair - Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: నేషనల్‌ క్రష్‌ రష్మిక అందం కోసం ఏం చేస్తుందో తెలుసా?

Published Mon, Jun 26 2023 12:28 PM | Last Updated on Fri, Jul 14 2023 4:34 PM

Rashmika Mandanna Beauty Secret For Glowing Skin And Healthy Hair - Sakshi

హీరోయిన్‌ రష్మికా మందన్నా అతి తక్కువ సమయంలోనే నేషనల్‌ క్రష్‌గా మారి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది.‘ఛలో’ సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించింది. ఈ చిత్రం సూపర్‌ హిట్‌ టాక్‌ కావడంతో రష్మిక దశ తిరిగింది. ఈ సినిమా సక్సెస్‌తో వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా మారిపోయింది.సౌత్‌, నార్త్‌ ఇలా అన్ని భాషల్లో వరుస సినిమాలతో ఆకట్టుకుంటుంది. చదవండి: డబుల్‌ చిన్‌తో పెద్దవాళ్లలా కనిపిస్తున్నారా? ఇలా చేస్తే అందంగా, నాజుగ్గా..

పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా ఫ్యాన్‌ బేస్‌ను సొంతం చేసుకున్న రష్మికకు యూత్‌లో మాంచి ఫాలోయింగ్‌ ఉంది. ప్రస్తుతం తెలుగులో పుష్ప-2 సినిమాతో పాటు, బాలీవుడ్‌, కోలీవుడ్‌ చిత్రాలతో చేతినిండా అవకాశాలతో బిజీగా గడిపేస్తుంది. కాస్త తీరిక దొరికనప్పుడు మాత్రం స్కిన్‌కేర్‌, హెయిర్‌ కేర్‌ గురించి ప్రత్యేక శ్రద్ద వహిస్తానంటుంది ఈ ముద్దుగుమ్మ.

గోరు వెచ్చని కొబ్బరి నూనెను ముఖానికి, తలకు పట్టించి చక్కగా మర్దనా చేసుకుంటే చాలు. ఏ మాయిశ్చరైజర్, హెయిర్‌ కండీషనర్‌ అవసరం లేకుండానే చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. వీలు దొరికినప్పుడల్లా నేను ఇదే చేస్తా. ఇది మా అమ్మ, అమ్మమ్మ చెప్పిన చిట్కా! చదవండి: రోజూ హెల్మెట్‌ వాడుతున్నారా? బాక్టీరియా, క్రిములు..
– రష్మిక మందన్నా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement