అందరిలోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలవాలని కోరుకుంటారు అమ్మాయిలు. కొన్నిసార్లు మచ్చలు, మృతకణాల కారణంగా ముఖారవిందం దెబ్బతింటుంది. అలాంటి సమయాల్లో బ్యూటీపార్లర్లను ఆశ్రయిస్తారు. ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది. ఇలాంటి అవసరం లేకుండా ఇంట్లోనే చక్కగా మెరిపించే ప్యాక్‌లు తయారు చేసుకోవచ్చు.
టీస్పూను కాఫీ పొడిలో టీస్పూను కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని శుభ్రంగా కడిగిన ముఖానికి అప్లై చేసి పదినిమిషాలపాటు మర్దన చేయాలి. తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
టీస్పూను కాఫీ పొడిలో టీస్పూను కొబ్బరి నూనె, టీస్పూను పసుపు, టీస్పూను పెరుగు వేసి పేస్టులా కలుపుకోవాలి.
ముఖానికి ఈ పేస్టుని అప్లై చేసి పదిహేను నిమిషాలపాటు ఆరనిచ్చి కడిగేయాలి.
ఈ రెండు స్టెప్పులను వారానికి రెండుసార్లు చేయడం వల్ల మృత కణాలు, మచ్చలు పోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.
చదవండి: Influencers: పేరుకు పేరు.. చెప్పుకోదగ్గ ఆదాయం.. మీరూ అవుతారా ఇన్‌ఫ్లుయెన్సర్!
Comments
Please login to add a commentAdd a comment