అందం అంటే మేని మెరుపు ఒక్కటే కాదు.. ఎవర్‌గ్రీన్‌ బ్యూటీ చెప్పిన చిట్కాలివే! | Beauty Tips: Rekha Reveals Her Best Hair Care Tips | Sakshi
Sakshi News home page

Actress Rekha: కొబ్బరి నూనె, పెరుగు, తేనె .. ఎవర్‌గ్రీన్‌ బ్యూటీ రేఖ చెప్పిన చిట్కాలివే!

Published Tue, Oct 25 2022 4:20 PM | Last Updated on Thu, Oct 27 2022 9:43 AM

Beauty Tips: Rekha Reveals Her Best Hair Care Tips - Sakshi

Beauty Tips- Rekha: అలనాటి బాలీవుడ్‌ హీరోయిన్‌ రేఖ ఏడు పదుల వయసుకు చేరువవుతున్నా అందంతో మెరిసిపోతూ ఎవర్‌గ్రీన్‌ బ్యూటీ అనిపించుకుంటున్నారు. ఫంక్షన్‌ ఎక్కడైనా.. పార్టీ ఏదైనా తనదైన స్టైల్‌తో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలుస్తారామె. నిండైన చీరకట్టుతో అందానికి మారుపేరులా అనిపించే రేఖ.. కురుల ఆరోగ్యం గురించి తన తల్లి చెప్పిన చిట్కాల గురించి అభిమానులతో పంచుకున్నారు.

అవును.. అతివల సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేయడంలో నల్లని, ఒత్తైన కురులది కూడా కీలక పాత్రే! ఆ కురులకు సంబంధించి రేఖ చెప్పిన టిప్స్‌ ఆమె మాటల్లోనే..  ‘‘అందం అంటే మేని మెరుపు ఒక్కటే కాదు కదా.. కురుల ఆరోగ్యం కూడా! దానికి నేను నమ్ముకున్నది హోమ్‌ రెమిడీస్‌నే. వారంలో రెండుమూడు సార్లు తలకు కొబ్బరి నూనెతో మసాజ్‌ చేసుకుంటాను.

చాలా తరచుగా పెరుగు, తేనె, గుడ్డులోని తెల్లసొనను కలిపి జుట్టుకు ప్యాక్‌గా వేసుకుంటాను. స్ట్రెయిటెనర్స్, కర్లర్స్, హెయిర్‌ డ్రయర్లు అస్సలు వాడను. వాటివలన జుట్టు సహజత్వం దెబ్బతింటుంది’’ అని రేఖ పేర్కొన్నారు.

చదవండి: Shirley Setia: బ్లూ సారీలో ధగధగ మెరిసిపోతున్న హీరోయిన్‌! చీర ధర ఎంతంటే
Health Tips: రోజూ స్కిప్పింగ్‌ చేసే అలవాటుందా? ఎండార్ఫిన్ల ఉత్పత్తి పెరిగి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement