Here Are Some Simple Homemade Beauty Tips - Sakshi
Sakshi News home page

Beauty Tips: వీకెండ్‌లో పార్టీలే కాదు, స్కిన్‌ కేయిర్‌ కూడా ఎంతో ముఖ్యం.. ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి

Published Sat, Aug 19 2023 4:47 PM | Last Updated on Sat, Aug 19 2023 5:52 PM

Here Are Some Simple Homemade Beauty Tips - Sakshi

ట్యాన్‌ తగ్గాలంటే...

► స్పూను కాఫీ పొడిలో స్పూను తేనె, స్పూను బంగాళ దుంప రసం, స్పూను గంధం పొడివేసి చక్కగా కలిపితే డీ ట్యాన్‌ ప్యాక్‌ రెడీ. ఈ ప్యాక్‌ను ముఖం, చేతులు, మెడపైన పూతలా వేసి పదిహేను నిమిషాలు ఆరనివ్వాలి. తరువాత తడి బట్టతో తుడిచేసి, నీటితో కడిగేయాలి.

► వారానికి రెండు–మూడుసార్లు ఈ ప్యాక్‌ వేసుకుంటే నలుపు పోయి, చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. ప్యాక్‌ వేసుకునే సమయం లేనప్పుడు..టొమాటో రసాన్ని ముఖానికి రాసుకుంటే ట్యాన్‌ తగ్గుతుంది. 

► నిమ్మరసంలో బంగాళదుంప రసం కలిపి ముఖానికి పెట్టుకున్నా ట్యాన్‌ పోతుంది
► ఈ  ప్యాక్‌లు వేసుకున్నప్పటికీ రాత్రి పడుకునేముందు చేతులు, కాళ్లకు నైట్‌క్రీమ్‌ రాసుకుంటే ట్యాన్‌ తొలగి చర్మం కాంతిమంతంగా మెరుస్తుంది.

హెయిర్‌ కేర్‌

  • యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌లో కొద్దిగా నీళ్లు కలిపి, తలస్నానం చేసిన జుట్టుకు కుదళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి. ఇలా చేయడం వల్ల తల స్నానం చేసిన తరువాత కూడా జుట్టుకు పట్టి ఉండే జిడ్డు 
  • వదులుతుంది. వారానికి ఒకసారి ఇలా చేయాలి. 
  • ఉసిరి పొడిలో నిమ్మరసం వేసి పేస్టులా కలపాలి. ఈ పేస్టుని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి క్యాప్‌ పెట్టుకోవాలి. గంట తరువాత మైల్డ్‌ షాంపూతో తల స్నానం చేయాలి.
  • ఈ ప్యాక్‌లో విటమిన్‌ సి పుష్కలంగా ఉండి కురులను దృఢంగా మారుస్తుంది. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. త్వరగా తెల్లబడదు.
     

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement