సరైన పోషణ, తగినంత శ్రద్ధ లేకపోతే జుట్టు పొడిబారి ఎండుగడ్డిలా బరకగా మారడమేగాక, చివర్లు చిట్లిపోయి మరింత నిర్జీవంగా కనిపిస్తుంటుంది. ఇలా కనిపించగానే వెంటనే చిట్లిన వెంట్రుకలను కత్తెరతో కత్తిరించేస్తుంటారు.
చివర్లు తీసేసినప్పటికీ కొద్దిరోజుల్లో సమస్య మొదటికే వస్తుంది. చీటికి మాటికి జుట్టు కత్తిరించే ముందు ఈ చిట్కాలను పాటించి చూడండి జుట్టు పొడిబారడం, చిట్లడం కూడా తగ్గుతుంది.
ఇలా చేయండి..
►పదేపదే వెంట్రుకలు చిట్లిపోతుంటే గోరు వెచ్చని నూనెతో కుదుళ్ల నుంచి చివర్ల వరకు మర్దన చేయాలి.
►వారానికి కనీసం రెండు సార్లు మర్దన తప్పనిసరిగా చేయాలి.
►జుట్టుని ఆరబెట్టడానికి, స్ట్రెయిటనింగ్, రింగులుగా మార్చుకోవడానికి హెయిర్ డ్రయ్యర్‌ను తరచూ వినియోగించకూడదు.
►పదేపదే హెయిర్ డ్రయ్యర్ వాడడం వల్ల జుట్టు పొడిబారిపోయి, చిట్లిపోతుంది.
తరచూ షాంపుతో తలస్నానం వద్దు!
►ముఖం జిడ్డుకారుతుందని పదేపదే షాంపుతో తలస్నానం చేస్తే.. మాడు నుంచి సహజసిద్ధంగా విడుదలయ్యే తైలాలు క్రమంగా తగ్గుముఖం పడతాయి.
►ఈ తైలాల విడుదల తగ్గితే వెంట్రుకలు పొడిబారి, చిట్లిపోతాయి.
►ఎప్పుడు తలస్నానం చేయాలనుకున్నా ముందుగా తలకు నూనె పట్టించి అరగంట తరువాతే తలస్నానం చేయాలి.
గోరువెచ్చని నీటితోనే!
►మరీ ఎక్కువ వేడి... లేదా మరీ చల్లగా ఉన్న నీళ్లు కాకుండా గోరువెచ్చని నీటితోనే తలస్నానం చేయాలి.
►తలస్నానం చేసిన తరువాతే హెయిర్ కండీషనర్ రాసుకోవాలి.
►అప్పుడే వెంట్రుకలకు మంచి పోషణ అంది మెరుపుని సంతరించుకుంటాయి.
►కండీషనర్‌ను చివర్లకు పట్టించడం ద్వారా జుట్టుకు మంచి పోషణ అందుతుంది.
చదవండి: Hair Care Tips: ఉల్లి రసాన్ని కొబ్బరి నూనెతో కలిపి జుట్టుకు పట్టిస్తే!
Beauty Tips: బీట్‌రూట్ అలోవెరా జెల్‌తో ముఖం మీది మచ్చలు మాయం! అయితే..
Comments
Please login to add a commentAdd a comment