How to Make Your Hair Grow Faster and Stronger: Simple Tips - Sakshi
Sakshi News home page

Hair Tips: వర్షకాలంలో జుట్టు ఎక్కువగా ఊడిపోతుందా? అయితే ఇలా చేయండి

Published Thu, Jul 6 2023 10:19 AM | Last Updated on Fri, Jul 14 2023 3:37 PM

How to Make Your Hair Grow Faster and Stronger - Sakshi

♦ వాతావరణంలో మార్పుల వల్ల లేదా జుట్టు స్వభావం వల్ల ఒకోసారి తలస్నానం చేసినప్పటికీ వెంట్రుకలు వాసన వస్తుంటాయి. కొంతమందిలో వాసనతోపాటు జుట్టు ఊడిపోతుంటుంది. ఈ సమస్య నివారణకు ఇంట్లోనే సులభంగా చేసుకోదగిన ఈ రెండు చిట్కాలు చక్కగా పనిచేస్తాయి.
 

♦ అలోవెరా జెల్‌ లేదా అలోవెరా నూనెను వారానికి ఒకసారి తలకు పట్టించి గంట తరువాత కడిగితే వెంట్రుకల నుంచి వచ్చే వాసన పోతుంది. అలోవెరాలోని విటమిన్‌ ఎ, సి, ఇ, బీ12 లు జుట్టుకు అంది పెరుగుదలకు దోహద పడతాయి.


♦ శీకా కాయ, ఉసిరిపొడి, కరివేపాకు, మందార పువ్వులను సమపాళ్లల్లో తీసుకుని రాత్రంతా నానబెట్టాలి. మరుసటిరోజు ఉదయం వీటన్నింటిని పేస్టు చేయాలి. ఈ పేస్టుని జుట్టుకి పట్టించి అరగంట తరువాత షాంపూతో కడిగేయాలి. వారానికి మూడుసార్లు ఇలా చేయడం వల్ల కురుల నుంచి వచ్చే చెడువాసన పోవడంతోపాటు, జుట్టుకూడా పెరుగుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement