పైనా‘పిల్’ను తినేవారు వేరుగా ఏ ‘పిల్’ తీసుకోనక్కర్లేదని కొందరు చమత్కరిస్తుంటారు. అందుకే దీన్ని ఆరోగ్యాల ఆవాస కేంద్రంగా పిలుస్తారు. ఇందులో విటమిన్–సి పాళ్లు చాలా ఎక్కువ. దాంతో ఎన్నో రకాల వ్యాధుల నుంచి రక్షణ కల్పించే రోగనిరోధక శక్తి సమకూరుతుంది. పైనాపిల్‌తో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని. పైనాపిల్‌లో పీచుపదార్థాలు చాలా ఎక్కువ. దాంతో ఇది జీర్ణవ్యవస్థకు చేసే మేలు ఇంతా అంతా కాదు. మలబద్ధకాన్ని నివారిస్తుంది. నీళ్ల విరేచనాల్ని (డయేరియాను) అరికడుతుంది. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వ్యాధిగ్రస్తులకు ఇదొక స్వాభావిక చికిత్స. పైనాపిల్‌లోని ‘బ్రొమిలైన్’ అనే ఎంజైమ్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలున్నాయి. అందుకే ఏవైనా గాయాలైనప్పుడు పైనాపిల్‌ను తినిపిస్తే.. నొప్పి, వాపు, మంట (ఇన్‌ఫ్లమేషన్) వెంటనే తగ్గిపోతాయి. గాయాలు త్వరగా మానుతాయి. క్యాల్షియమ్ పుష్కలంగా ఉన్నందున ఎముకల ఆరోగ్యం మెరుగుపరచడానికి పైనాపిల్ బాగా ఉపకరిస్తుంది. ఆర్థరైటిస్ వంటి అనేక జబ్బుల్లో వచ్చే నొప్పి, మంట వంటి లక్షణాలనూ ఇది సమర్థంగా అరికడుతుంది.
ఇందులోని విటమిన్–సి ఒక శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. దాంతో పాటు విటమిన్–ఏ, ఫ్లేవనాయిడ్స్ వంటివి అన్నీ కలిసి చాలా రకాల క్యాన్సర్లను నివారిస్తాయి. ఇందులో విటమిన్–ఏ కూడా పుష్కలంగా ఉండటం వల్ల దీన్ని తీసుకునేవారిలో కంటి చూపు బాగుంటుంది. అంతేకాదు కంటికి సంబంధించిన అనేక వ్యాధులు కూడా నివారితమవుతాయి. ఇందులోని విటమిన్–సి, బ్రొమిలైన్‌ల సంయుక్త ప్రభావం వల్ల శ్వాసవ్యవస్థకు సంబంధించిన చాలా జబ్బుల నివారణ జరుగుతుంది. వాయునాళాల్లో మ్యూకస్ అతిగా పెరగడాన్ని అదుపు చేస్తుంది. కళ్లె/కఫాన్ని తగ్గిస్తుంది. ఆస్తమాను అరికడుతుంది. ఇందులోని యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణం కూడా ఆస్తమాను అదుపు చేయడానికి తోడ్పడుతుంది.
నాపిల్ పండు దీర్ఘకాలం యౌవనంగా ఉండేందుకు తోడ్పడుతుంది. చర్మం ఏజింగ్ ప్రక్రియకు గురికాకుండా కాపాడుతుంది. ముడుతలను నివారిస్తుంది. చర్మాన్ని బిగుతుగా ఉంచేందుకు అవసరమైన కొలాజెన్‌ను సమకూర్చి, వయసు పెరిగినా చర్మాన్ని బిగువుగానే ఉండేలా చేస్తుంది. పైనాపిల్‌లో పొటాషియమ్ పుష్కలంగా ఉండటం వల్ల అధిక రక్తపోటును సమర్థంగా నివారిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. ఫలితంగా రక్తనాళాలలో రక్తం సాఫీగా ప్రవహించడానికి తోడ్పడుతుంది. ఈ విధంగా కూడా హైబీపీ అనర్థాలను తగ్గిస్తుంది. మూత్రపిండాల్లోని రాళ్లను సహజసిద్ధంగా తొలగిస్తుంది.
పిల్స్‌ని దూరంగా ఉంచే పిల్
Published Wed, May 16 2018 12:03 AM | Last Updated on Wed, May 16 2018 12:03 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment