![Chocolate odors with pineapple seed powder - Sakshi](/styles/webp/s3/article_images/2018/10/31/Untitled-5.jpg.webp?itok=bbgjoS9k)
మనం పనస తొనలు తింటాం. పిక్కలు పారబోస్తాం! చిత్రమైన విషయమేమిటంటే.. ఈ పనస పిక్కలు చాలా బలవర్ధకమైనవి. బ్రెజిల్ శాస్త్రవేత్తలు తాజాగా ఏం చెబుతున్నారంటే... పనస పిక్కల పొడితో చాక్లెట్ రంగానికి ఎంతో మేలు జరుగుతుందీ అని! అదెలా అని ఆశ్చర్యపోవద్దు. చాక్లెట్ తయారీకి కోకా కాయల అవసరముంటుందని మీకు తెలుసు కదా.. డిమాండ్ పెరిగిపోతున్న కొద్దీ ఈ కోకా గింజల ధరలు పెరిగిపోతున్నాయని ఫెర్నాండా పాపా స్పాడ అనే శాస్త్రవేత్త తెలిపారు.
50 నుంచి 75 శాతం పనస గింజల పొడి.. పాలు, కాఫీ గింజలతో తయారు చేసిన కాఫీ వాసన, రుచిలో మామూలు కాఫీకి ఏమాత్రం తీసిపోదని ఆయన చెప్పారు. సాధారణంగా ఈ రకమైన కాఫీకి కోకా గింజలను వాడుతూంటారు. అంతర్జాతీయ కోకా సంస్థ లెక్కల ప్రకారం గత ఏడాది దాదాపు 456 కోట్ల టన్నుల కోకా గింజలను వాడుకున్నారు. డిమాండ్ కూడా ఏటికేడాదీ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో కోకా గింజలకు ప్రత్యామ్నాయాలను గుర్తించేందుకు చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా పనస గింజలను వేయించి పొడి చేస్తే అది కోకా గింజల మాదిరిగానే పనిచేస్తాయని గుర్తించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment