Coffee beans
-
అధికారిక దోపిడీ
జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో కాఫీ ధరలకుస్థానికంగా నిర్ణయించిన ధరలకు పొంతన ఉండటం లేదు. పార్చిమెంట్, చెర్రీ కిలోకు రూ.వందకు పైగా వ్యత్యాసం ఉన్నందున భారీగా నష్టపోతున్నామని గిరి రైతులు వాపోతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ జీసీసీ నిర్ణయించిన ధరలు తమను దోపిడీ చేసేలా ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సాక్షి,పాడేరు: కాఫీకి జాతీయ, అంతర్జాతీయస్థాయి మార్కెట్లో మంచి ధరలు ఉండటంతో ఈ ఏడాది అదేస్థాయిలో గిట్టుబాటు ధర కల్పించాలని అల్లూరి జిల్లా అధికార యంత్రాంగానికి గిరి రైతులు విన్నవించుకుంటున్నారు. బెంగళూరు మార్కెట్లో పార్చ్మెంట్ కాఫీ కిలో రూ.430 నుంచి రూ.450, అరిబికా చెర్రికి కూడా కిలో రూ.250 ధర ఉంది. చాలా దేశాల్లో కాఫీ దిగుబడులు తగ్గడంతో ఈ ఏడాది డిమాండ్ నెలకొంది. పార్చ్మెంట్ కాఫీ గింజల ధర మున్ముందు మరింత పెరిగు పరిస్థితులు కనిపిస్తున్నాయి. మన్యంలో 1.50 వేల ఎకరాల్లో కాఫీ తోటలు ఉండగా సుమారు 17 వేల టన్నుల వరకు దిగుబడి వస్తోంది. కాఫీ రైతుల నుంచి కొనుగోళ్లకు ఐటీడీఏ, జీసీసీ కార్యాచరణ రూపొందించాయి. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు కూడా రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు ముందుకువచ్చాయి. అయినప్పటికీ జాతీయస్థాయి మార్కెట్లో ధరలకు అనుగుణంగా తమకు చెల్లించడం లేదని గిరి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిమాండ్ ఉన్నా..గిట్టుబాటు ధరలేక.. బెంగళూరు జాతీయ మార్కెట్లో కాఫీ గింజలకు రికార్డు ధరలు ఉన్నప్పటికీ గిరిజన రైతులకు మాత్రం గిట్టుబాటు ధర లేకపోతోంది.కాఫీ సీజన్‌కు ముందు జీసీసీ పార్చ్మెంట్ కాఫీ గింజలను కిలో రూ.285,అరబికా చెర్రి రూ.150 ధరకు కొనుగోలు చేస్తామని ప్రకటించింది. అయితే బెంగళూరు మార్కెట్లో పార్చ్మెంట్ కాఫీ ధరలు కిలోకు రూ.400 దాటడంతో జీసీసీ అపెక్స్ కమిటీ కూడా ఏజెన్సీలో కొనుగోలు ధరలను కాస్త పెంచింది.పార్చ్మెంట్ కిలో రూ.320, అరబికా చెర్రిని కిలో రూ.170, రొబస్టా చెర్రి కిలో రూ.100 ధరకు కొనుగోలు చేస్తామని జీసీసీ ప్రకటించింది. బెంగళూరు మార్కెట్లో ధరలకు జీసీసీ ప్రకటించిన ధరలకు పొంతన లేకపోవడంతో కాఫీ రైతులు మండి పడుతున్నారు. పార్చ్మెంట్ కాఫీ గింజలు రూ.450, అరబికా చెర్రి కిలో రూ.250 ధర ఉన్నందున అందుకు తగ్గట్టుగా తమకు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కనీసం పార్చ్మెంట్ కిలో రూ.420, చెర్రి కిలో రూ.200 ధరకు కొనుగోలు చేసేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. కాఫీ పండ్ల ధర అంతే.. పండ్ల దశలో కాఫీ పంటను అమ్ముకునే కాఫీ రైతులకు కూడా గిట్టుబాటు ధర కరువైంది. కిలో కాఫీ పండ్లను కిలో రూ.44ధరతో చింతపల్లి మాక్స్ సొసైటీ ద్వారా ఐటీడీఏ కొనుగోలు చేయిస్తోంది. బెంగళూరు మార్కెట్లో పెరిగిన ధరలు ప్రకారం చూసుకుంటే కిలో పండ్లకు కనీసం రూ.60ధర అయిన చెల్లించాల్సి ఉంది. అయితే ఐటీడీఏ మాత్రం ధరలు పెంచకపోవడంతో కాఫీ పండ్లను తక్కువ ధరకే అమ్ముకుంటూ కాఫీ రైతులు ఉసూరుమంటున్నారు. కొన్ని ప్రైవేట్ సంస్థలు మాత్రం కాఫీ పండ్లకు కిలో రూ.60 చెల్లిస్తున్నాయి. గిట్టుబాటు ధరలు కల్పించాల్సిన ప్రభుత్వ యంత్రాంగంలోని జీసీసీ, ఐటీడీఏలు తక్కువ ధరలతో కాఫీ ఉత్పత్తులను కొనుగోలు చేయడం అన్యాయమని కాఫీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కాఫీ పండ్ల ధర పెంచాలికాఫీ పండ్లకు కూడా గిట్టుబాటు ధర కరువైంది. కిలో రూ.44తో చింతపల్లి మాక్స్ సంస్థ కొనుగోలు చేస్తుంది. ఈ తక్కువ ధరతో అమ్ముకుంటే నష్టమే మిగులుతుంది.కిలో రూ.70ధరతో కాఫీ పండ్లను ఐటీడీఏ కొనుగోలు చేయాలి. ఈ ఏడాది జాతీయ, అంతర్జాతీయస్థాయి మార్కెట్లో ధరలు బాగున్నాయి. అందుకు తగ్గట్టుగా ధరల చెల్లించేలా పాడేరు ఐటీడీఏ, గిరిజన సహకార సంస్థ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. – డిప్పల సురేష్ బాబు, కాఫీ రైతు, గుర్రగరువు, పాడేరు మండలంఅధికారులతో కమిటీ వేస్తాంఏజెన్సీలోని కాఫీపంట సాగు చేస్తున్న రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి న్యాయం చేస్తున్నాం.బెంగళూరు కాఫీ మార్కెట్లో నాణ్యత ప్రకారం రోజువారి కాఫీ ఉత్పత్తుల ధరలపై సమీక్షించేందుకు అ«ధికారులతో కమిటీ వేస్తాం. కాఫీ రైతులు నష్టపోకుండా అపెక్స్ కమిటీ ఆమోదంతో జీసీసీ ఇప్పటికే ధరలను పెంచి కొనుగోలుకు ఏర్పాట్లు చేసింది. చింతపల్లి మాక్స్ సంస్థకు కాఫీ పండ్లను అమ్ముకుంటున్న కాఫీ రైతులకు న్యాయం చేస్తాం. కాఫీ గింజల ఉత్పత్తి అనంతరం బహిరంగ మార్కెట్లో వేలం వేసి అమ్మకాల ద్వారా వచ్చే లాభాలను ఆయా కాఫీ రైతులకు బోనస్ రూపంలో చెల్లిస్తాం. – ఏఎస్ దినేష్ కుమార్, కలెక్టర్, పాడేరు -
కాఫీ పరిమళం..! ఎంతో పరవశం..!!
ఒక సిప్ గొంతులోకి వెళ్తే ఎంత ఆస్వాదిస్తామో.. పొగలు కక్కే కప్పులోంచి ఆ పరిమళం నాసికకు సోకినా అంతే గొప్పగా ఆఘ్రాణిస్తామంటారు కాఫీ ప్రియులు. అలాంటి కాఫీ ప్రియుల నాసికలకు పరీక్ష పెట్టిన కప్పా సెషన్ ఆకట్టుకుంది. ఓ వైపు కాఫీల ఘుమఘుమలు.. మరోవైపు కాఫీ గింజల ఉత్పత్తి దారులతో చర్చలు.. వెరసి నిర్వహించిన క్రాఫ్టింగ్ కాఫీ కల్చర్ ఈవెంట్ నవాబుల నగరంలో పెరుగుతున్న కాఫీ సంస్కృతికి అద్దం పట్టింది. – సాక్షి, సిటీబ్యూరోకాఫీ ప్రియులు, కాఫీ గింజల పెంపకందారులు, కేఫ్ యజమానులు స్పెషాలిటీ కాఫీ కమ్యూనిటీకి చెందిన నిపుణులను ఒకేచోట చేర్చి నిర్వహించిన కార్యక్రమం ఆకట్టుకుంది. నగరానికి చెందిన ఫస్ట్ క్రాక్ స్పెషాలిటీ రోస్టర్స్ ఆధ్వర్యంలో మాదాపూర్‌లో ఉన్న కోరమ్‌లో బుధవారం సాయంత్రం నిర్వహించిన ఈ ఈవెంట్లో రత్నగిరి ఎస్టేట్ నుంచి తీసుకువచ్చిన సరికొత్త స్పెషాలిటీ కాఫీలను ప్రదర్శించారు.ఆకట్టుకున్న పరిమళాల గుర్తింపు..ఈ ఈవెంట్లో భాగంగా కప్పా సెషన్ పేరిట కాఫీ ఫ్లేవర్లను గుర్తించేందుకు కాఫీ ప్రియులకు అవకాశం ఇచ్చారు. విభిన్న రకాల కాఫీలను కప్పులలో అందజేసి వాటిని నాసిక ద్వారా ఆఘ్రానించడం ద్వారా ఫ్లేవర్లను గుర్తించడం, రేటింగ్ ఇవ్వడం వంటివి చేయడంలో కాఫీ లవర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా రత్నగిరి ఇంటర్నేషనల్ మేనేజింగ్ పార్టనర్ అశోక్ పాత్రే, ఫస్ట్ క్రాక్ స్పెషాలిటీ రోస్టర్స్ నిర్వాహకురాలు ఎస్ఆర్కె చాందినీలతో ఆహుతులకు ముఖాముఖి సెషన్ నిర్వహించారు.ఇవి చవవండి: టేస్ట్ 'బ్లాగుం'ది..! హాబీగా ఫుడ్ బ్లాగింగ్.. -
గిరిజన మహిళా రైతుకు ‘ఫ్లేవర్ ఆఫ్ ఇండియా ది ఫైన్ కప్’
సాక్షి, పాడేరు: బెంగళూరులో మూడు రోజుల పాటు జరిగిన ప్రపంచ కాఫీ సదస్సు–2023లో నాణ్యమైన కాఫీ గింజల ఉత్పత్తిలో అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన ఆదివాసీ మహిళా రైతు కిల్లో అశ్విని అవార్డు పొందారు. అరాబిక్ పార్చ్మెంట్ కాఫీ గింజల విభాగంలోని అన్ని ఫార్మెట్లలో నాణ్యమైన కాఫీ గింజలుగా అశ్విని పండించిన కాఫీ గింజలను జ్యూరీలోని అధికారుల బృందం గుర్తించింది. దేశంలోని 10 రాష్ట్రాల పరి«ధిలో సాగైన కాఫీ గింజలను ప్రదర్శించారు. మన రాష్ట్రానికి సంబంధించి 124 మంది గిరిజన రైతులు పార్చ్మెంట్ కాఫీ గింజల శాంపిళ్లను ప్రదర్శించారు. వీటిలో పెదబయలు మండలం కప్పాడ గ్రామానికి చెందిన ఆదివాసీ రైతు అశ్విని పండించిన కాఫీ గింజలు నాణ్యతలో భారత్‌లోనే నంబర్ వన్‌గా నిలిచాయని కాఫీ ప్రాజెక్ట్ అధికార వర్గాలు తెలిపాయి. దీంతో ‘ఫ్లేవర్ ఆఫ్ ఇండియా ది ఫైన్ కప్ అవార్డు–2023’ అశ్వినిని వరించింది. పలు దేశాలకు చెందిన ప్రతినిధులు, కేంద్ర కాఫీ బోర్డు ఉన్నతాధికారుల చేతుల మీదుగా ఆమె భర్త గాసన్న ఈ అవార్డును అందుకున్నారు. కాఫీ గింజల ఉత్తమ నాణ్యత అవార్డు రావడంపై కలెక్టర్ సుమిత్‌కుమార్, ఐటీడీఏ పీవో అభిషేక్, కేంద్ర కాఫీ బోర్డు డీడీ రమేష్, ఐటీడీఏ కాఫీ ఏడీ అశోక్ హర్షం వ్యక్తం చేశారు. -
కెఫిన్ లేని కాఫీ గింజలు..హాయిగా సిప్ చేయొచ్చు
కాఫీ అంటే ఇష్టపడనివారు ఉండరు. ఐతే ఈ కాఫీలో ఉండే కెఫిన్ మన శరీరంలో అత్యంత దుష్పరిణామాలకు దారితీస్తోంది. అందుకనే రోజుకు రెండు నుంచి మూడు కప్పులకు మించి కాఫీ తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. దీంతో పలు కంపెనీలు కెఫిన్ లేని కాఫీ పొడిని తయారు చేస్తున్నాయి. కానీ వాటి ఖరీదు ఎక్కువ. అందరూ కొనుగోలు చేయలేరు. ఆ సమస్యకు చెక్‌పెట్టి ఆరోగ్యకరమైన కాఫీని ఆస్వాదించేలా కెఫిన్ లేని కాఫీ గింజలను ఉత్పత్తి చేసేందుకు నాంది పలికారు బ్రెజిల్ శాస్త్రవేత్తలు. ఈ మేరకు బ్రెజిలియన్ కాఫీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చెందిన శాస్త్రవేత్తలు చేపట్టిన రెండు దశాబ్దాల ప్రాజెక్టులో చాలా వరకు పురోగతి సాధించారు. ఈ పరిశోధనలు ప్రముఖ కాఫీ పరిశోధనా కేంద్రం ఇన్స్టిట్యూటో అగ్రోనోమికో డీ కాంపినాస(ఐఏఎస్) ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ పరిశోధన ఫలితంగా అధిక దిగుబడినిచ్చే కాఫీ మొక్కలను అభివృద్ధి చేశారు శాస్త్రవేత్తలు. దీంతో బ్రెజిల్ వాణిజ్య పరంగా కాఫీ ప్రపంచ మార్కెట్లో పవర్‌హౌస్‌గా మారుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అనేక ఏళ్లుగా కెఫిన్ కంటెంట్ తక్కువుగా ఉన్న వివిధ కాఫీ మొక్కలను అభివృద్ధి చేయడమే గాక క్షేత్ర స్థాయిలో ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇది గనుక విజయవంతమైతే అతి పెద్ద వినియోగదారులైన యూరప్, యునైటెడ్ స్టేట్స్ వంటి వాటితో బ్రెజిల్‌కి సముచిత వాణజ్య మార్కెట్ ఏర్పడే అవకాశం ఉంటుందని చెప్పారు. అంతేగాక డీకాఫీన్(కెఫిన్ శాతం తగ్గించడం) తయారు చేస్తున్న కంపెనీలు తమ ఖర్చులను తగ్గించేందుకు మొగ్గు చూపతాయని అంటున్నారు. ప్రస్తుతం తాము బ్రెజిల్లో వివిధ ప్రాంతాల్లో ఈ డీకాఫిన్ మొక్కలను పెంచుతున్నామని, అవి గింజలను ఉత్పత్తి చేయడానికి సాధారణంగా రెండు నుంచి మూడేళ్ల పడుతుందని చెబుతున్నారు. అందువల్ల తమ పరిశోధన మరింత విజయవంతం కావడానికి తాము ఇంకాస్త సమయం నిరీక్షించాల్సి ఉందని చెబుతున్నారు. వాస్తవానికి సాధారణ కాఫీలో ఉండే కాఫీ మనల్ని ఉత్సాహంగా ఉంచేలా చేయడమే గాక రోజంతా మేల్కోని ఉండేలా శక్తినిస్తుంది. కానీ ఈ కెఫిన్ కడుపులో యాసిడ్లను పెంచి మంట లేదా గుండెల్లో నొప్పికి దారితీసే ప్రమాదం పొంచి ఉంది. దాన్ని నివారించేందుకే కెఫిన్ తక్కువగా ఉండే కాఫీ మొక్కలను అభివృద్ధి చేసే ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. ఇప్పటికే యూఎస్ వంటి దేశాల్లో 10 శాతం కెఫిన్ ఉన్న కాఫీని తయారు చేస్తున్నాయి కొన్ని కార్పొరేట్ సంస్థలు. ఇది కాస్త ఖర్చుతో కూడుకున్నది. దీన్ని అధిగమించేందుకే శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలు చేస్తున్నారు. కాగా, శాస్త్రవేత్తల బృందం మాత్రం తమ పరిశోధనలు విజయవంతమవుతాయని ధీమగా చెబుతున్నారు. (చదవండి: 127 గంటలు.. డ్యాన్స్!) -
చింతపల్లి మాక్స్ కాఫీకి రికార్డు ధర
సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): ది విశాఖ చింతపల్లి ట్రైబల్ కాఫీ ప్రొడ్యూసర్స్ మాక్స్ ఉత్పత్తి చేసిన కాఫీ గింజలు బహిరంగ వేలంలో రికార్డు ధర పలికాయి. కలెక్టరేట్లో కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆధ్వర్యంలో 135.25 మెట్రిక్ టన్నుల పాచ్మెంట్ కాఫీ గింజలు, 17.60 మెట్రిక్ టన్నుల ప్లోట్ చెర్రీ కాఫీ గింజల అమ్మకాలకు శుక్రవారం బహిరంగ వేలం నిర్వహించారు. తమిళనాడు, కర్ణాటక, ఏపీ నుంచి తొమ్మిది ట్రేడర్లకు చెందిన వ్యాపారులు వేలంలో పాల్గొన్నారు. కలెక్టర్ సుమిత్‌కుమార్, పాడేరు ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ సమక్షంలో వ్యాపారులు కొనుగోలు ధరలను ప్రకటించారు. పాడేరుకు చెందిన మోదమాంబ ట్రేడర్స్ అత్యధికంగా ధర ప్రకటించి బిడ్ దక్కించుకుంది. పాచ్మెంట్ కాఫీ గింజలకు కిలో రూ.312, చెర్రీ రకానికి కిలో రూ.142 చొప్పున రికార్డు ధర లభించింది. గతేడాది పాచ్మెంట్కు కిలో రూ.294, చెర్రీకి కిలో రూ.116 ధర మాత్రమే లభించింది. -
విరగ్గాసిన కాఫీ.. మురిసేలా మిరియం
సాక్షి,పాడేరు: గిరిజనుల సాగులో ఉన్న కాఫీ తోటల్లో ఈ ఏడాది కాపు అధికంగా ఉంది. విరగ్గాసిన కాయలతో పాడేరు డివిజన్లో తోటలు కళకళలాడుతున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ముందస్తుగానే పక్వానికి వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే పండ్ల దశకు చేరుకుంటున్నాయి. కాపు ఆశాజనకంగా ఉందని, దిగుబడులు బాగుంటాయని గిరిజన రైతులు ఆనందంగా చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఐటీడీఏ కాఫీ విభాగం గత 20ఏళ్ల నుంచి కాఫీ సాగును ప్రోత్సహిస్తోంది. పాడేరు డివిజన్లోని 11 మండలాల్లో సుమారు 2,10,000 ఎకరాల్లో కాఫీ తోటలుండగా 1,50,000 ఎకరాల విస్తీర్ణంలో గల కాఫీ తోటలు ఫలాసాయాన్ని ఇస్తున్నాయి. మే నెల నుంచి విస్తారంగా కురుస్తున్న వర్షాలు కాఫీ పంటకు ఎంతో మేలు చేశాయి. గత ఏడాది ఏడు వేల టన్నుల వరకు దిగుబడి రాగా, ఈ ఏడాది దిగుబడి మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కేంద్ర కాఫీ బోర్డు అధికారులు చెబుతున్నారు. ఆశాజనకంగా మిరియాల కాపు కాఫీ తోటల్లో గిరిజన రైతులు అంతర పంటగా సాగు చేస్తున్న మిరియాల కాపు కూడా ఆశాజనకంగానే ఉంది. ముందుగానే కాపు వచ్చింది. సుమారు లక్ష ఎకరాల కాఫీ తోటల్లో అంతర పంటగా మిరియాలను గిరిజన రైతులు సాగు చేస్తున్నారు. కాఫీ తోటకు నీడనిచ్చే సిల్వర్ ఓక్ వృక్షాలకు మిరియాల పాదులను ఎక్కించి అంతర్ పంటగా సాగు చేస్తున్నారు. ప్రతీ చెట్టుకు ఉన్న మిరియాల పాదుల ద్వారా కనీసం 10 కిలోల ఎండు మిరియాల దిగుబడి వస్తుంది. ఈ ఏడాది మిరియాల దిగుబడులు కూడా అధికంగానే ఉంటుందని ఉద్యానవన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కాఫీ, మిరియాల పంటకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఐటీడీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కాఫీ రైతులకు తగిన ప్రోత్సాహం అందిస్తున్నారు. (చదవండి: అమరావతి రైతుల పేరిట ఉత్తరాంధ్రలో యాత్ర ఎలా?: చెట్టి ఫాల్గుణ) -
ఈ కాఫీగింజల్లో ఉన్న వ్యక్తి ముఖాన్ని గుర్తించగలరా?
సోషల్ మీడియా వినియోగం పెరిగాక ప్రతి చిన్న విషయం ప్రజలకు తొందరగా చేరుతుంది. సోషల్ మీడియాలో వినోదభరిత వీడియోలే కాదు మెదడుకు మేతపెట్టే విషయాలు కూడా ఉంటాయి. మనకు తెలియని ఎన్నో నిజాలను, విశేషాలను నేర్చుకోవచ్చు. ఈ రకమైన దానినే ఆప్టికల్ ఇల్యూజన్ అంటారు. గందరగోళ రూపంలో ఉన్న ఫోటోలు, పెయింటింగ్స్‌లో నుంచి సమాధానాన్ని కనిపెట్టాల్సి ఉంటుంది. ఏకాగ్రతను పెంచి మెదడు చురుకుగా పనిచేయించడమే దీని వెనకున్న ఉద్ధేశ్యం. తాజాగా అలాంటి ఫోటోనే ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఒక ఫోటోలో పెద్ద సంఖ్యలో కాఫీ గింజలు ఉన్నాయి. అయితే అందులో ఓ మనిషి బొమ్మ కూడా దాగి ఉంది. దాన్ని కనుగొనాలాంటూ సవాల్ విసిరారు. కొంచెం జాగ్రత్తగా పరిశీలించి చూస్తే మనిషి ముఖాన్ని గుర్తించొచ్చు. మరి మీరు కూడా ట్రై చేయండి. కనిపెట్టడం కష్టంగా ఉంటే ఇక ఈ కింది చిత్రాన్ని చూడండి. అయితే మీరు ఫోటో, పెయింటింగ్ చూసే విధానం ద్వారా మీ మెదడు ,వ్యక్తిత్వం ముఖ్య లక్షణాలు తెలుస్తాయి. మూడు సెకన్లలోపు మనిషి ముఖాన్ని గుర్తించగలిగితే, మీ కుడి మెదడు మీ తోటివారి కంటే ఎక్కువగా అభివృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. మూడు సెకన్ల నుంచి ఒక నిమిషం పడితే, మీ మెదడు కుడి సగం పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. లేదా ఒకటి నుంచి మూడు నిమిషాల సమయం పట్టినట్లయితే, మీ మెదడు కుడి వైపు సమాచారాన్ని నెమ్మదిగా విశ్లేషిస్తుంది. ఒకవేళ మీకు మూడు నిమిషాలు సరిపోకపోతే, అలాంటి బ్రెయిన్ టీజర్ మీ మెదడుకు సవాలు విసురుతూనే ఉంటుందని ది మైండ్స్ జర్నల్ చెబుతోంది. చదవండి: విచిత్రమైన కేసు: గొర్రెకు మూడేళ్లు జైలు శిక్ష! -
Organic Coffee: ‘మన్యం’ కాఫీ.. రైతు హ్యాపీ
సాక్షి, విశాఖపట్నం: రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు లేకుండా.. విశాఖ మన్యంలో ప్రకృతి సిద్ధంగా పండుతున్న కాఫీ గింజలకు డిమాండ్ పెరిగింది. పల్ప్ తీసిన (క్లీన్) కాఫీ గింజలకు ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధర పలికింది. గత ఏడాది కిలోకు రూ. 90 నుంచి రూ. 110 వరకూ ఉన్న ధర ఈ ఏడాది రూ. 150 వరకూ పెరిగింది. ప్రస్తుతం అనుకూల వాతావరణ పరిస్థితుల్లో కాఫీ గింజల దిగుబడి కూడా బాగా పెరిగింది. దీంతో గిరిజన రైతులు కాఫీ తోటల సాగుపై మక్కువ చూపిస్తున్నారు. ఫలితంగా ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతోంది. 1985లో 10,107 ఎకరాల్లో ఉన్న కాఫీ తోటలు.. గతేడాది నాటికి 2,22,390 ఎకరాలకు విస్తరించాయి. ఈ సీజన్లో 1.65 లక్షల ఎకరాల్లో కాఫీ గింజల పంట వచ్చింది. దాదాపు 11,500 మెట్రిక్ టన్నుల మేర దిగుబడి వచ్చిందని పాడేరు ఐటీడీఏ కాఫీ ప్రాజెక్టు సహాయ సంచాలకులు రాధాకృష్ణ చెప్పారు. ఈ ఏడాది మరో 15 వేల ఎకరాల్లో కాఫీగింజల సాగును విస్తరిస్తామని తెలిపారు. రానున్న ఆగస్టు నెలలో నాటేందుకు వీలుగా నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేస్తున్నారు. మొక్కలు నాటిన ఐదేళ్ల తర్వాత ఫలసాయం చేతికొస్తుంది. ఏటా కాఫీ తోటల విస్తరణ.... సాధారణంగా మార్చి–ఏప్రిల్ నెలల్లో ఐదారు పెద్ద వర్షాలు, పూత దశలో 15 డిగ్రీల నుంచి 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, నీరు నిలవని సారవంతమైన ఏటవాలు భూములు కాఫీ సాగుకు అనుకూలం. ఇటువంటి అనుకూల పరిస్థితులున్న విశాఖ మన్యంలో 2025–26 సంవత్సరం నాటికి మరో 58 వేల ఎకరాలకు కాఫీ తోటలను విస్తరించాలనే లక్ష్యంతో ఐటీడీఏ కృషి చేస్తోంది. ప్రస్తుతం ఏజెన్సీలో దాదాపు 1.20 లక్షల విస్తీర్ణంలో వరి, చోడి, రాజ్మా, సామలు, మొక్కజొన్న, కందులు వంటి పంటలు సాగు చేస్తున్నారు. వాటి సాగు కన్నా కాఫీ, అంతరపంటగా మిరియాల సాగు లాభసాటిగా ఉండటంతో గిరిజన రైతులు కాఫీ సాగు వైపు మొగ్గు చూపిస్తున్నారు. విదేశాల్లో పెరుగుతున్న ప్రాచుర్యం... మన్యంలో పూర్తిగా సేంద్రియ విధానంలో పండుతున్న అరబికా రకం కాఫీ.. విదేశాల్లో అరకు కాఫీగా ప్రాచుర్యం పొందుతోంది. ఇక్కడి ఉత్పత్తిలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని జీసీసీ ఏటా వెయ్యి టన్నుల వరకూ క్లీన్ కాఫీ గింజలు కొనుగోలు చేస్తోంది. మరో పది శాతం స్థానిక ప్రైవేట్ వ్యాపారులు కొంటున్నారు. మిగతా 80 శాతం విదేశాలకు ఎగుమతి అవుతోంది. మహీంద్ర గ్రూప్‌నకు చెందిన అరకు గ్లోబల్ హోల్డింగ్స్ అనే సంస్థ ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ‘అరకు కాఫీ’ పేరుతో కాఫీ షాప్ ఏర్పాటు చేసింది. ధర అదుర్స్.. ఈ ఏడాది ఎకరానికి సగటున 100 నుంచి 120 కిలోల క్లీన్ కాఫీ గింజల దిగుబడి వచ్చింది. కిలోకు రూ. 140 నుంచి రూ. 150 వరకూ ధర ఉంది. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) కూడా ధర పెంచడంతో ప్రైవేట్ వ్యాపారులు, సంస్థలు పెంచక తప్పలేదు. ఇక కాఫీలో అంతరపంటగా ఒక్కో ఎకరాకు 150 నుంచి 160 మిరియం పాదులు ఉంటే అదనంగా రూ. 40 వేల వరకూ ఆదాయం రైతులకు వస్తోంది. విశాఖ మన్యంలోని 11 మండలాల్లో 244 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటి పరిధిలోని 3,952 గ్రామాల్లో 1.34 లక్షల కుటుంబాలు జీవిస్తున్నాయి. దాదాపుగా 200 గ్రామ పంచాయతీల పరిధిలో కాఫీ తోటలు ఉన్నాయి. 80 శాతం కుటుంబాలు వాటిపై ఆధారపడుతున్నాయి. విశాఖ మన్యంలో కాఫీ గింజల సాగును ప్రోత్సహించడానికి పాడేరు ఐటీడీఏ, కాఫీ బోర్డు ప్రాంతీయ పరిశోధన కేంద్రం (ఆర్‌సీఆర్‌ఎస్) విశేష కృషి చేస్తున్నాయి. విత్తనాలు, నర్సరీల ఏర్పాటుకు అవసరమైన సామగ్రిని రాయితీపై ఐటీడీఏ అందిస్తోంది. నర్సరీలను గిరిజన రైతులే స్వయంగా అభివృద్ధి చేసుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం... గిరిజనుల ఆర్థికాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రోత్సాహాలు అందిస్తోంది. చింతపల్లి ట్రైబల్ ఆర్గానిక్ కాఫీ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. చింతపల్లి మండలంలో చిన్న, సన్నకారు కాఫీ రైతులను సంఘటితం చేసి రైతు ఉత్పత్తిదారుల సంఘం (ఎఫ్‌పీఓ)ను ఏర్పాటు చేసింది. దీన్ని మాక్స్ (ఎంఏసీఎస్) యాక్ట్ కింద రిజిస్టర్ చేశారు. తద్వారా రైతులే తాము ఉత్పత్తి చేసిన కాఫీ పంటను మేలైన పద్ధతుల్లో పల్పింగ్ చేయించుకునే అవకాశం ఏర్పడింది. ఆ కాఫీ గింజలను టాటా కాఫీ లిమిటెడ్ తదితర పెద్ద సంస్థలకు విక్రయించడం ద్వారా అధిక ధర పొందుతున్నారు. ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో కాఫీ దిగుబడి వచ్చింది. వర్షపాతం, ఉష్ణోగ్రత, గాలిలో తేమ శాతం వంటి అనుకూల వాతావరణమే దీనికి కారణం. – రాధాకృష్ణ, సహాయ సంచాలకులు, పాడేరు ఐటీడీఏ కాఫీ ప్రాజెక్టు చదవండి: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! మే 31న ఉద్యోగ క్యాలెండర్ 104కు మరింత ప్రాచుర్యం: సీఎం వైఎస్ జగన్ -
కేరళలో ఏం జరుగుతుందో ఆలోచించారా?
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రం గతేడాది తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మూడు నెలల క్రితం ప్రారంభమైన ఆందోళన నేడు తీవ్రమైన విషయం తెల్సిందే. కేంద్రంతో జరిపిన పలు విడతల చర్చలు విఫలమవడంతో దేశవ్యాప్తంగా రైతులు సోమవారం నాడు ఎక్కడికక్కడ మహా ధర్నాలకు దిగగా, ప్రధానంగా పంజాబ్, హర్యానాలకు చెందిన రైతులు, రైతు నాయకులు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. ఈ చట్టాల వల్ల వ్యవసాయ రంగం కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళుతుందని, రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసే వ్యవసాయోత్పత్తుల ధరలను నిర్ణయించే అధికారం కూడా వారి చేతుల్లోకి వెళుతుందని రైతులు భయాందోళనలు వ్యక్తం చేస్తుండగా, అలాంటి ప్రమాదం లేకుండా రాష్ట్రాల పరిధిలోని ‘అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీస్ (ఏపీఎంసీ)’ చట్టాలు రక్షిస్తాయని కేంద్రం భరోసా ఇస్తోంది. ఏపీఎంసీ లాంటి చట్టం లేని కేరళ విషయంలో ఏం జరుగుతుందో ఆలోచించారా? ఈ అంశంపై ఇరువర్గాలు చర్చలు జరిపిన దాఖలాలు కనిపించడం లేదు. ఆ రాష్ట్రంలో ప్రధానంగా సాగుచేసే టీ, కాఫీలతోపాటు రబ్బర్ పరిశ్రమకు కూడా కేంద్రం ఆధ్వర్యంలో నడిచే బోర్డులు ఉన్నాయి. ఇతర వ్యవసాయోత్పత్తులకు నియంత్రణకు, మార్కెటింగ్‌కు ఎలాంటి చట్టాలు లేకపోవడం వల్ల ఆ రాష్ట్రంలో కాంట్రాక్ట్ వ్యవసాయం మొదలైంది. కేరళలో ప్రధానమైన తేయాకు పరిశ్రమలోకి బడా కార్పొరేట్ కంపెనీలు రావడంతో ఆ రంగంలో మధ్య, సన్నకారు రైతులకు ఎలాంటి పాత్ర లేకుండా పోయింది. ఇక బడా కాఫీ కార్పొరేట్ కంపెనీలు 1998 సంవత్సరం వరకు నేరుగా రైతుల నుంచి కాఫీ గింజలను సేకరించడం వల్ల రైతులకు నష్టం వాటిల్లలేదు. 1998లో కాఫీ గింజల సేకరణ నుంచి కాఫీ బోర్డు తప్పుకోవడంతో వారి నుంచి కాఫీ గింజలను సేకరించేందుకు దళారులు, చిన్న ట్రేడర్లు, కార్పొరేట్ సంస్థలు వచ్చాయి. నాటి నుంచి కాఫీ తోటల రైతులకు గిట్టుబాటు ధర లేకుండా పోయింది. అంతర్జాతీయంగా టీ, కాఫీ, రబ్బర్, ఇతర మసాలా దినుసులకు మార్కెట్ ఉండడంతో రాష్ట్ర రైతులు ప్రయోజనాలకన్నా కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలు ముఖ్యమయ్యాయి. ఈ నేపథ్యంలో రైతుల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు మండల స్థాయిలో వ్యవసాయ మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేయాలని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. చదవండి: ఆపిల్ ఫ్యాక్టరీలో విధ్వంసం.. రాజకీయ ప్రకంపనలు -
కుదరకపోయినా ఓ కప్పు
మంచి కాఫీ కావాలంటే మద్రాసు కాఫీ హౌసుకి వెళ్లాల్సిందే అంటారు కాఫీ ప్రియులు. మరీ అంత దూరమైతే అక్కర్లేదు. విశాఖపట్టణం దగ్గరలో ఉన్న అరకులోనే మంచి కాఫీ చాలా సంవత్సరాలుగా దొరుకుతోంది. కిందటి ఏడాది ఈ అరకు కాఫీకి పారిస్‌లో ‘ప్రిక్స్ ఎపిక్యూర్స్’ అవార్డు కూడా వచ్చింది! ఆ అవార్డును అందుకున్నది కాఫీ గింజల్ని పండించిన అరకు గిరిజన మహిళలు కావడం విశేషం. ఇంకొక విశేషం ఏంటంటే.. పారిస్‌లో ఇప్పుడు ‘అరకు’ అనే పేరున్న కాఫీ స్టాల్ ముందర జనం ఆగిపోతున్నారు. అరకు కాఫీ ఘనతను కేవలం కొన్ని కాఫీ గింజలు ప్రపంచానికి చాటుతున్నాయి. అరకు ప్రాంతంలో ఉండే గిరిజనులు పండించిన నాణ్యమైన కాఫీ గింజలు అవి! అరకు లోయలో గిరిజన మహిళల చేతి మీద సుమారు ఒకటిన్నర లక్షల ఎకరాల్లో కాఫీ గింజలు పండుతున్నాయి. అయితే ఈ గింజలకు అంతర్జాతీయంగా మార్కెట్ ఉన్నా, ఈ గిరిజనులు మాత్రం ఆర్థికంగా నేటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ‘‘మేం చాలా కష్టపడి పనిచేస్తున్నాం. ప్రతి ఒక్కరం పది బస్తాల గింజలు పండించుకుంటాం. వాటి నుంచి ఒక్కొక్కరం కనీసం సీజన్‌కి రెండు లక్షల రూపాయలు సంపాదించుకుంటేనే గిట్టుబాటు అవుతుంది. కానీ మాకు ఎనభై నుంచి తొంభై వేల రూపాయలు మాత్రమే వస్తోంది. ఖర్చులన్నీ పోగా, తిండి తినటానికి సరిపడేంత డబ్బు మాత్రమే మిగులుతోంది. మా ఆర్థికస్థితిలో ఎటువంటి ఎదుగుదల లేదు. దానితో మాలో చాలామందికి కాఫీ పండించాలనే ఆసక్తి సన్నగిల్లిపోతోంది’’ అంటున్నారు అరకు గిరిజన మహిళలు. చరిత్రలోకి వెళ్తే.. 1898లో తూర్పుగోదావరి తీర ప్రాంతంలో ఒక బ్రిటిష్ అధికారి ఉండేవారు. ఆయన అక్కడి వాతావరణం చూసి, అది కాఫీ పంటకు అనుకూలంగా ఉంటుందని కాఫీ పంట వేశారు. 1950లలో ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ కాఫీ పంటను సాగు చేయడం మొదలైంది. అలా క్రమేపీ అరకు కాఫీ రుచికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ‘అరకు కాఫీ’ అన్న పేరూ వచ్చింది. 1980 నాటికి రాష్ట్ర ప్రభుత్వం గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ప్రారంభించి, కాఫీ పంటను ప్రోత్సహించింది. ఒకానొక సమయంలో వరి పంట కంటే కాఫీ పంట మీద లాభాలు వచ్చాయి. దాంతో చాలామంది రైతులు కాఫీ పండించడం మొదలుపెట్టారు. రెండేళ్ల క్రితం పారిస్‌లో అరకు కాఫీ స్టోర్ తెరుచుకుంది. ఈ స్టోర్ కారణంగానే కిందటి ఏడాది అరకు గిరిజన మహిళలకు అవార్డు వచ్చింది. ఇంత కమ్మని కాఫీని పండిస్తున్న ఈ గిరిజన మహిళలకు మాత్రం శ్రమకు తగ్గ ఫలితం లభించడం లేదు! -
పనస విత్తనాల పొడితో చాక్లెట్ వాసనలు
మనం పనస తొనలు తింటాం. పిక్కలు పారబోస్తాం! చిత్రమైన విషయమేమిటంటే.. ఈ పనస పిక్కలు చాలా బలవర్ధకమైనవి. బ్రెజిల్ శాస్త్రవేత్తలు తాజాగా ఏం చెబుతున్నారంటే... పనస పిక్కల పొడితో చాక్లెట్ రంగానికి ఎంతో మేలు జరుగుతుందీ అని! అదెలా అని ఆశ్చర్యపోవద్దు. చాక్లెట్ తయారీకి కోకా కాయల అవసరముంటుందని మీకు తెలుసు కదా.. డిమాండ్ పెరిగిపోతున్న కొద్దీ ఈ కోకా గింజల ధరలు పెరిగిపోతున్నాయని ఫెర్నాండా పాపా స్పాడ అనే శాస్త్రవేత్త తెలిపారు. 50 నుంచి 75 శాతం పనస గింజల పొడి.. పాలు, కాఫీ గింజలతో తయారు చేసిన కాఫీ వాసన, రుచిలో మామూలు కాఫీకి ఏమాత్రం తీసిపోదని ఆయన చెప్పారు. సాధారణంగా ఈ రకమైన కాఫీకి కోకా గింజలను వాడుతూంటారు. అంతర్జాతీయ కోకా సంస్థ లెక్కల ప్రకారం గత ఏడాది దాదాపు 456 కోట్ల టన్నుల కోకా గింజలను వాడుకున్నారు. డిమాండ్ కూడా ఏటికేడాదీ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో కోకా గింజలకు ప్రత్యామ్నాయాలను గుర్తించేందుకు చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా పనస గింజలను వేయించి పొడి చేస్తే అది కోకా గింజల మాదిరిగానే పనిచేస్తాయని గుర్తించడం విశేషం. -
అరకు కాఫీపై నెస్లే ఆసక్తి
డిమాండ్‌ను బట్టి ఆంధ్రప్రదేశ్‌లోని అరకు నుంచి కూడా కాఫీ గింజలు సేకరించాలని ఎఫ్ఎంసీజీ సంస్థ నెస్లే యోచిస్తోంది. అలాగే ఉత్పత్తిని మెరుగుపర్చుకునే దిశగా కర్ణాటకలోని నంజన్‌గుడ్ కాఫీ ప్లాంటును రూ. 200 కోట్లతో ఆధునికీకరిస్తోంది. కాఫీ, నూడుల్స్ ప్లాంట్ల సందర్శన సందర్భంగా కంపెనీ అధికారులు వివరాలు తెలిపారు. అరకు కాఫీ గింజల కొనుగోలు కోసం ఇప్పటికే ప్రయత్నాలు జరిపామని, అయితే నాణ్యతకు సంబంధించి తిరస్కరణలపరమైన రిస్కులపై వారిలో నెలకొన్న సందేహాల కారణంగా ఫలించలేదని ప్లాంటు ఇంచార్జి నిర్మల షాపూర్కర్ పేర్కొన్నారు. అయితే పెరిగే డిమాండ్‌ను బట్టి వారు ముందుకొస్తే ఇక్కడ నుంచి కూడా సమీకరించగలమని ఆమె వివరించారు. -
ఇంటిప్స్
పిల్లలు స్కెచ్ పెన్నులతో గోడల మీద గీసిన గీతల్ని పోగొట్టాలంటే... వాటి మీద బేకింగ్ సోడా వేసి, క్లాత్‌తో బాగా రుద్దాలి బెండకాయ వేపుడు జిగురుగా అనిపించకూడదంటే... వేయించేటప్పుడు కాసింత నిమ్మరసం కానీ పెరుగుకానీ వేయాలి. ప్లాస్టిక్ బాక్సులు వాసన వస్తుంటే... వాటిలో కాసిని కాఫీ గింజలు కానీ, ఓ చిన్న బొగ్గు ముక్క కానీ వేసి మూత పెట్టాలి. ఓ రాత్రంతా అలా ఉంచితే ఉదయానికి వాసన పోతుంది. పకోడీలు సాఫ్ట్‌గా రావాలంటే... వేసేముందు పిండిలో కాసింత వేడినూనె కలపాలి. -
కాఫీ రుచి...నీళ్లలో ఉంది!
సర్వే ఉదయం లేవగానే కాఫీ రుచి కోసం నాలుక గోల పెడుతూ ఉంటుంది. ఆ కాఫీ కూడా ఎలా ఉండాలంటే... మన నాలుక దాన్ని రుచి చూడటం కోసమే పుట్టినట్లనిపించాలి. అయితే ఒక్కొక్కరు చేసే కాఫీ అమృతంలా ఉంటుంది. కొందరు చేసేది అంత రుచించదు. ఎందుకింత తేడా? ఎందుకంటే... కాఫీ తయారీ విషయంలో ఎవరి ఫార్ములా వాళ్లకు ఉంటుంది. ఖరీదైన కాఫీ బీన్స్, చిక్కటి పాలతోనే తయారు చేసే కాఫీ చాలా టేస్ట్‌గా ఉంటుందనేది చాలా మంది చెప్పే మాట. నాణ్యమైన విత్తనాలతో తయారు చేసే కాఫీ మరీ రుచిగా ఉంటుందనేది మరికొందరు అనే మాట. అయితే కాఫీ టేస్ట్ దాన్ని తయారు చేసేందుకు వాడే విత్తనాల మీదనో, కాఫీ పౌడర్ మీదనో కాదు, తయారీకి వాడే నీళ్ల మీదే ఆధారపడి ఉంటుందని అంటున్నారు పరిశోధకులు. ఆశ్చర్యంగా ఉంది కదూ ఈ మాట! బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ బాత్ పరిశోధకులు కాఫీ రుచుల మీద ఒక పెద్ద పరిశోధనే చేశారు. తద్వారా వాళ్లు కనిపెట్టిందేమిటంటే... కాఫీ తయారీలో వాడే నీళ్లను, ఆ నీళ్లలో ఉండే ఖనిజ లవణాలను బట్టి కాఫీ రుచి వస్తుందని! రోస్టెడ్ కాఫీ బీన్స్‌ను వేసి మరగ కాచినప్పుడు, ఆ గింజల్లోని రసాయనాలను నీళ్లు ఏ మేరకు సంగ్రహిస్తాయి అనేదాన్ని బట్టి కాఫీ రుచి ఉంటుందట. నీళ్లలోని మినరల్స్ స్థాయిని బట్టి ఆ రసాయనాలు కాఫీలో మిళితం అవుతాయట. అలా కెమికల్స్‌ను సంగ్రహించే శక్తి ఉన్న నీళ్లు పడితే కాఫీ అసలు రుచి ఏమిటో తెలుస్తుందని పరిశోధకులు నివేదికలో పేర్కొన్నారు. ఖరీదైన కాఫీ బీన్స్ వాడుతున్నప్పటికీ ఖనిజ లవణాల రహిత నీళ్లతో కాఫీ తయారు చేస్తే రుచిగా ఉండకపోవచ్చని, తక్కువ ధరలో లభించే కాఫీ విత్తనాలతో తయారు చేసే కాఫీ రుచిని కూడా అద్భుతంగా మార్చే శక్తి నీళ్లకు మాత్రమే ఉందని ఆ వర్సిటీ వాళ్లు తేల్చారు. కాఫీ రుచికి కీ ఎక్కడుందో తెలిసింది కదా... ఇక నీళ్ల మీద ఓ కన్నేయండి మరి!