ఇంటిప్స్
పిల్లలు స్కెచ్ పెన్నులతో గోడల మీద గీసిన గీతల్ని పోగొట్టాలంటే... వాటి మీద బేకింగ్ సోడా వేసి, క్లాత్‌తో బాగా రుద్దాలి బెండకాయ వేపుడు జిగురుగా అనిపించకూడదంటే... వేయించేటప్పుడు కాసింత నిమ్మరసం కానీ పెరుగుకానీ వేయాలి.
ప్లాస్టిక్ బాక్సులు వాసన వస్తుంటే... వాటిలో కాసిని కాఫీ గింజలు కానీ, ఓ చిన్న బొగ్గు ముక్క కానీ వేసి మూత పెట్టాలి. ఓ రాత్రంతా అలా ఉంచితే ఉదయానికి వాసన పోతుంది. పకోడీలు సాఫ్ట్‌గా రావాలంటే... వేసేముందు పిండిలో కాసింత వేడినూనె కలపాలి.