వెరైటీ కాఫీ పరిమళాలను ఆస్వాదించిన సిటిజనులు
ఒక సిప్ గొంతులోకి వెళ్తే ఎంత ఆస్వాదిస్తామో.. పొగలు కక్కే కప్పులోంచి ఆ పరిమళం నాసికకు సోకినా అంతే గొప్పగా ఆఘ్రాణిస్తామంటారు కాఫీ ప్రియులు. అలాంటి కాఫీ ప్రియుల నాసికలకు పరీక్ష పెట్టిన కప్పా సెషన్ ఆకట్టుకుంది. ఓ వైపు కాఫీల ఘుమఘుమలు.. మరోవైపు కాఫీ గింజల ఉత్పత్తి దారులతో చర్చలు.. వెరసి నిర్వహించిన క్రాఫ్టింగ్ కాఫీ కల్చర్ ఈవెంట్ నవాబుల నగరంలో పెరుగుతున్న కాఫీ సంస్కృతికి అద్దం పట్టింది. – సాక్షి, సిటీబ్యూరో
కాఫీ ప్రియులు, కాఫీ గింజల పెంపకందారులు, కేఫ్ యజమానులు స్పెషాలిటీ కాఫీ కమ్యూనిటీకి చెందిన నిపుణులను ఒకేచోట చేర్చి నిర్వహించిన కార్యక్రమం ఆకట్టుకుంది. నగరానికి చెందిన ఫస్ట్ క్రాక్ స్పెషాలిటీ రోస్టర్స్ ఆధ్వర్యంలో మాదాపూర్‌లో ఉన్న కోరమ్‌లో బుధవారం సాయంత్రం నిర్వహించిన ఈ ఈవెంట్‌లో రత్నగిరి ఎస్టేట్ నుంచి తీసుకువచ్చిన సరికొత్త స్పెషాలిటీ కాఫీలను ప్రదర్శించారు.
ఆకట్టుకున్న పరిమళాల గుర్తింపు..
ఈ ఈవెంట్లో భాగంగా కప్పా సెషన్ పేరిట కాఫీ ఫ్లేవర్లను గుర్తించేందుకు కాఫీ ప్రియులకు అవకాశం ఇచ్చారు. విభిన్న రకాల కాఫీలను కప్పులలో అందజేసి వాటిని నాసిక ద్వారా ఆఘ్రానించడం ద్వారా ఫ్లేవర్లను గుర్తించడం, రేటింగ్ ఇవ్వడం వంటివి చేయడంలో కాఫీ లవర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా రత్నగిరి ఇంటర్నేషనల్ మేనేజింగ్ పార్టనర్ అశోక్ పాత్రే, ఫస్ట్ క్రాక్ స్పెషాలిటీ రోస్టర్స్ నిర్వాహకురాలు ఎస్‌ఆర్‌కె చాందినీలతో ఆహుతులకు ముఖాముఖి సెషన్ నిర్వహించారు.
ఇవి చవవండి: టేస్ట్ 'బ్లాగుం'ది..! హాబీగా ఫుడ్ బ్లాగింగ్..
Comments
Please login to add a commentAdd a comment