బహిరంగ వేలం నిర్వహిస్తున్న కలెక్టర్ సుమిత్‌కుమార్
సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): ది విశాఖ చింతపల్లి ట్రైబల్ కాఫీ ప్రొడ్యూసర్స్ మాక్స్ ఉత్పత్తి చేసిన కాఫీ గింజలు బహిరంగ వేలంలో రికార్డు ధర పలికాయి. కలెక్టరేట్‌లో కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆధ్వర్యంలో 135.25 మెట్రిక్ టన్నుల పాచ్‌మెంట్ కాఫీ గింజలు, 17.60 మెట్రిక్ టన్నుల ప్లోట్ చెర్రీ కాఫీ గింజల అమ్మకాలకు శుక్రవారం బహిరంగ వేలం నిర్వహించారు.
తమిళనాడు, కర్ణాటక, ఏపీ నుంచి తొమ్మిది ట్రేడర్లకు చెందిన వ్యాపారులు వేలంలో పాల్గొన్నారు. కలెక్టర్ సుమిత్‌కుమార్, పాడేరు ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ సమక్షంలో వ్యాపారులు కొనుగోలు ధరలను ప్రకటించారు. పాడేరుకు చెందిన మోదమాంబ ట్రేడర్స్ అత్యధికంగా ధర ప్రకటించి బిడ్ దక్కించుకుంది. పాచ్‌మెంట్ కాఫీ గింజలకు కిలో రూ.312, చెర్రీ రకానికి కిలో రూ.142 చొప్పున రికార్డు ధర లభించింది. గతేడాది పాచ్‌మెంట్‌కు కిలో రూ.294, చెర్రీకి కిలో రూ.116 ధర మాత్రమే లభించింది.
Comments
Please login to add a commentAdd a comment