Taste డిఫరెంట్ | Different Taste | Sakshi
Sakshi News home page

Taste డిఫరెంట్

Published Thu, Jan 8 2015 1:00 AM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM

Taste డిఫరెంట్ - Sakshi

Taste డిఫరెంట్

బర్గర్లు... పిజ్జాలు. కాదంటే నూడిల్స్...
 పానీపూరీలు... జంక్ ఫుడ్‌కు ఎడిక్ట్ అయిపోయారు పిల్లలు.
 అప్పుడప్పుడూ అయితే ఓకే... కానీ తిండి మానేసి వాటినే లాగించేస్తున్నారు. స్కూల్‌కు లంచ్ బాక్స్ ఇచ్చినా... చిరు తిళ్లతో సరిపెట్టేసుకుంటున్నారు. శరీరానికి శక్తినిచ్చి... ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండ్లు బాక్స్‌లో ఎన్ని పెట్టినా... వెంట తీసుకెళతారే గానీ తినేవారెంతమంది! మరి వారిని జంక్ ఫుడ్స్‌కు దూరంగా ఉంచడమెలా..! స్నాక్స్‌ను ఫ్రూట్స్‌తో రీప్లేస్ చేసేదెలా! పిల్లల సైకాలజీ ప్రకారం వాళ్లకు అన్నీ కొత్తగా, డిఫరెంట్‌గా, వెరైటీగా ఉండాలి. అంతకు మించి ఆకర్షణీయంగా కనిపించాలి అంటారు సెలబ్రిటీ చెఫ్ రుచికాశర్మ. అలాంటి చిన్నారుల కోసం ఇంట్లో సులువుగా చేసుకొనేలా ఆమె ఓ కొత్త కాన్సెప్ట్‌తో మెనూ రెడీ చేశారు. ఓ లుక్కేద్దాం రండి...

 
స్టార్ హోటల్‌కు వెళ్లామనుకోండి... ఎప్పుడూ తినే ఫుడ్డే. కాకపోతే ప్లేట్‌లో కాస్త విభిన్నంగా డెకరేట్ చేసి సర్వ్ చేస్తారు. టేస్ట్ ఎలా ఉన్నా... చూడగానే ఓ పట్టు పట్టేయాలనిపిస్తుంది. అలాగే... పిల్లల మనస్తత్వం కూడా. వారు ఎక్కువగా ఇష్టపడే చాక్లెట్‌ను పండ్లకు మిక్స్ చేసి... దానికింత డెకరేషన్ చేస్తే ఠక్కున అక్కడ వాలిపోతారు.
 
లాలీపాప్‌లా: రకరకాల పండ్లను ముక్కలుగా కోసి, చాక్లెట్ క్రీమ్‌లో డిప్ చేయాలి. దానికి లాలీపాప్‌లా టూత్ పిక్ గుచ్చి ఓ అరగంట ఫ్రిజ్‌లో పెట్టి పిల్లల చేతికందిస్తే... లొట్టలేసుకుంటూ తింటారు.
 
కబాబ్ టైప్: అరటి పండు, పైనాపిల్, యాపిల్ ముక్కలు, చెర్రీస్ వంటివి కబాబ్‌లా ఓ పుల్లకు గుచ్చి తేనెలో గానీ, షుగర్ సిరప్‌లో గానీ డిప్ చేస్తే... చిన్నారుల నోరూరిపోతుంది.
 
డ్రైఫ్రూట్స్‌తో: రోజూ ఒకటే వెరైటీ చేస్తే ఎవరికైనా బోరు కొడుతుంది. సో.. ఎప్పటికప్పుడు కాస్త విభిన్నంగా ప్రయత్నించాలి. అందుకే అప్పుడప్పుడూ పండ్లకు చాక్లెట్ క్రీమ్ డిప్‌తో పాటు వాటిపై డ్రై ఫ్రూట్స్ ముక్కలు కూడా వేస్తే... చూడగానే తినేయాలనిపిస్తుంది.
 
ఫ్రూట్ బైట్:
వేడి వేడి బజ్జీల మధ్యలో పండ్ల ముక్కలు పెట్టి ఫ్రూట్ బైట్‌లా చేయొచ్చు. అలాగే శాండ్‌విచ్‌లా బ్రెడ్ ముక్కల మధ్యలో ఫ్రూట్ స్లైసెస్ ఉంచి, జాం పూసి కలర్‌ఫుల్‌గా మారిస్తే... రుచికి రుచీ ఉంటుంది. చూడ్డానికి ఆకర్షణీయంగానూ కనిపిస్తుంది.
 
కుకీస్‌తో: పండ్ల ముక్కలను కుకీస్ మధ్యలో పేర్చి, షుగర్ సిరప్ లేదంటే చాక్లెట్ క్రీమ్‌లో డిప్ చేయాలి. డీప్ ఫ్రిజ్‌లో పెట్టి కాసేపటి తరువాత తింటే... అబ్బో ఆ టేస్టే వేరు. వీటన్నింటికీ సీజనల్ ఫ్రూట్స్‌ను వాడితే మరింత రుచిగా ఉంటాయి.
 
- శిరీష చల్లపల్లి
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement