lollipop
-
11,602 లాలీపాప్‌లతో వెరైటీ రికార్డు.. కండిషన్స్ ఆప్లై!
దక్షిణాఫ్రికాకు చెందిన ఎన్ఎస్ఆర్ఐ అనే స్వచ్ఛంద సంస్థ లాలీపాప్‌లతో వెరైటీ గిన్నిస్ రికార్డు సృష్టించింది. లాలీపాప్‌లతో రికార్డు అనగానే వాటిని గుటుక్కుమనిపించడం వంటిదేదో అయ్యుంటుందిలే అని అనుకోకండి. ఎందుకంటే ఎన్ఎస్ఆర్ఐకి చెందిన 27 మంది వాలంటీర్లు డర్బన్ నగరంలోని ఓ బీచ్ ఒడ్డున లాలీపాప్లను ఒకదాని పక్కన ఒక లాలీపాప్‌ను పేర్చడం ద్వారా పాత రికార్డును బద్దలుకొట్టారు. ఇందులో విశేషం ఏముందంటారా? లాలీపాప్‌లతో ఒక కిలోమీటర్‌కుపైగా పొడవైన గీతను తయారు చేసినందుకే గిన్నిస్ నిర్వాహకులు అధికారికంగా దీన్ని రికార్డుగా గుర్తించారు. ఇందుకోసం ఎన్ని లాలీపాప్‌లు ఉపయోగించారో తెలుసా? ఏకంగా 11,602 లాలీపాప్‌లు! చూసేందుకు సాదా సీదాగా అనిపించినా దీన్ని సాధించేందుకు పెద్ద కసరత్తే జరిగింది. లాలీ పాప్‌ల కొసలన్నీ ఒకదాన్ని ఒకటి తాకుతూ ఉంటేనే దీన్ని రికార్డుగా గుర్తిస్తామని గిన్నిస్ నిర్వాహకులు షరతు విధించారట. అలాగే ఒకసారి మొదలుపెట్టాక మళ్లీ వెనకాల పేర్చిన లాలీపాప్లను జరపడం వంటివి చేయరాదని తేల్చిచెప్పారట. అయినప్పటికీ వాలంటీర్లు కేవలం 90 నిమిషాల వ్యవధిలోనే దీన్ని చేసి చూపించారు. తద్వారా గతంలో 9,999 లాలీపాప్‌లతో తయారు చేసిన పొడవాటి గీత రికార్డును తిరగరాశారు. చదవండి: 60సెకన్లలో ఏకంగా మూడున్నర కోడికాళ్లను మింగేసింది View this post on Instagram A post shared by StumboSA (@stumbosa) -
స్వీట్ కార్న్ లాలీపాప్స్, చికెన్ బీట్రూట్ సమోసా తయారీ ఇలా..
వెరైటీగా ఈ వంటకాలు ట్రై చేయండి. మీ కుటుంబానికి కొత్త రుచులు పరిచయం చేయండి. స్వీట్ కార్న్ లాలీపాప్స్ కావలసిన పదార్థాలు చిల్లీ ఫ్లేక్ మిరియాల పొడి జీలకర్ర ధనియాలు – అర టీ స్పూన్ చొప్పున పచ్చిమిర్చి – 2 స్వీట్ కార్న్ – ఒకటిన్నర కప్పులు ఉప్పు – తగినంత కార్న్ ఫ్లేక్స్ – ముప్పావు కప్పు (మరీ మెత్తడి పొడిలా కాకుండా.. చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి) బంగాళ దుంప తురుము – అర కప్పు మొక్కజొన్న పిండి – 2 టీ స్పూన్లు మైదా పిండి – 1 టీ స్పూన్ నీళ్లు – కొద్దిగా నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. చిన్న మంటపైన జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి, స్వీట్ కార్న్ వేసుకుని బాగా వేయించాలి. అందులో చిల్లీ ఫ్లేక్, మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. అనంతరం అవన్నీ మిక్సీలో వేసుకుని మిక్సీపట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకుని, అందులో బంగాళదుంప తురుము, అర కప్పు కార్న్ ఫ్లేక్స్ వేసుకుని బాగా కలిపి ముద్దలా చేసుకుని, చిన్న చిన్న బాల్స్‌లా చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న బౌల్లో మైదా పిండి, మొక్కజొన్న పిండి వేసుకుని నీళ్లతో కాస్త పలచగా కలపాలి. ఆ మిశ్రమంలో బాల్స్ ముంచి, మిగిలిన కార్న్ ఫ్లేక్స్ ముక్కలని పట్టించి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. టొమాటో సాస్‌తో సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి ఈ లాలీపాప్స్. చికెన్ బీట్రూట్ సమోసా కావలసిన పదార్థాలు బోన్‌లెస్ చికెన్ – పావు కప్పు (ఉప్పు, కారం, పసుపుతో పాటు మసాలా వేసి, మెత్తగా ఉడికించి, తురుములా చేసుకోవాలి) బీట్రూట్ తురుము – 4 టేబుల్ స్పూన్లు సోయా సాస్, టొమాటో సాస్ – 1 టేబుల్ స్పూన్ చొప్పున మైదా పిండి – 2 కప్పులు, గోధుమ పిండి – 1 కప్పు మిరియాల పొడి – 1 టీ స్పూన్ బీట్రూట్ రసం – సరిపడా (చపాతీ ముద్ద కోసం నీళ్లకు బదులుగా బీట్రూట్ రసం కలుపుకోవాలి) ఉప్పు – సరిపడా నూనె – తగినంత తయారీ విధానం ముందుగా ఒక బౌల్ తీసుకుని, అందులో బీట్రూట్ తురుము, మిరియాల పొడి, చికెన్ తురుము, సోయా సాస్, టొమాటో సాస్, కొద్దిగా ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. మరో బౌల్లో మైదా పిండి, గోధుమ పిండి, అర టేబుల్ స్పూన్ నూనె, కొద్దికొద్దిగా బీట్రూట్ రసం పోసుకుంటూ, ఉప్పు వేసి చపాతీ ముద్దలా చేసుకోవాలి. దానిపైన తడిబట్ట కప్పి, అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసుకుని, ఆ ఉండల్ని చపాతీలా వత్తి, సమోసాలా చుట్టి అందులో చికెన్ మిశ్రమాన్ని వేసి ఫోల్డ్ చెయ్యాలి. వాటిని నూనెలో వేయించి తీస్తే.. సరిపోతుంది. చదవండి: ఈ సరస్సుకు వెళ్లినవారు ఇప్పటివరకు తిరిగి రాలేదు!.. మిస్టీరియస్.. -
వాన చినుకులు కాదు... నూనె చినుకులు
ఆకాశమంతా మబ్బు ముసిరితే నేల తల్లి నాలుక మీద వర్షపు చినుకులు కురుస్తాయి... మరి మన నోటికి రుచి మబ్బులు ముసిరితే... నూనెలో వేయించిన వంటకాలతో నాలుక మీద చినుకులు కురిపించాల్సిందే.. ఈ వంటకాలు ప్రయత్నించి, రుచి చూడండి... వాన చినుకులు కాదు... నూనె చినుకులు రుచిగా ఉన్నాయి అనకుండా ఉండలేం. పొటాటో లాలీపాప్ కావలసినవి: బంగాళ దుంపలు – 2 (ఉడికించి, తొక్క తీసి మెత్తగా చేయాలి); బ్రెడ్ పొడి – ఒకటిన్నర కప్పులు; పచ్చి మిర్చి తరుగు – టీ స్పూను; కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్లు; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – టీ స్పూను; జీలకర్ర పొడి – అర టీ స్పూను; ధనియాల పొడి – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; చాట్ మసాలా – టీ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద – అర టీ స్పూను; నిమ్మ చెక్క – ఒకటి; మైదా పిండి – ఒక టేబుల్ స్పూను; నీళ్లు – తగినన్ని తయారీ: ► ఒక పాత్రలో బంగాళ దుంప ముద్ద, బ్రెడ్ పొడి, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, పసుపు, మిరప కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, చాట్‌మసాలా, అల్లం వెల్లుల్లి ముద్ద, కొత్తిమీర, నిమ్మ రసం వేసి చపాతీ ముద్దలా బాగా కలపాలి ∙చేతికి కొద్దిగా నూనె పూసుకుంటూ, ఈ మిశ్రమాన్ని ఉండలుగా చేయాలి ► ఒక పాత్రలో మైదాపిండికి కొద్దిగా నీళ్లు జత చేసి దోసెల పిండిలా కలుపుకోవాలి ∙తయారు చేసి ఉంచుకున్న బాల్స్‌ను మైదా పిండిలో ముంచి, వెంటనే బ్రెడ్ పొడిలో దొర్లించాలి ∙స్టౌ మీద బాణలిలో కాగిన నూనెలో ఈ బాల్స్‌ను వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙ఈ బాల్స్‌కి పుల్లలు గుచ్చి లాలీపాప్‌లా చేసి, టొమాటో కెచప్ తో తింటే రుచిగా ఉంటాయి. వెజ్ స్ప్రింగ్ రోల్స్ కావలసినవి: మైదా పిండి – 8 టేబుల్ స్పూన్లు; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; ఉల్లి తరుగు – అర కప్పు; క్యారట్ తురుము – అర కప్పు; సోయా సాస్ – 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు – చిటికెడు; రిఫైండ్ ఆయిల్ – డీప్ ఫ్రైకి సరిపడా; కొత్తిమీర తరుగు – పావు కప్పు; కార్న్ ఫ్లోర్ – 4 టేబుల్ స్పూన్లు; క్యాప్సికమ్ తరుగు – అర కప్పు; క్యాబేజ్ తరుగు – అర కప్పు; అల్లం తురుము –టీ స్పూను; మిరియాల పొడి – కొద్దిగా; మైదా పిండి – 3 టేబుల్ స్పూన్లు తయారీ: ► ఒక పెద్ద పాత్రలో మైదా పిండి, నీళ్లు, కార్న్ ఫ్లోర్, ఉప్పు వేసి బాగా గిలకొడుతూ కలపాలి ► స్టౌ మీద నాన్ స్టిక్ పాన్ వేడయ్యాక, కొద్దిగా నూనె వేయాలి ∙కలిపి ఉంచుకున్న మైదా పిండి గరిటెడు వేసి పల్చటి పాన్‌కేక్‌లా అయ్యేలా పాన్‌ను కొద్దిగా అటూ ఇటూ కదపాలి ► అంచులు విడివడే వరకు మీడియం మంట మీద ఉడికించి (రెండో వైపు తిప్పక్కర్లేదు) ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ► ఈ విధంగా అన్నీ తయారు చేసుకోవాలి (ఒక్కో పొర మీద కొద్దిగా మైదా పిండి చల్లి, ఆ పైన మరో పొర ఉంచాలి లేదంటే అతుక్కుపోతాయి) ► స్టౌ మీద బాణలిలో టేబుల్ స్పూను నూనె వేసి కాగాక, క్యారట్ తురుము, క్యాప్సికమ్ తరుగు, ఉల్లి తరుగు, క్యాబేజీ తరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కరకరలాడే వరకు వేయించాలి ► ఉప్పు, సోయా సాస్, మిరియాల పొడి జత చేసి, తడిపోయే వరకు వేయించి దింపి, ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని, చల్లారబెట్టాలి ► ముందుగా తయారుచేసి ఉంచుకున్న మైదా పిండి చపాతీని ఒకటి తీసుకుని, అందులో టేబుల్ స్పూను క్యారట్ తురుము మిశ్రమం ఉంచి జాగ్రత్తగా రోల్ చేయాలి ∙అంచులకు తడి చేసి, మూసేయాలి ► స్టౌ మీద బాణలిలో నూనె పోసి, కాగాక, తయారు చేసుకున్న రోల్స్‌ను అందులో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి ► టొమాటో కెచప్ లేదా చిల్లీ సాస్‌తో రుచిగా ఉంటాయి. స్టఫ్డ్ పనీర్ ఢోక్లా కావలసినవి: సెనగ పిండి – ఒకటిన్నర కప్పులు; పెరుగు – కప్పు; కొత్తిమీర + పుదీనా చట్నీ – ఒక కప్పు; పనీర్ – 200 గ్రా.; నూనె – 3 టీ స్పూన్లు; ఆవాలు – అర టీ స్పూను; నీళ్లు – కప్పు; కరివేపాకు – రెండు రెమ్మలు; ఉప్పు – తగినంత; పచ్చిమిర్చి – 2 (మధ్యకు సన్నగా కట్ చేయాలి); నువ్వులు – టీ స్పూను; పంచదార – 2 టీ స్పూన్లు; తాజా కొబ్బరి తురుము – 3 టేబుల్ స్పూన్లు తయారీ: ► ఒక పాత్రలో సెనగ పిండి, పెరుగు వేసి బాగా కలపాలి ∙పంచదార, రెండు టేబుల్ స్పూన్ల నూనె, ఉప్పు జత చేసి మరోమారు కలపాలి ► కప్పు నీళ్లుపోసి మెత్తగా అయ్యేవరకు కలిపి, పావు గంట సేపు పక్కన ఉంచాలి ► ఒక ప్లేటుకి కొద్దిగా నూనె పూయాలి ∙స్టౌ మీద మందపాటి పాత్ర ఉంచి వేడి చేసి అందులో ఒక స్టాండ్ ఉంచి, రెండు కప్పుల నీళ్లు పోసి వేడి చేయాలి ∙సెనగ పిండి మిశ్రమాన్ని రెండు భాగాలుగా చేసి, రెండు విడివిడి పాత్రల్లో పోయాలి ► ఒక పాత్రలో ఉన్న పిండిలో ముప్పావు టీ స్పూను ఈనో ఫ్రూట్ సాల్ట్ వేసి, బాగా పొంగినట్టు కాగానే, పిండిని ప్లేట్లో పోసి, సమానంగా పరిచి, పెద్ద పాత్రలోని స్టాండ్ మీద ఉంచి, మూత పెట్టాలి ► ఐదు నిమిషాల తరవాత మూత తీసి, కొత్తిమీర పుదీనా చట్నీ ఒక పొరలాగ వేసి, ఆ పైన ఒక కప్పు పనీర్ తురుము వేయాలి ► రెండవ ప్లేట్లోని మిశ్రమానికి ఈనో ఫ్రూట్ సాల్ట్ జత చేసి, బాగా కలిపి, పనీర్ మీదుగా ఒక పొరలా పోసి, మూత పెట్టి, సుమారు పావు గంట సేపు పెద్ద మంట మీద ఉడికించాలి (పుల్లతో గుచ్చితే ఉడికినదీ లేనిదీ అర్థమవుతుంది) ► స్టౌ మీద బాణలి లో టేబుల్ స్పూను నూనె వేసి, కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి ► కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు, నువ్వులు వేసి బాగా వేయించిన తరవాత, కప్పు నీళ్లు, టీ స్పూను పంచదార వేసి పంచదార కరిగేవరకు ఉంచాలి ∙ఢోక్లాను ముక్కలుగా కట్ చేయాలి ► సిద్ధంగా ఉన్న పోపును వాటి మీద సమానంగా పోయాలి ∙చివరగా తాజా కొబ్బరి తురుముతో అలంక రించి, అందించాలి. -
ఎంతబాగా ప్రార్థన చేస్తున్నాడో; ఓర్నీ అసలు సంగతి ఇదా!
చిన్న పిల్లలు ఏం చేసినా ముద్దుగానే ఉంటుంది. మురిపాల మూటలు కట్టే వారి చిరునవ్వులు చూస్తుంటే.. అల్లరి చేసినా సరే క్షమించేయాలనిపిస్తుంది. స్వచ్ఛమైన మనసు కలిగి ఉండే చిన్నారులను ప్రేమించని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఓ పిల్లాడి చేష్టలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బడిలో ప్రార్థన చేస్తున్న సమయంలో.. ‘‘మాకు శక్తిని ప్రసాదించూ’’ అంటూ గీతం పాడుతున్న ఆ బుడ్డోడు చేసిన పని నవ్వులు పూయిస్తోంది. ఎందుకంటే, ఆ పిల్లాడు అందరితో శృతి కలుపుతున్నాడే తప్ప, వాడి ధ్యాస మాత్రం లాలీపాప్ మీదే ఉంది. కళ్లు మూసుకున్నా సరే వీలు చిక్కినప్పుడల్లా లాలీపాప్ చప్పరిస్తూనే ఎంతో సిన్సియర్‌గా ప్రార్థనాగీతం ఆలపిస్తున్నట్లుగా పోజులిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన అవనీశ్ శరన్ అనే అధికారి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘మనలో చాలా మంది ఇలాగే చేసి ఉంటాం కదా’’ అన్న ఆయన కామెంట్‌కు స్పందనగా భిన్నమైన సమాధానాలు వస్తున్నాయి. చాలా మంది తమకు చిన్నతనంలో చేసిన అల్లరి గుర్తుకువస్తుందంటూ జ్ఞాపకాలు నెమరువేసుకుంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఓ లుక్కేయండి! చదవండి: వ్వావ్! ఫ్రెండ్ షిప్ అంటే ఈ పిల్లులదే.. -
కాంగ్రెస్.. ఓ లాలీపాప్ కంపెనీ
ఘాజీపూర్/వారణాసి: రుణమాఫీ విషయంలో దేశంలోని రైతులను కాంగ్రెస్ పార్టీ తప్పుదోవ పట్టిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు భిన్నంగా ఆ పార్టీ రైతులకు లాలీపాప్స్(చిరు తాయిలాలు) అందించి చేతులు దులుపుకుంటోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని ప్రధాని లాలీపాప్ కంపెనీగా అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా శనివారం ఘాజీపూర్, వారణాసిలో రూ.98 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన మోదీ, కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. అనర్హులకే రుణమాఫీ చేశారు ‘కర్ణాటకలో జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఓ 800 మంది రైతుల రుణాలను మాఫీ చేసి చేతులు దులుపుకుంది. 2009 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కూడా ఈ లాలీపాప్ కంపెనీ(కాంగ్రెస్) మర్చిపోయింది. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 22 పంటల కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ను పెట్టుబడి వ్యయానికి ఒకటిన్నర రెట్లు పెంచింది. అంతేకాదు పూర్వాంచల్ ప్రాంతాన్ని మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం’ అని అన్నారు. ఈ సందర్భంగా 11వ శతాబ్దానికి చెందిన రాజు సుహేల్దేవ్ స్టాంప్‌ను మోదీ ఆవిష్కరించారు. వారణాసిలో ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ సౌత్ ఏసియా రీజినల్ సెంటర్(ఐఎస్ఏఆర్సీ) క్యాంపస్‌ను ప్రారంభించిన మోదీ, దీన్ని జాతికి అంకితం చేశారు. దక్షిణాసియాలో వరి పంటపై పరిశోధనలకు, శాస్త్రవేత్తల శిక్షణకు ఐఎస్ఏఆర్సీ హబ్‌గా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, ప్రధాని మోదీ విమర్శలపై కాంగ్రెస్ స్పందించింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోరంగా ఓడాక, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రుణమాఫీ చేశాక ఇప్పుడు మోదీకి రైతులు గుర్తుకు వస్తున్నారని కాంగ్రెస్ ఎద్దేవాచేసింది. -
లండన్‌లో తొలి నగ్న రెస్టారెంట్!
లండన్: బాహ్య ప్రపంచపు కట్టుబాట్లను కాసేపు పక్కనబెట్టి ఎంచక్కా నచ్చినట్లు నగ్నంగా రెస్టారెంట్లో గడపాలనుకునే వారికి స్వర్గధామంలాంటి రెస్టారెంట్ ఒకటి లండన్‌లో ప్రారంభానికి సిద్ధమైంది. ‘ది బునియాది(పునాది)గా పిలిచే ఈ రెస్టారెంట్లో తప్పదనుకుంటే పొదుపుగా దుస్తులను వేసుకున్న వారికీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శాఖాహార, మాంసాహార వంటలను మట్టికుండల్లో, ‘తినగల’ చెంచాలతో వడ్డిస్తారు. ఈ చెంచాలను ఆహారపదార్ధాలతో తయారుచేస్తారు. రసాయనాలులేని వంటలు ఈ రెస్టారెంట్ ప్రత్యేకత. ఇప్పటికే రెస్టారెంట్‌కు వెయిటింగ్ లిస్ట్ ఏకంగా 44,200కు చేరింది. రెస్టారెంట్లో ఒకేసారి కేవలం 42 మంది మాత్రమే కూర్చునే సదుపాయం ఉంది. విద్యుత్, ఫోన్, దుస్తులు ఇలా ఎలాంటివి లేని ప్రపంచాన్ని పరిచయం చేయడం కోసం ఈ రెస్టారెంట్‌ను నెలకొల్పినట్లు రెస్టారెంట్ మాతృసంస్థ అయిన ‘లాలీపాప్’ వ్యవస్థాపకుడు సెబ్ లేయాల్ ప్రకటించారు. శనివారం ప్రారంభంకానున్న ఈ రెస్టారెంట్లో పూర్తి నగ్నంగా ఉండే కస్టమర్ల అభిరుచికి తగ్గట్లుగా ఇంటీరియర్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. కొవ్వొత్తుల కాంతుల్లో.. వెదురుకర్రలతో చేసిన ఏర్పాట్లు రెస్టారెంట్‌కు కొత్త శోభను తెస్తాయన్నారు. -
Taste డిఫరెంట్
బర్గర్లు... పిజ్జాలు. కాదంటే నూడిల్స్... పానీపూరీలు... జంక్ ఫుడ్‌కు ఎడిక్ట్ అయిపోయారు పిల్లలు. అప్పుడప్పుడూ అయితే ఓకే... కానీ తిండి మానేసి వాటినే లాగించేస్తున్నారు. స్కూల్‌కు లంచ్ బాక్స్ ఇచ్చినా... చిరు తిళ్లతో సరిపెట్టేసుకుంటున్నారు. శరీరానికి శక్తినిచ్చి... ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండ్లు బాక్స్‌లో ఎన్ని పెట్టినా... వెంట తీసుకెళతారే గానీ తినేవారెంతమంది! మరి వారిని జంక్ ఫుడ్స్‌కు దూరంగా ఉంచడమెలా..! స్నాక్స్‌ను ఫ్రూట్స్‌తో రీప్లేస్ చేసేదెలా! పిల్లల సైకాలజీ ప్రకారం వాళ్లకు అన్నీ కొత్తగా, డిఫరెంట్‌గా, వెరైటీగా ఉండాలి. అంతకు మించి ఆకర్షణీయంగా కనిపించాలి అంటారు సెలబ్రిటీ చెఫ్ రుచికాశర్మ. అలాంటి చిన్నారుల కోసం ఇంట్లో సులువుగా చేసుకొనేలా ఆమె ఓ కొత్త కాన్సెప్ట్‌తో మెనూ రెడీ చేశారు. ఓ లుక్కేద్దాం రండి... స్టార్ హోటల్‌కు వెళ్లామనుకోండి... ఎప్పుడూ తినే ఫుడ్డే. కాకపోతే ప్లేట్లో కాస్త విభిన్నంగా డెకరేట్ చేసి సర్వ్ చేస్తారు. టేస్ట్ ఎలా ఉన్నా... చూడగానే ఓ పట్టు పట్టేయాలనిపిస్తుంది. అలాగే... పిల్లల మనస్తత్వం కూడా. వారు ఎక్కువగా ఇష్టపడే చాక్లెట్‌ను పండ్లకు మిక్స్ చేసి... దానికింత డెకరేషన్ చేస్తే ఠక్కున అక్కడ వాలిపోతారు. లాలీపాప్‌లా: రకరకాల పండ్లను ముక్కలుగా కోసి, చాక్లెట్ క్రీమ్‌లో డిప్ చేయాలి. దానికి లాలీపాప్‌లా టూత్ పిక్ గుచ్చి ఓ అరగంట ఫ్రిజ్‌లో పెట్టి పిల్లల చేతికందిస్తే... లొట్టలేసుకుంటూ తింటారు. కబాబ్ టైప్: అరటి పండు, పైనాపిల్, యాపిల్ ముక్కలు, చెర్రీస్ వంటివి కబాబ్‌లా ఓ పుల్లకు గుచ్చి తేనెలో గానీ, షుగర్ సిరప్‌లో గానీ డిప్ చేస్తే... చిన్నారుల నోరూరిపోతుంది. డ్రైఫ్రూట్స్‌తో: రోజూ ఒకటే వెరైటీ చేస్తే ఎవరికైనా బోరు కొడుతుంది. సో.. ఎప్పటికప్పుడు కాస్త విభిన్నంగా ప్రయత్నించాలి. అందుకే అప్పుడప్పుడూ పండ్లకు చాక్లెట్ క్రీమ్ డిప్‌తో పాటు వాటిపై డ్రై ఫ్రూట్స్ ముక్కలు కూడా వేస్తే... చూడగానే తినేయాలనిపిస్తుంది. ఫ్రూట్ బైట్: వేడి వేడి బజ్జీల మధ్యలో పండ్ల ముక్కలు పెట్టి ఫ్రూట్ బైట్లా చేయొచ్చు. అలాగే శాండ్‌విచ్‌లా బ్రెడ్ ముక్కల మధ్యలో ఫ్రూట్ స్లైసెస్ ఉంచి, జాం పూసి కలర్ఫుల్గా మారిస్తే... రుచికి రుచీ ఉంటుంది. చూడ్డానికి ఆకర్షణీయంగానూ కనిపిస్తుంది. కుకీస్‌తో: పండ్ల ముక్కలను కుకీస్ మధ్యలో పేర్చి, షుగర్ సిరప్ లేదంటే చాక్లెట్ క్రీమ్‌లో డిప్ చేయాలి. డీప్ ఫ్రిజ్‌లో పెట్టి కాసేపటి తరువాత తింటే... అబ్బో ఆ టేస్టే వేరు. వీటన్నింటికీ సీజనల్ ఫ్రూట్స్‌ను వాడితే మరింత రుచిగా ఉంటాయి. - శిరీష చల్లపల్లి