Summer Drink- Masala Chaas: ఎండాకాలంలో మసాలా చాస్ మంచి రిఫ్రెషింగ్ డ్రింక్‌గా పనిచేస్తుంది. శరీరాన్ని చల్లబరిచి వేడిచేయకుండా చూస్తుంది. కేలరీలు తక్కువగా ఉండి, మంచి రుచితో దాహార్తిని ఇట్టే తీరుస్తుంది.
మసాలా చాస్ కావలసిన పదార్థాలు: పెరుగు – కప్పు, పచ్చిమిర్చి – ఒకటి, అల్లం – చిన్నముక్క, పుదీనా ఆకులు – నాలుగు, కొత్తిమీర తరుగు – రెండు టీస్పూన్లు, ఇంగువ – చిటికెడు, కరివేపాకు – ఒక రెమ్మ, నెయ్యి – టీస్పూను, జీలకర్ర – అరటీస్పూను, ఉప్పు – రుచికి సరిపడినంత.
తయారీ: పెరుగుని బ్లెండర్‌లో వేయాలి. దీనిలోనే పచ్చిమిర్చి, అల్లం, పుదీనా ఆకులను ముక్కలుగా తరిగి వేయాలి
తరువాత కొద్దిగా కరివేపాకు, ఇంగువ, సగం జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి.
ఇప్పుడు మూడు కప్పులు నీళ్లుపోసి మరోసారి గ్రైండ్ చేయాలి.
బాణలిలో నెయ్యి వేసి వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తరువాత జీలకర్ర, రెండు కరివేపాకు రెబ్బలు వేసి దోరగా వేయించి గ్రైండ్ చేసిన మజ్జిగను వేయాలి.
దీనిలో రెండు మూడు ఐస్‌ముక్కలు వేసి సర్వ్ చేసుకోవాలి.
చదవండి: Health Tips: పాలకూర, టీ, చేపలు.. ఇంకా.. వీటితో బ్రెయిన్ పవర్ పెంచుకోవచ్చు!
Comments
Please login to add a commentAdd a comment