Hair Care Tips In Telugu: జుట్టు పొడవుగా... ఒత్తుగా పెరగడంలో క్షారం ఉన్న ఆహార పదార్థాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఆల్కలైన్ లేదా క్షారం శరీర పీహెచ్ స్థాయులను సమతులంగా ఉంచి జీర్ణక్రియ సవ్యంగా జరిగేలా చేసి, శరీరానికి పోషకాలను అందిస్తుంది. ఫలితంగా కురులకు పోషకాలు అంది ఆరోగ్యంగా పెరుగుతాయి.
ఈ ఆహార పదార్థాలు తింటే మేలు
►తెల్లగా ఉన్న బ్రెడ్ కంటే బ్రౌన్‌బ్రెడ్‌ను తినాలి.
►తెల్లగా ఉండే పిండి కాకుండా రాగి, జొన్న, సజ్జ, బార్లీ పిండిలను కలిపి రొట్టె చేసుకుని తినాలి.
►దోసకాయ, పాలకూర, బ్రకోలి, కాకరకాయ, బీన్స్‌ను ఆహారంలో చేర్చుకోవాలి. వీటిలో విటమిన్ కే, ఫోలేట్‌లు పుష్కలంగా ఉంటాయి.
►తులసి ఆకులు, బెల్లంతో చేసిన టీ, తులసి, పుదీనా, సొరకాయలను కలిపి చేసిన జ్యూస్ కూడా జుట్టుకు మంచి పోషణ అందిస్తుంది.
►వాల్‌నట్స్‌లోని ఆల్ఫాలినోలెనిక్ యాసిడ్ రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. ఫలితంగా రక్తప్రసరణ చక్కగా జరిగి జుట్టు పెరుగుదలకు దోహద పడుతుంది.
►వాల్‌నట్స్ తినలేనివారు కనీసం వాల్‌నట్స్ ఆయిల్‌ను జుట్టుకు పట్టించి మసాజ్ చేసుకోవాలి.
►బొప్పాయి హెయిర్ మాస్క్ కూడా కేశాల ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.
చదవండి👉🏾Mango Health Benefits: సీజన్ కదా అని మామిడి పండ్లు లాగించేస్తున్నారా? ఇందులోని క్వార్సెటిన్ వల్ల..
Comments
Please login to add a commentAdd a comment