ముఖంపై మొటిమలు, జిడ్డు సమస్య వేధిస్తోందా? అయితే, పుదీనా ఆకులతో సమస్యకు ఇలా చెక్ పెట్టేయండి!
►పుదీనా ఆకులను ఎండబెట్టి పొడిచేయాలి.
►ఈ పొడిలో కొద్దిగా ముల్తానీ మట్టి, రోజ్‌వాటర్ వేసి పేస్టులా కలపాలి.
►ఈ పేస్టుని ముఖంపై అసహ్యంగా కనిపిస్తోన్న మొటిమలపై రాయాలి.
►పూర్తిగా ఆరాక నీటితో కడిగేయాలి.
►ఈ పేస్టుని రోజూ అప్లై చేయడం వల్ల చర్మంపై పేరుకుపోయిన జిడ్డుని తొలగించి, మొటిమలు తగ్గుముఖం పట్టేలా చేస్తుంది.
►క్రమం తప్పకుండా ఈ ప్యాక్ వేసుకుంటే ముఖచర్మం నిగారింపుని సంతరించుకుంటుంది.
అదే విధంగా....
►గుప్పెడు పుదీనా ఆకులకు కొద్దిగా తేనె, రోజ్‌వాటర్ జోడించి పేస్టులా నూరాలి.
►ఈ పేస్టుని ముఖానికి పూతలా వేసి పదిహేను నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేయాలి.
►ఇలా చేయడం వల్ల ముఖం జిడ్డులేకుండా ఫ్రెష్‌గా కనిపిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment