Oily skin
-
బ్యూటిప్స్
ఏ కాలంలోనైనా జిడ్డు చర్మం బాగా ఇబ్బంది పెడుతుంటుంది. జిడ్డుపోగొట్టి ముఖం ఫ్రెష్‌గా ఉండడానికి ఎగ్, లెమన్ఫేస్మాస్క్ బాగాపనిచేస్తుంది. ఒక గుడ్డును తీసుకుని దానిలోని తెల్లసొనను ఒక గిన్నెలో వేసి దానికి స్పూను తాజా నిమ్మరసం చేర్చి బాగా కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాలపాటు ఆరనివ్వాలి. ఫేస్‌మాస్క్ ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో కడిగి తుడుచుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల ముఖం మీద జిడ్డు, మొటిమలు తగ్గుతాయి. టేబుల్ స్పూన్ తేనె, గుడ్డులోని తెల్లసొన కలిపి ముఖానికి ప్యాక్‌లా వేయాలి. పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. జిడ్డును తొలగించి, ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది ఈ ప్యాక్. -
Beauty Tips: మొటిమలు, జిడ్డుకు చెక్ పెట్టేయండిలా!
ముఖంపై మొటిమలు, జిడ్డు సమస్య వేధిస్తోందా? అయితే, పుదీనా ఆకులతో సమస్యకు ఇలా చెక్ పెట్టేయండి! ►పుదీనా ఆకులను ఎండబెట్టి పొడిచేయాలి. ►ఈ పొడిలో కొద్దిగా ముల్తానీ మట్టి, రోజ్‌వాటర్ వేసి పేస్టులా కలపాలి. ►ఈ పేస్టుని ముఖంపై అసహ్యంగా కనిపిస్తోన్న మొటిమలపై రాయాలి. ►పూర్తిగా ఆరాక నీటితో కడిగేయాలి. ►ఈ పేస్టుని రోజూ అప్లై చేయడం వల్ల చర్మంపై పేరుకుపోయిన జిడ్డుని తొలగించి, మొటిమలు తగ్గుముఖం పట్టేలా చేస్తుంది. ►క్రమం తప్పకుండా ఈ ప్యాక్ వేసుకుంటే ముఖచర్మం నిగారింపుని సంతరించుకుంటుంది. అదే విధంగా.... ►గుప్పెడు పుదీనా ఆకులకు కొద్దిగా తేనె, రోజ్‌వాటర్ జోడించి పేస్టులా నూరాలి. ►ఈ పేస్టుని ముఖానికి పూతలా వేసి పదిహేను నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. ►ఇలా చేయడం వల్ల ముఖం జిడ్డులేకుండా ఫ్రెష్‌గా కనిపిస్తుంది. చదవండి: Detoxification: నోటి దుర్వాసన, చెమట నుంచి చెడు వాసన.. శరీరంలోని విషాలు తొలగించుకోండిలా! ఇవి తింటే మాత్రం.. -
Beauty Tips: ముడతలు, బ్లాక్ హెడ్స్‌కు చెక్.. ధర రూ. 2,830
ముడతలు, మచ్చలు, బ్లాక్ హెడ్స్ వంటి సమస్యలు.. బాహ్యంగా సౌందర్యాన్ని, అంతర్లీనంగా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంటాయి. హార్మోన్ల మార్పు, మృతకణాలు చర్మరంధ్రాల్లో కూడుకుపోవడం, వయసు ప్రభావంతో గీతలు, ముడతలు పడడం.. వంటివెన్నో ఆడవారిని ఇబ్బంది పెడుతుంటాయి. చిత్రంలోని ఈ హాట్ అండ్ కూల్ స్కిన్ కేర్ టూల్.. ఇలాంటి సమస్యలన్నిటికీ చెక్ పెడుతుంది. ఈ డివైజ్.. బ్లాక్ హెడ్ రిమూవర్ పోర్ వాక్యూమ్ క్లీనర్లా, ఎలక్ట్రిక్ ఫేషియల్ అయాన్ బ్లాక్‌హెడ్ ఎక్స్ట్రాక్టర్ టూల్ డివైజ్‌లా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇది బ్లాక్ హెడ్స్‌ని పోగొట్టడంతో పాటు.. జిడ్డును తగ్గిస్తుంది. చర్మ రంధ్రాలను శుభ్రపరచి మృదువుగా మార్చడం, చర్మాన్ని బిగుతుగా.. ముడతలు లేకుండా చేయడం వంటి అదనపు ప్రయోజనాలనూ అందిస్తుంది. ఈ డివైజ్‌తో పాటు లభించిన 5 మినీ హెడ్స్(చిత్రంలో గమనించవచ్చు).. 5 వేర్వేరు లాభాలను అందిస్తాయి. వాటిలో ‘లార్జ్ రౌండ్ హోల్ హెడ్’.. బ్లాక్ హెడ్స్‌ని తొలగిస్తే.. ‘స్మాల్ రౌండ్ హోల్ హెడ్’ సున్నితమైన భాగాల్లో ఉపయోగించేందుకు సహకరిస్తుంది. ‘మైక్రోక్రిస్టలైన్ హెడ్’ ముడతలను రూపమాపుతుంది. ‘మీడియం రౌండ్ హోల్ హెడ్’ మొండి బ్లాక్ హెడ్స్‌ని తొలగిస్తుంది. ‘ఓవల్ హోల్ హెడ్’ చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. సున్నితమైన చర్మం, పొడి చర్మం, జిడ్డు చర్మం.. ఇలా అన్నిరకాల చర్మాలకూ ప్రొఫెష్నల్ ట్రీట్మెంట్ అందిస్తుంది ఈ మినీ వాక్యూమ్ క్లీనర్. దీన్ని వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఉపయోగించవచ్చు. ఒకే ప్రదేశంలో రెండు సెకండ్ల కంటే ఎక్కువగా ఉంచరాదు. ఈ డివైజ్ లైట్‌వెయిట్‌గా ఉంటుంది కాబట్టి.. వినియోగించడం చాలా సులభం. దీని ధర 37 డాలర్లు. అంటే 2,830 రూపాయలు. చదవండి👉🏾 Health Tips: సీజన్ కదా అని మామిడి పండ్లు లాగించేస్తున్నారా? ఇవి తెలిస్తే.. Laser Comb Uses: విగ్గు పెట్టుకోవాల్సిన అవసరం లేదు.. ఒత్తైన కురులు.. నొప్పి ఉండదు.. ధర ఎంతంటే! -
జిడ్డు చర్మ సమస్యను అధిగమించాలంటే..
సాక్షి, హైదరాబాద్: మానవ జాతికి అందమనేది దేవుడిచ్చిన గొప్ప వరం. అందాన్ని కాపాడుకోవడానికి ప్రజలు అనేక క్రీమ్‌లు, లోషన్లు వాడుతుంటారు. ప్రస్తుత పోటీ యుగంలో విపరీతమైన ఒత్తిడి, శరీర తత్వానికి కావాల్సిన ఆహారం తినకపోవడం తదితర కారణాలతో ప్రజలు జిడ్డు చర్మ సమస్యతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో జిడ్డు సమస్యలతో బాధపడుతున్న వారు కొన్ని పదార్థాలను తినకూడదని అపోలో టెలిహెల్త్ సీనియర్ డర్మటాలజిస్ట్ డాక్టర్ రాధా గంగాతి సూచిస్తున్నారు. డాక్టర్ సూచిస్తున్న తినకూడని ఆహారాలు ఏవో చూద్దాం. డయిరీ ఉత్పత్తులకు దూరంగా ఉండడం: జిడ్డు చర్మ సమస్యతో బాధపడుతున్న వారు డయిరీ ఉత్పత్తులకు దూరంగా ఉండటం మేలని డాక్టర్ సూచిస్తున్నారు. కానీ కొందరు పిల్లలకు పాలు తాగే అలవాటు ఉంటుంది. అలాంటప్పుడు తక్కువ కేలరీలతో లభించే సోయా పాలను తాగవచ్చని తెలిపింది. మరోవైపు జిడ్డు చర్మ సమస్యను జయించాలంటే చక్కెర పదార్థాలకు దూరంగా ఉండడం మేలని డాక్టర్ సూచిస్తున్నారు చాక్లెట్స్కు దూరంగా ఉండడం చాక్లెట్స్ తినడం ద్వారా జిడ్డు సమస్య వేదిస్తుంది. చాక్లెట్లో ఉండే చక్కెర శాతం చర్మం జిడ్డుగా మారడానికి ప్రేరేపిస్తుంది. అయితే చాక్లెట్ ప్రియులకు ఓ గుడ్‌న్యూస్.. 15రోజులకు ఒకసారి డార్క్ చాక్లెట్ తిన్నట్లయితే అంత ఇబ్బంది ఉండదని డాక్టర్ సూచించింది జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండడం ప్రస్తుత ప్రపంచంలో జంక్ ఫుడ్ అంటే ఇష్టపడని వారు చాలా అరుదు. కానీ జిడ్డు చర్మ సమస్యను నివారించాలనుకునేవారు జున్ను తదితర పదార్థాలకు దూరంగా ఉండాలని, డయిరీ పదార్థాలను తీసుకోవడం వల్ల శరీరంలో నూనె గ్రంథుల పరిణామం పెరిగి జిడ్డు, మొటిమల సమస్య తలెత్తుతుంది మాంసాహారానికి దూరంగా ఉండడం మీరు మాంసాహార ప్రియులా, అయితే నిత్యం మాంసాహారం భుజించడం వల్ల శరీరంలో చెడు కొవ్వు శాతం అధికమయి జిడ్డు సమస్య తెలెత్తుతుంది. కాగా ఆహార నియమాల అనేవి శరీర తత్వానికి అనుగుణంగా తీసుకుంటే ఎలాంటి నష్టం ఉండదని డాక్టర్ గంగాతి పేర్కొన్నారు -
బ్యూటిప్
ఒక స్పూను శనగపిండి, ఒక స్పూను పెరుగు, అర స్పూను తేనె కలిపి... ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఆరిన తర్వాత చన్నీటితో కడగాలి. రోజూ ఇలా చేస్తే ముఖం కాంతివంతంగా ఉంటుంది. దీనిని అన్ని రకాల చర్మతత్వాల వాళ్లూ పాటించవచ్చు. అయితే డ్రైస్కిన్కి మీగడ పెరుగు, ఆయిలీ స్కిన్ వాళ్లు మీగడ లేని పెరుగు వాడాలి. -
ఎండతో చర్మం జిడ్డుగా ఉందా?
బ్యూటిప్స్ * జిడ్డు చర్మం వేసవిలో చెమట వల్ల మరింత జిడ్డుగా మారుతుంది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మొటిమలు, యాక్నె సమస్యలు బాధిస్తాయి. * ముందు వెచ్చని నీటితో తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. దీని వల్ల స్వేద గ్రంధుల జిడ్డు, తద్వారా మురికి తొలిగి చర్మకాంతి తగ్గకుండా ఉంటుంది. * దూది ఉండతో క్లెన్సింగ్ మిల్క్‌ను ముఖమంతా రాసి తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. రెండు రోజులకు ఒకసారి ఈ విధంగా చే స్తే స్వేదగ్రంధులు చక్కగా శుభ్రపడతాయి. ముఖ చర్మం జిడ్డుగా మారదు. * జిడ్డు తొలగిపోవాలని స్క్రబ్‌తో ముఖాన్ని ఎక్కువగా రుద్దకూడదు. వారానికి 2 సార్లు స్క్రబ్ చేస్తే మృతకణాలు, బ్లాక్‌హెడ్స్ తగ్గుతాయి. నూనెలు, ఇతర మాయిశ్చరైజర్ క్రీమ్‌లను ఈ కాలం ఉపయోగించకపోవడమే మేలు. * ముల్తానా మిట్టి లేదా గంధం పొడి వారానికి ఒకసారి ప్యాక్‌లా వేసుకొని ఆరాక శుభ్రపరుచుకోవాలి. దీంతో అదనపు జిడ్డు తొలగిపోయి, చర్మం మృదువుగా మారుతుంది. * ప్రతి రోజూ ముఖాన్ని శుభ్రపరుచుకోవడానికి ముందు టిష్యూ ప్యాడ్‌తో తుడవాలి. ఇలా చేయడం వల్ల అదనపు జిడ్డు సులువుగా వదిలిపోతుంది. నేరుగా చెయ్యి ముఖానికి తగలడం వల్ల మొటిమలు, యాక్నె సమస్య పెరుగుతుంది. * ఈ కాలం వేపుళ్లు, నూనె పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల జిడ్డు సమస్య పెరుగుతుంది. విటమిన్ -ఎ అధికంగా ఉండే క్యారట్, ఆకుకూరలు, తాజా పండ్లు తినాలి. * రోజూ 2-4 లీటర్ల నీళ్లు తప్పక తాగాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే జిడ్డు సమస్య బాధించదు. -
జిడ్డు తగ్గాలంటే ఏం చేయాలి?
- కిన్నెర, ఇ-మెయిల్ ముఖం మీద జిడ్డు చేరినప్పుడు వెంటనే తొలగించకపోతే దుమ్ము, ధూళి కణాలు చేరి మొటిమలకు కారణాలు అవుతాయి. జిడ్డు చర్మం గలవారికి వచ్చే ప్రధాన సమస్య మొటిమలు. అందుకని ఎప్పటిక ప్పుడు ముఖం మీద అదనంగా చేరే జిడ్డును తొలగించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆర్గానిక్ ఫేస్ స్క్రబ్‌ని ముఖానికి రాసుకొని, సున్నితంగా రబ్ చేసి, వెచ్చని నీటితో కడగాలి. రోజులో మూడు, నాలుగు సార్లు ఫేస్‌వాష్‌తో ముఖాన్ని శుభ్రపరుచుకుంటే త్వరగా జిడ్డు పట్టే సమస్య తగ్గి, రోజంతా తాజాగా ఉంటుంది. ముఖచర్మం నిస్తేజంగా ఉంటోంది! - రాగిణి, సీతాఫల్మండి, హైదరాబాద్ బయట తిరిగే వారు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే చర్మం త్వరగా డల్‌గా మారుతోంది. రోజూ సాయంకాలం ఇంటికి వెళ్లిన తర్వాత స్వచ్ఛమైన రోజ్‌వాటర్‌లో దూదిని ముంచి ముఖమంతా తుడుచుకోవాలి. అదే విధంగా ఉదయం కూడా చేయాలి. తర్వాత మంచి నీటితో శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండుసార్లు బంగాళదుంపను తురిమి ముఖానికి పట్టించి, సున్నితంగా రుద్దాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. రోజులో ఏర్పడే జిడ్డును తొలగించుకోవడానికి పదే పదే నీటితో శుభ్రం చేయాల్సిన అవసరం లేదు. వెట్ వైట్ టిష్యూ పేపర్‌తో చెమటను అద్దాలి. అంతే తప్ప గట్టిగా రుద్దకూడదు. ఈ జాగ్రత్తలు పాటిస్తే ట్యాన్ తగ్గుతుంది. ముఖం మృదువుగా, కాంతిమంతంగా మారుతుంది.