జిడ్డు తగ్గాలంటే ఏం చేయాలి?
- కిన్నెర, ఇ-మెయిల్
ముఖం మీద జిడ్డు చేరినప్పుడు వెంటనే తొలగించకపోతే దుమ్ము, ధూళి కణాలు చేరి మొటిమలకు కారణాలు అవుతాయి. జిడ్డు చర్మం గలవారికి వచ్చే ప్రధాన సమస్య మొటిమలు. అందుకని ఎప్పటిక ప్పుడు ముఖం మీద అదనంగా చేరే జిడ్డును తొలగించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆర్గానిక్ ఫేస్ స్క్రబ్‌ని ముఖానికి రాసుకొని, సున్నితంగా రబ్ చేసి, వెచ్చని నీటితో కడగాలి. రోజులో మూడు, నాలుగు సార్లు ఫేస్‌వాష్‌తో ముఖాన్ని శుభ్రపరుచుకుంటే త్వరగా జిడ్డు పట్టే సమస్య తగ్గి, రోజంతా తాజాగా ఉంటుంది.
ముఖచర్మం నిస్తేజంగా ఉంటోంది!
- రాగిణి, సీతాఫల్‌మండి, హైదరాబాద్
బయట తిరిగే వారు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే చర్మం త్వరగా డల్‌గా మారుతోంది. రోజూ సాయంకాలం ఇంటికి వెళ్లిన తర్వాత స్వచ్ఛమైన రోజ్‌వాటర్‌లో దూదిని ముంచి ముఖమంతా తుడుచుకోవాలి. అదే విధంగా ఉదయం కూడా చేయాలి. తర్వాత మంచి నీటితో శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండుసార్లు బంగాళదుంపను తురిమి ముఖానికి పట్టించి, సున్నితంగా రుద్దాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. రోజులో ఏర్పడే జిడ్డును తొలగించుకోవడానికి పదే పదే నీటితో శుభ్రం చేయాల్సిన అవసరం లేదు. వెట్ వైట్ టిష్యూ పేపర్‌తో చెమటను అద్దాలి. అంతే తప్ప గట్టిగా రుద్దకూడదు. ఈ జాగ్రత్తలు పాటిస్తే ట్యాన్ తగ్గుతుంది. ముఖం మృదువుగా, కాంతిమంతంగా మారుతుంది.