ఏ కాలంలోనైనా జిడ్డు చర్మం బాగా ఇబ్బంది పెడుతుంటుంది. జిడ్డుపోగొట్టి ముఖం ఫ్రెష్‌గా ఉండడానికి ఎగ్, లెమన్‌ఫేస్‌మాస్క్ బాగాపనిచేస్తుంది.
ఒక గుడ్డును తీసుకుని దానిలోని తెల్లసొనను ఒక గిన్నెలో వేసి దానికి స్పూను తాజా నిమ్మరసం చేర్చి బాగా కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాలపాటు ఆరనివ్వాలి. ఫేస్‌మాస్క్ ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో కడిగి తుడుచుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల ముఖం మీద జిడ్డు, మొటిమలు తగ్గుతాయి.
టేబుల్ స్పూన్ తేనె, గుడ్డులోని తెల్లసొన కలిపి ముఖానికి ప్యాక్‌లా వేయాలి. పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. జిడ్డును తొలగించి, ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది ఈ ప్యాక్.
Comments
Please login to add a commentAdd a comment