న్యూఢిల్లీ: భారతదేశంలో మధువు తయారీ ప్రాచీన కాలం నుంచి కొనసాగుతోంది. పురాణాల్లోనూ సురాపానం ప్రస్తావన ఉంది. తాజాగా భారత విస్కీ ప్రపంచంలోనే ఉత్తమ మద్యంగా గుర్తింపు సాధించింది. 2023వ సంవత్సరానికి గాను విస్కీస్ ఆఫ్ ద వరల్డ్ అవార్డ్స్‌లో ‘ఇంద్రి సింగిల్ మాల్ట్ ఇండియన్ విస్కీ–లిమిటెడ్ దివాళీ కలెక్టర్స్ ఎడిషన్–2023’కి ప్రపంచంలో బెస్ట్ విస్కీగా ‘డబుల్ గోల్డ్, బెస్క్ ఇన్ షో’ అవార్డు లభించింది.
ఈ అవార్డు కోసం ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి ఎంతగానో పేరుప్రఖ్యాతులు పొందిన విస్కీలు పోటీపడ్డాయి. స్కాచ్, బార్బన్, కెనడియన్, ఆ్రస్టేలియన్, బ్రిటిష్ సింగిల్ మాల్ట్ విస్కీలను వెనక్కి నెట్టి భారతీయ సింగిల్ మాల్ట్ విస్కీ అరుదైన ఘనత దక్కించుకుంది. ఇంద్రి విస్కీని పికాడిల్లీ డిస్టిల్లరీస్ కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. రాజస్తాన్‌లోని ప్రత్యేకంగా పండించే బార్లీ, యమునా నది నీటితో ఈ విస్కీని తయారు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment