'విస్కీ'తో కారు రయ్ రయ్..! | Now, a car powered by whisky residue | Sakshi
Sakshi News home page

'విస్కీ'తో కారు రయ్ రయ్..!

Published Wed, Sep 9 2015 8:49 AM | Last Updated on Sun, Sep 3 2017 9:04 AM

'విస్కీ'తో కారు రయ్ రయ్..!

'విస్కీ'తో కారు రయ్ రయ్..!

లండన్: త్వరలో విస్కీతో కారు రయ్ మంటూ పరుగులు తీయనుంది. విస్కీ తయారు చేసే క్రమంలో దానినుంచి విడుదలయ్యే వ్యర్థాల ద్వారా పర్యావరణ హితమైన బయో ఇంధనాన్ని ఉత్పిత్తి చేసి దానిని కార్లకు ఉపయోగించనున్నారు. స్కాట్లాండ్ కు చెందిన శాస్త్రవేత్తలు ఈ దిశగా ముందడుగు వేశారు. ఇలా విస్కీతో ఫ్యూయెల్ తయారు చేసే కార్యక్రమాన్ని చేపట్టడం ఇదే తొలిసారి.

సాధరణంగా ప్రస్తుతం మనం కార్లలో వాడుతున్న డీజిల్, పెట్రోల్వంటి ఇంధనాల ద్వారా విడుదలయ్యే కాలుష్యం కన్నా ఈ రకమైన ఇంధనం ఉపయోగించిన కారు తక్కువ విడుదల చేస్తుంది. అంతేకాకుండా పర్యావరణానికి కలిగే నష్టం కూడా ఈ ఇంధనం ద్వారా 60శాతం తగ్గిపోతుంది. ఎడిన్బర్గ్ చెందిన ఓ విస్కీ తయారీ సంస్థకు ఇప్పటికే ఈ విధమైన ఇంధనం తయారు చేసేందుకు మొత్తం 11 మిలియన్లను విడుదల చేసినట్లు రోడ్డు రవాణాశాఖ మంత్రి ఆండ్రూ జాన్స్ తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement