biofuel
-
భారత ఆర్థిక వ్యవస్థకు ఇదే కీలకం: నితిన్ గడ్కరీ
పెట్రోల్, డీజిల్ కార్ల వినియోగాన్ని తగ్గించాలని, ప్రత్యామ్నాయ వాహనాలను ఉపయోగించాలని కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' చెబుతూనే ఉన్నారు. ఈ విషయాన్ని ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావిస్తూ.. ఫ్లెక్స్-ఫ్యూయెల్ వాహనాల వినియోగానికి సంబంధించి కూడా మాట్లాడారు.ఫ్లెక్స్-ఫ్యూయెల్ వాహనాలపై జీఎస్టీ తగ్గించాలని (12 శాతానికి), దీని గురించి రాష్ట్ర ఆర్థికమంత్రులు యోచించాలని గడ్కరీ అన్నారు. శిలాజ ఇంధనాల దిగుమతిని తగ్గించి, జీవ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించాలని ఆయన పేర్కొన్నారు. దీనికోసం వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రుల మద్దతు అవసరమని అన్నారు.ఫ్లెక్స్ ఫ్యూయెల్ వాహనాలు ఒకటి కంటే ఎక్కువ రకాల ఇంధనంతో లేదా మిశ్రమంతో నడుస్తుంది. అంటే పెట్రోల్ & ఇథనాల్ లేదా మిథనాల్ మిశ్రమం అన్నమాట. ఇది పెట్రోల్ దిగుమతులను తగ్గిస్తుంది. తద్వారా దేశ ఆర్తిగా పరిస్థితి మరింత మెరుగుపడుతుంది.ప్రతి సంవత్సరం భారతదేశం సుమారు రూ. 22 లక్షల కోట్ల విలువైన ఇంధనాలను దిగుమతి చేసుకుంటోంది. శిలాజ ఇంధనాల వల్ల వాయుకాలుష్యం పెరగడమే కాకుండా.. ఆర్ధిక పరిస్థిని కూడా కొంత దిగజార్చుతుంది. కాబట్టి వీలైనంత వరకు మనం దిగుమతులను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. దీనివైపే అడుగులు వేయాలని గడ్కరీ సూచించారు. దేశంలో జీవ ఇంధనం పుష్కలంగా ఉంది. దీనిని ప్రోత్సహిస్తే.. ఇది వ్యవసాయ రంగానికి కూడా లబ్ధి చేకూర్చుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.ఆర్థిక వ్యవస్థకు ఆటోమొబైల్ రంగం కీలకంభారత ఆర్థిక వ్యవస్థకు ఆటోమొబైల్ పరిశ్రమ ఒక ముఖ్యమైన విభాగం. దీని వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కువ జీఎస్టీ లభిస్తుంది. అంతే కాకుండా ఈ రంగంలో ఉద్యోగావకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ఆటోమొబైల్ రంగంలో 4.5 కోట్ల కంటే ఎక్కువమంది ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఈ నెంబర్ ప్లేట్స్ కావాలా.. ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?హీరో, బజాజ్ వంటి ద్విచక్ర వాహన తయారీ సంస్థలు భారత్‌లో తయారు చేసే బైక్‌లలో 50 శాతం ఎగుమతి చేస్తున్నాయని గడ్కరీ చెప్పారు. జీవ ఇంధనం కోసం మనం మంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉంటే.. ఎగుమతులు 10 నుండి 20 శాతం వరకు పెరుగుతాయి. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఇప్పుడు కాలుష్యం కారకాలను విడనాడటానికి సిద్ధంగా ఉన్నయని ఆయన అన్నారు. -
గ్లోబల్ బయోఫ్యూయల్స్ కూటమిలో భాగం కండి
న్యూఢిల్లీ: ఇటీవల ప్రారంభించిన గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్‌లో భాగం కావాలని గ్లోబల్ సౌత్ దేశాలకు భారత్ పిలుపునిచి్చంది. జీవఇంధనాల అభివృద్ధికి సంబంధించిన నైపుణ్యాలను వర్ధమాన దేశాలు, అంతగా అభివృద్ధి చెందని దేశాలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. 2వ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సదస్సులో పాల్గొన్న కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఈ మేరకు పిలుపునిచ్చారు. పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్‌ని కలిపి వినియోగంలోకి తేవాలన్న లక్ష్యాన్ని అయిదు నెలల ముందుగా 2022 మేలో భారత్ సాధించిందని, దీన్ని 20 శాతానికి పెంచుకోవాలన్న లక్ష్యాన్ని అయిదేళ్లు ముందుకు జరిపి 2025కి మార్చుకుందని ఆయన చెప్పారు. బయోమాస్‌ను ఇంధనంగా మార్చడం ద్వారా ఇటు రైతులకు అదనపు ఆదాయ వనరును అందుబాటులోకి తేవడంతో పాటు కర్బన ఉద్గారాల తగ్గింపునకు కూడా భారత్ కృషి చేస్తోందని పురి వివరించారు. ఇందుకు సంబంధించి టెక్నాలజీ బదలాయింపు, సంయుక్త పరిశోధన .. అభివృద్ధి కార్యకలాపాలు, మానవ వనరుల నైపుణ్యాభివృద్ధి తదితర అంశాల్లో ఇతర గ్లోబల్ సౌత్ దేశాలతో కలిసి పని చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. బయోమాస్ నుంచి తయారు చేసే జీవ ఇంధనాలను ప్రపంచవ్యాప్తంగా వినియోగంలోకి తెచ్చే లక్ష్యంతో గ్లోబల్ బయోఫ్యూయల్ అలయెన్స్ ఏర్పడింది. ఇందులో అమెరికా, బ్రెజిల్ వంటి దేశాలు భాగంగా ఉన్నాయి. కొన్ని దేశాలు మినహా ఉత్తరార్ధగోళంలో ఉన్న మెజారిటీ దేశాలను గ్లోబల్ నార్త్గాను, దక్షిణార్ధగోళంలో ఉన్న దేశాలను గ్లోబల్ సౌత్గాను వ్యవహరిస్తున్నారు. -
‘ఇథనాల్’ ప్రచారంలో టయోటా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టయోటా కిర్లోస్కర్ మోటార్ తాజాగా ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్‌తో (ఇస్మా) చేతులు కలిపింది. భారత్‌లో స్థిర జీవ ఇంధనంగా ఇథనాల్‌ను ఉపయోగించడాన్ని ప్రోత్సహించడానికి, అవగాహన కల్పించడానికి ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. పర్యావరణ అనుకూల సాంకేతికతతో పాటు ఇంధన స్వావలంబనను ప్రోత్సహించే వివిధ అధునాతన పవర్ట్రెయిన్ల కోసం నిరంతరం అధ్యయనం చేస్తున్నట్టు టయోటా తెలిపింది. ఇథనాల్‌ను జీవ ఇంధనంగా ఉపయోగించడాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. 2025 నాటికి పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలపడం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. 2025–2026 నాటికి 8.6 కోట్ల బ్యారెల్స్ పెట్రోల్ స్థానంలో 20 శాతం ఇథనాల్ మిశ్రమం ద్వారా భారత్‌కు రూ.30,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని అంచనా. -
బయో ఇంధన కూటమికి డిమాండ్ చేస్తాం: కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా సోలార్ కూటమి విజయం సాధించిన మాదిరే.. అంతర్జాతీయంగా బయో ఇంధన కూటమి కోసం ప్రయత్నిస్తామని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఇందుకు జీ20 నాయకత్వాన్ని సద్వినియోగం చేసుకుంటామన్నారు. కేపీఎంజీ ఎన్రిచ్ 2022 సదస్సులో భాగంగా మంత్రి మాట్లాడారు. బయో ఇంధనాలను వినియోగిస్తున్న బ్రెజిల్ నుంచి అమెరికా తదితర దేశాలతో కూడిన కూటమి.. బయో ఇంధనాలకు సంబంధించి ప్రమాణాలను రూపొందించడం, ఇంజన్లు, టెక్నాలజీ సహకారం దిశగా కృషి చేస్తుందన్నారు. భారత్ ఇప్పటికే పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్ మిశ్రమాన్ని ఉపయోగిస్తున్నట్టు చెప్పారు. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ లక్ష్యాన్ని 2030కు బదులు 2024–25 నాటికే సాధించాలని నిర్ణయించినట్టు తెలిపారు. జీ20లో భాగంగా ఉన్న అమెరికా, బ్రెజిల్, అర్జెంటీనా, ఇండోనేషియా, చైనా తదిత దేశాలు బయో ఇంధనాలను తయారు చేస్తుండడం గమనార్హం. (అమెజాన్‌కు ఏమైంది? వారంలో మూడో బిజినెస్‌కు బై..బై..!) -
ఫార్ములా వన్ రేసులు.. సంచలన నిర్ణయం
అసలే ఇంధన ధరలు మండిపోతున్నాయి. దీనికితోడు ఆ ఇంధనాల వల్ల కాలుష్యం పెరిగి పర్యావరణానికి మరింత హాని చేస్తోంది. ఈ తరుణంలో వచ్చే ఫార్ములా వన్ సీజన్ కోసం ఎఫ్ఐఏ (ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్) సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ అత్యున్నత ఆటో రేసింగ్ ఫార్ములా వన్ తరపున ఎఫ్ఐఏ అభినందనీయమైన నిర్ణయం తీసుకుంది. వచ్చే సీజన్లో స్థిరమైన ఇంధనాలు(sustainable fuels).. అదీ సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్ మాత్రమే ఉపయోగించాలని నిర్ణయించింది. తద్వారా కాలుష్యాన్ని తగ్గించే పనిలో పడింది. ఈ నిర్ణయంతో వచ్చే ఏడాది నుంచి ఈ10 ఫ్యూయల్ ఉపయోగించనున్నారు. అయితే ఇప్పటిదాకా ఉపయోగిస్తున్న ఇంధన వనరుల వ్యాపార ఒప్పందాలపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపించనుంది. 2022 ఎఫ్‌వన్ సీజన్ మార్చ్ 20న బహ్రయిన్లో మొదలై.. నవంబర్ 20న అబుదాబిలో ముగియనుంది. ఇక చాలా ఏళ్లుగా రేసింగ్‌లో ఉపయోగించే ఇంధనాల వల్ల కాలుష్యం పెరుగుతోందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ తరుణంలో ఇంధనాల్లో ఇథనాల్ మిక్సింగ్ మోతాదును పెంచాలని నిర్ణయించారు. రానున్న పదేళ్లకల్లా జీరో కార్బన్ లక్క్ష్యంగా పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది ఎఫ్ఐఏ. 2025, 2026 నాటికల్లా 100 శాతం స్థిరమైన ఇంధనాలు (sustainable fuels) ఉపయోగ సాధన దిశగా ఎఫ్ఐఏ అడుగులు వేస్తోంది. చదవండి: ఫార్ములా వన్.. సెంచరీ విక్టరీల వీరుడు ఎవరో తెలుసా? -
‘పెట్రోలియం’కు జీవ ఇంధనమే సరైన ప్రత్యామ్నాయం
వాషింగ్టన్: మొక్కల ఆధారిత జీవ ఇంధనం విమానయా న రంగంలో ఇంధనం గా వినియోగిస్తున్న పెట్రోలియం ఉత్ప త్తులకు సరైన ప్రత్యామ్నా యం అవుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డా రు. మొక్కల ఆధారిత జీవ ఇంధనంపై ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనలు విజయవం తమైతే గనుక భవిష్యత్తులో విమానయాన రంగంలో ఇంధనంగా దీనిని వాడుకోవచ్చన్నారు. విమానయాన రంగం రోజుకు 50 లక్షల బ్యారెళ్ల ఇంధనాన్ని వాడుకుంటోంది. రోడ్డు రవాణాతోపాటు ఇళ్లు, పరిశ్రమలు ప్రత్యామ్నాయ ఇంధ నాల వైపు దృష్టి సారిస్తున్నాయి. అయితే ప్రస్తుతమున్న సాంకేతికతతో ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి సారించడం విమానయాన రంగంలో కుదరని అంశం. దీంతో కేవలం పెట్రోలియం ఉత్పత్తులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎలక్ట్రిక్ విమానాలను తయారు చేయడం వంటిది అతిపెద్ద సవాలుతో కూడుకోవడంతో ఆ దిశగా ఎలాంటి అడుగులు పడలేదు. దీంతో ద్రవీకృత జీవ ఇంధనాలే విమానయాన రంగానికి సరైన ప్రత్యామ్నాయం కానున్నాయని లారెన్స్ బర్క్లీ నేషనల్ ల్యాబోరేటరి పరిశోధకులు కోర్నీ స్క్వాన్ వెల్లడించారు. మొక్కల ఆధారిత జీవ ఇంధనంపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ పరిశోధన ఫలితాలు ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
నేడే గగనతలంలోకి తొలి జీవ ఇంధన విమానం..
సాక్షి, హైదరాబాద్ : నిజం.. మన దేశంలో జీవ ఇంధనంతోనడిచే తొలి విమానం నేడు గాల్లోకి ఎగరనుంది. ప్రైవేట్ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ విమానం (బాంబార్డియర్ క్యూ400 టర్బోప్రోప్) సోమవారం డెహ్రాడూన్ నగరంపైఓ 10 నిమిషాల పాటు చక్కర్లు కొట్టి.. అక్కడి విమానాశ్రయంలో దిగుతుంది. అంతా సవ్యంగా సాగితే.. ఢిల్లీ వరకు సర్వీసును కొనసాగిస్తుంది. ఇలా జీవ ఇంధనంతో నడిచే విమాన సర్వీసులను అమెరికా, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాలే నిర్వహిస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇలాంటివి తక్కువే. ఆ లెక్కన మన దేశం ఓ రికార్డు సృష్టిస్తున్నట్లే. జీవ ఇంధనం అంటే? పునర్వినియోగ వనరుల నుంచి ఉత్పత్తి చేసిన ఇంధనాన్ని డీజిల్ లేదా పెట్రోల్‌కు స్థానంలో ఉపయోగించడం లేదా వాటితో కలిపి మిశ్రమంగా వాడే దాన్ని జీవ ఇంధనం అంటారు. అంటే ఎథనాల్ వంటివి. దీన్ని చెరకు, మొక్కజొన్న వంటి వాటి నుంచి తయారుచేస్తారు. -
జీవ ఇంధన విమానం ఆకాశయానం నేడే..
నిజం.. మన దేశంలో జీవ ఇంధనంతో నడిచే తొలి విమానం నేడు గాల్లోకి ఎగరనుంది. ప్రైవేట్ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ విమానం సోమవారం డెహ్రాడూన్ నగరంపై ఓ 10 నిమిషాల పాటు చక్కర్లు కొట్టి.. అక్కడి విమానాశ్రయంలో దిగుతుంది. అంతా సవ్యంగా సాగితే.. ఢిల్లీ వరకు సర్వీసును కొనసాగిస్తుంది. ఇలా జీవ ఇంధనంతో నడిచే విమాన సర్వీసులను అమెరికా, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాలే నిర్వహిస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇలాంటివి తక్కువే. ఆ లెక్కన మన దేశం ఓ రికార్డు సృష్టిస్తున్నట్లే. ఎప్పుడు.. ఎక్కడ..? తేదీ : 2018 ఆగస్టు 27 ఎయిర్‌లైన్స్ సంస్థ : స్పైస్‌జెట్ విమానం : బాంబార్డియర్ క్యూ400 టర్బోప్రోప్ మార్గం : డెహ్రాడూన్ నుంచి ఢిల్లీ.. ఈ విహారంలో ప్రయాణికులను అనుమతించరు.. పాలసీ ఏం చెబుతోంది? ఇటీవలే జాతీయ జీవ ఇంధన విధానం–2018ని భారత్ విడుదల చేసింది. దీని ప్రకారం 2030 నాటికి పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలిపి వాడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జీవ ఇంధనం అంటే? పునర్వినియోగ వనరుల నుంచి ఉత్పత్తి చేసిన ఇంధనాన్ని డీజిల్ లేదా పెట్రోల్ స్థానంలో ఉపయోగించడం లేదా వాటితో కలిపి మిశ్రమంగా వాడే దాన్ని జీవ ఇంధనం అంటారు. అంటే ఇథనాల్ వంటివి. దీన్ని చెరకు, మొక్కజొన్న వంటి వాటి నుంచి తయారుచేస్తారు. -
భారాన్ని ఇథనాల్‌తో తగ్గిద్దాం!
న్యూఢిల్లీ: వచ్చే నాలుగేళ్లలో ఇథనాల్ ఉత్పత్తిని మూడింతలు పెంచాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. చెరకు నుంచి సంగ్రహించే ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలపడం వల్ల ఇంధన దిగుమతులకు వెచ్చిస్తున్న వ్యయంలో రూ.12 వేల కోట్లను ఆదాచేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం సందర్భంగా శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. దేశ వ్యాప్తంగా రూ.10 వేల కోట్ల వ్యయంతో 12 జీవ ఇంధన శుద్ధి కర్మాగారాలను ఏర్పాటుచేస్తున్నామన్నారు. పంట అవశేషాలు, పట్టణ ప్రాంతాల వ్యర్థాల నుంచి ఈ కేంద్రాలు ఇంధనాన్ని తయారుచేస్తాయని తెలిపారు. స్వచ్ఛ భారత్, రైతుల ఆదాయం రెట్టింపునకు జీవ ఇంధనాలు సహకారం అందిస్తాయన్నారు. అభివృద్ధి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులిచ్చే సింగిల్ విండో వెబ్ పోర్టల్ ‘పరివేశ్’ను ప్రారంభించారు. రైతుకు ఆదాయం, యువతకు ఉపాధి.. జీవ ఇంధనాలు పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా, ముడిచమురుపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంతో పాటు, రైతులకు అదనపు ఆదాయం సమకూరడంలో అవి దోహదపడతాయన్నారు. ‘2013–14లో పెట్రోల్‌లో కలిపిన ఇథనాల్ పరిమాణం 38 కోట్ల లీటర్లు ఉండగా, 2017–18 నాటికి 141 కోట్ల లీటర్లకు చేరింది. దీంతో ఇంధన దిగుమతుల బిల్లులో రూ.4 వేల కోట్లు ఆదా అయ్యాయి’ అని మోదీ అన్నారు. -
'విస్కీ'తో కారు రయ్ రయ్..!
లండన్: త్వరలో విస్కీతో కారు రయ్ మంటూ పరుగులు తీయనుంది. విస్కీ తయారు చేసే క్రమంలో దానినుంచి విడుదలయ్యే వ్యర్థాల ద్వారా పర్యావరణ హితమైన బయో ఇంధనాన్ని ఉత్పిత్తి చేసి దానిని కార్లకు ఉపయోగించనున్నారు. స్కాట్లాండ్ కు చెందిన శాస్త్రవేత్తలు ఈ దిశగా ముందడుగు వేశారు. ఇలా విస్కీతో ఫ్యూయెల్ తయారు చేసే కార్యక్రమాన్ని చేపట్టడం ఇదే తొలిసారి. సాధరణంగా ప్రస్తుతం మనం కార్లలో వాడుతున్న డీజిల్, పెట్రోల్వంటి ఇంధనాల ద్వారా విడుదలయ్యే కాలుష్యం కన్నా ఈ రకమైన ఇంధనం ఉపయోగించిన కారు తక్కువ విడుదల చేస్తుంది. అంతేకాకుండా పర్యావరణానికి కలిగే నష్టం కూడా ఈ ఇంధనం ద్వారా 60శాతం తగ్గిపోతుంది. ఎడిన్బర్గ్ చెందిన ఓ విస్కీ తయారీ సంస్థకు ఇప్పటికే ఈ విధమైన ఇంధనం తయారు చేసేందుకు మొత్తం 11 మిలియన్లను విడుదల చేసినట్లు రోడ్డు రవాణాశాఖ మంత్రి ఆండ్రూ జాన్స్ తెలియజేశారు.