
సాక్షి, హైదరాబాద్ : నిజం.. మన దేశంలో జీవ ఇంధనంతోనడిచే తొలి విమానం నేడు గాల్లోకి ఎగరనుంది. ప్రైవేట్ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ విమానం (బాంబార్డియర్ క్యూ400 టర్బోప్రోప్) సోమవారం డెహ్రాడూన్ నగరంపైఓ 10 నిమిషాల పాటు చక్కర్లు కొట్టి.. అక్కడి విమానాశ్రయంలో దిగుతుంది. అంతా సవ్యంగా సాగితే.. ఢిల్లీ వరకు సర్వీసును కొనసాగిస్తుంది. ఇలా జీవ ఇంధనంతో నడిచే విమాన సర్వీసులను అమెరికా, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాలే నిర్వహిస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇలాంటివి తక్కువే. ఆ లెక్కన మన దేశం ఓ రికార్డు సృష్టిస్తున్నట్లే.
జీవ ఇంధనం అంటే?
పునర్వినియోగ వనరుల నుంచి ఉత్పత్తి చేసిన ఇంధనాన్ని డీజిల్ లేదా పెట్రోల్‌కు స్థానంలో ఉపయోగించడం లేదా వాటితో కలిపి మిశ్రమంగా వాడే దాన్ని జీవ ఇంధనం అంటారు. అంటే ఎథనాల్ వంటివి. దీన్ని చెరకు, మొక్కజొన్న వంటి వాటి నుంచి తయారుచేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment