నిజం.. మన దేశంలో జీవ ఇంధనంతో నడిచే తొలి విమానం నేడు గాల్లోకి ఎగరనుంది. ప్రైవేట్ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ విమానం సోమవారం డెహ్రాడూన్ నగరంపై ఓ 10 నిమిషాల పాటు చక్కర్లు కొట్టి.. అక్కడి విమానాశ్రయంలో దిగుతుంది. అంతా సవ్యంగా సాగితే.. ఢిల్లీ వరకు సర్వీసును కొనసాగిస్తుంది. ఇలా జీవ ఇంధనంతో నడిచే విమాన సర్వీసులను అమెరికా, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాలే నిర్వహిస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇలాంటివి తక్కువే. ఆ లెక్కన మన దేశం ఓ రికార్డు సృష్టిస్తున్నట్లే.
ఎప్పుడు.. ఎక్కడ..?
తేదీ : 2018 ఆగస్టు 27
ఎయిర్‌లైన్స్ సంస్థ : స్పైస్‌జెట్
విమానం : బాంబార్డియర్ క్యూ400 టర్బోప్రోప్
మార్గం : డెహ్రాడూన్ నుంచి ఢిల్లీ..
ఈ విహారంలో ప్రయాణికులను అనుమతించరు..
పాలసీ ఏం చెబుతోంది?
ఇటీవలే జాతీయ జీవ ఇంధన విధానం–2018ని భారత్ విడుదల చేసింది. దీని ప్రకారం 2030 నాటికి పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలిపి వాడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
జీవ ఇంధనం అంటే?
పునర్వినియోగ వనరుల నుంచి ఉత్పత్తి చేసిన ఇంధనాన్ని డీజిల్ లేదా పెట్రోల్ స్థానంలో ఉపయోగించడం లేదా వాటితో కలిపి మిశ్రమంగా వాడే దాన్ని జీవ ఇంధనం అంటారు. అంటే ఇథనాల్ వంటివి. దీన్ని చెరకు, మొక్కజొన్న వంటి వాటి నుంచి తయారుచేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment