Dehradun to Delhi
-
జీవ ఇంధన విమానం ఆకాశయానం నేడే..
నిజం.. మన దేశంలో జీవ ఇంధనంతో నడిచే తొలి విమానం నేడు గాల్లోకి ఎగరనుంది. ప్రైవేట్ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ విమానం సోమవారం డెహ్రాడూన్ నగరంపై ఓ 10 నిమిషాల పాటు చక్కర్లు కొట్టి.. అక్కడి విమానాశ్రయంలో దిగుతుంది. అంతా సవ్యంగా సాగితే.. ఢిల్లీ వరకు సర్వీసును కొనసాగిస్తుంది. ఇలా జీవ ఇంధనంతో నడిచే విమాన సర్వీసులను అమెరికా, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాలే నిర్వహిస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇలాంటివి తక్కువే. ఆ లెక్కన మన దేశం ఓ రికార్డు సృష్టిస్తున్నట్లే. ఎప్పుడు.. ఎక్కడ..? తేదీ : 2018 ఆగస్టు 27 ఎయిర్‌లైన్స్ సంస్థ : స్పైస్‌జెట్ విమానం : బాంబార్డియర్ క్యూ400 టర్బోప్రోప్ మార్గం : డెహ్రాడూన్ నుంచి ఢిల్లీ.. ఈ విహారంలో ప్రయాణికులను అనుమతించరు.. పాలసీ ఏం చెబుతోంది? ఇటీవలే జాతీయ జీవ ఇంధన విధానం–2018ని భారత్ విడుదల చేసింది. దీని ప్రకారం 2030 నాటికి పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలిపి వాడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జీవ ఇంధనం అంటే? పునర్వినియోగ వనరుల నుంచి ఉత్పత్తి చేసిన ఇంధనాన్ని డీజిల్ లేదా పెట్రోల్ స్థానంలో ఉపయోగించడం లేదా వాటితో కలిపి మిశ్రమంగా వాడే దాన్ని జీవ ఇంధనం అంటారు. అంటే ఇథనాల్ వంటివి. దీన్ని చెరకు, మొక్కజొన్న వంటి వాటి నుంచి తయారుచేస్తారు. -
బయో ఇంధనంతో తొలి విమానం..
సాక్షి, న్యూఢిల్లీ : భారత్ నుంచి తొలిసారిగా బయో ఇంధనం ఉపయోగించి సోమవారం డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి విమానం చేరుకోనుంది. ఈ ఇంధనం ఉపయోగిస్తూ డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి టర్బోప్రాప్, క్యూ-400 ఆపరేట్ చేయాలని స్పైస్‌జెట్ సన్నాహాలు చేస్తోంది. అమెరికా, ఆస్ర్టేలియాలు ఇప్పటికే బయో ఇంధనంతో కమర్షియల్ విమానాలను విజయంవతంగా నడుపుతున్నాయి. ఈ తరహా బయోఇంధనంతో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విమానాలను నడిపే తొలిదేశంగా భారత్ గుర్తింపుపొందనుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం డెహ్రాడూన్‌లో బయో ఇంధనంతో బాంబార్డియర్ క్యూ-400 పదినిమిషాల పాటు నగరంలో చక్కర్లు కొట్టి తిరిగి టేకాఫ్ అయిన ప్రాంతానికి చేరుకుంటుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే విమానం మరోసారి టేకాఫ్ తీసుకుని ఈసారి ఢిల్లీకి బయలుదేరుతుంది. ఈ విమానం ఎగిరే తీరు, ప్రయాణ తీరుతెన్నులను పర్యవేక్షించేందుకు డీజీసీఏ సహా పలు రెగ్యులేటరీ ఏజెన్సీల అధికారులు విమానంలో ప్రయాణించనున్నారు. -
జెట్ విమానం అత్యవసర లాండింగ్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జెట్ ఎయిర్వేస్కు చెందిన డెహ్రడూన్- ఢిల్లీ విమానం అత్యవసరంగా దింపేయాల్సి వచ్చింది. 45 మంది ప్రయాణికులతో డెహ్రడూన్ నుంచి ఢిల్లీకి బయల్దేరిన విమానంలో ఇందనం కొరత సమస్య తలెత్తింది. అప్రమత్తమైన పైలట్.. జెట్ ఎయిర్వేస్ అధికారులకు సమాచారం అందించాడు. అధికారుల సూచన మేరకు చౌదరి చారణ్ సింగ్(సీసీఎస్) విమానశ్రయంలో జెట్ విమానాన్ని అత్యవసర పరిస్థితిలో దింపేశారు. అయితే విమానంలో ఉన్న ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారంటూ సీసీఎస్ ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ప్రదీప్ కుమార్ శ్రీవాస్తవ విలేకరులతో చెప్పారు.