బయో ఇంధనంతో తొలి విమానం.. | First Biofuel Flight In India May Fly From Dehradun | Sakshi
Sakshi News home page

బయో ఇంధనంతో తొలి విమానం..

Published Fri, Aug 24 2018 5:14 PM | Last Updated on Fri, Aug 24 2018 5:15 PM

First Biofuel Flight In India May Fly From Dehradun - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌ నుంచి తొలిసారిగా బయో ఇంధనం ఉపయోగించి సోమవారం డెహ్రాడూన్‌ నుంచి ఢిల్లీకి విమానం చేరుకోనుంది. ఈ ఇంధనం ఉపయోగిస్తూ డెహ్రాడూన్‌ నుంచి ఢిల్లీకి టర్బోప్రాప్‌, క్యూ-400 ఆపరేట్‌ చేయాలని స్పైస్‌జెట్‌ సన్నాహాలు చేస్తోంది. అమెరికా, ఆస్ర్టేలియాలు ఇప్పటికే బయో ఇంధనంతో కమర్షియల్‌ విమానాలను విజయంవతంగా నడుపుతున్నాయి. ఈ తరహా బయోఇంధనంతో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విమానాలను నడిపే తొలిదేశంగా భారత్‌ గుర్తింపుపొందనుంది.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం డెహ్రాడూన్‌లో బయో ఇంధనంతో బాంబార్డియర్‌ క్యూ-400 పదినిమిషాల పాటు నగరంలో చక్కర్లు కొట్టి తిరిగి టేకాఫ్‌ అయిన ప్రాంతానికి చేరుకుంటుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే విమానం మరోసారి టేకాఫ్‌ తీసుకుని ఈసారి ఢిల్లీకి బయలుదేరుతుంది. ఈ విమానం ఎగిరే తీరు, ప్రయాణ తీరుతెన్నులను పర్యవేక్షించేందుకు డీజీసీఏ సహా పలు రెగ్యులేటరీ ఏజెన్సీల అధికారులు విమానంలో ప్రయాణించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement