పెట్రోల్, డీజిల్ కార్ల వినియోగాన్ని తగ్గించాలని, ప్రత్యామ్నాయ వాహనాలను ఉపయోగించాలని కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' చెబుతూనే ఉన్నారు. ఈ విషయాన్ని ఇటీవల జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావిస్తూ.. ఫ్లెక్స్-ఫ్యూయెల్ వాహనాల వినియోగానికి సంబంధించి కూడా మాట్లాడారు.
ఫ్లెక్స్-ఫ్యూయెల్ వాహనాలపై జీఎస్‌టీ తగ్గించాలని (12 శాతానికి), దీని గురించి రాష్ట్ర ఆర్థికమంత్రులు యోచించాలని గడ్కరీ అన్నారు. శిలాజ ఇంధనాల దిగుమతిని తగ్గించి, జీవ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించాలని ఆయన పేర్కొన్నారు. దీనికోసం వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రుల మద్దతు అవసరమని అన్నారు.
ఫ్లెక్స్ ఫ్యూయెల్ వాహనాలు ఒకటి కంటే ఎక్కువ రకాల ఇంధనంతో లేదా మిశ్రమంతో నడుస్తుంది. అంటే పెట్రోల్ & ఇథనాల్ లేదా మిథనాల్ మిశ్రమం అన్నమాట. ఇది పెట్రోల్ దిగుమతులను తగ్గిస్తుంది. తద్వారా దేశ ఆర్తిగా పరిస్థితి మరింత మెరుగుపడుతుంది.
ప్రతి సంవత్సరం భారతదేశం సుమారు రూ. 22 లక్షల కోట్ల విలువైన ఇంధనాలను దిగుమతి చేసుకుంటోంది. శిలాజ ఇంధనాల వల్ల వాయుకాలుష్యం పెరగడమే కాకుండా.. ఆర్ధిక పరిస్థిని కూడా కొంత దిగజార్చుతుంది. కాబట్టి వీలైనంత వరకు మనం దిగుమతులను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. దీనివైపే అడుగులు వేయాలని గడ్కరీ సూచించారు. దేశంలో జీవ ఇంధనం పుష్కలంగా ఉంది. దీనిని ప్రోత్సహిస్తే.. ఇది వ్యవసాయ రంగానికి కూడా లబ్ధి చేకూర్చుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆర్థిక వ్యవస్థకు ఆటోమొబైల్ రంగం కీలకం
భారత ఆర్థిక వ్యవస్థకు ఆటోమొబైల్ పరిశ్రమ ఒక ముఖ్యమైన విభాగం. దీని వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కువ జీఎస్‌టీ లభిస్తుంది. అంతే కాకుండా ఈ రంగంలో ఉద్యోగావకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ఆటోమొబైల్ రంగంలో 4.5 కోట్ల కంటే ఎక్కువమంది ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: ఈ నెంబర్ ప్లేట్స్ కావాలా.. ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
హీరో, బజాజ్ వంటి ద్విచక్ర వాహన తయారీ సంస్థలు భారత్‌లో తయారు చేసే బైక్‌లలో 50 శాతం ఎగుమతి చేస్తున్నాయని గడ్కరీ చెప్పారు. జీవ ఇంధనం కోసం మనం మంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉంటే.. ఎగుమతులు 10 నుండి 20 శాతం వరకు పెరుగుతాయి. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఇప్పుడు కాలుష్యం కారకాలను విడనాడటానికి సిద్ధంగా ఉన్నయని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment