మొక్కలతో 'భారత్‌ మాత' అని రాసి గిన్నిస్‌ రికార్డు! | Maharashtra Forest Department Sets Guinness World Writing Bharat Mata | Sakshi
Sakshi News home page

మొక్కలతో 'భారత్‌ మాత' అని రాసి గిన్నిస్‌ రికార్డు !

Published Mon, Mar 4 2024 10:45 AM | Last Updated on Mon, Mar 4 2024 11:08 AM

Maharashtra Forest Department Sets Guinness World Writing Bharat Mata - Sakshi

మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో తడోబా ఫెస్టివల్‌ 2024 సందర్భంగా మహారాష్ట్ర అటవీ శాఖ వేలాది మొక్కలను ఉపయోగించి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు నెలకొల్పింది. హిందీలో 'భారత్‌ మాత' అనే పదాన్ని రాసేందుకు దాదాపు 65,724 మొక్కలను ఉపయోగించి ఈ రికార్డును సొంతం చేసుకుంది అటవీ శాఖ. చంద్రాపూర్‌లో జరగనున్న మూడు రోజులు తడోబా ఉత్సవం సందర్భంగా అటవీ శాఖ ఈ వినూత్న ప్రయోగానికి నాంది పలికి తొలి ప్రయత్నంలోనే ప్రపంచ రికార్డును సాధించిందని గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు పరిశీలకుడు స్వప్నిల్‌ దాంగ్రికర్‌ తెలిపారు.

అలాగే 'భారత్‌ మాత' అనే దేశభక్తి పదంలో మొక్కల అమరికను ప్రదర్శించిన చిత్రాలను అటవీ శాక మంత్రి తడోబా అంధారి టైగర్‌ రిజర్వ్‌ సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేస్తూ..తడోభా ఫెస్టివల్‌ సందర్భంగా రాష్ట్ర అటవీ శాఖ 'భారత్ మాత' అనే పదాన్ని సృష్టించింది. సుమారు 26 రకాల జాతులకు చెందిన 65,724 మొక్కలతో గిన్నిస్‌ రికార్డు నెలకొల్పింది అని పోస్ట్‌లో పేర్కొన్నారు.

అటవీ శాఖ చేసిన ఈ సాహసాన్ని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సుధీర్‌ ముంగంటివార్‌ ఎంతగానో ప్రశంసించారు. ఇలాంటి ప్రయత్నాలు సిబ్బందిలో మనోధైర్యాన్ని పెంచుతాయని అన్నారు. అలాగే ఈ మొక్కలు వృక్షాలుగా పెరిగిన తర్వాత, డ్రోన్ సహాయంతో ఏరియల్ ఫోటోగ్రఫీ చేసినప్పుడు 'భారత్‌ మాత' అని వ్రాసి ఉన్న మొక్కలను చూడొచ్చని ముంగంటివార్ చెప్పారు. ఇక తడోబా-అంధారి టైగర్ రిజర్వ్ (TATR) వన్యప్రాణుల సంరక్షణ, స్థిరమైన పర్యాటకం. మహారాష్ట్ర వారసత్వాన్ని పరిరక్షించడం లక్ష్యంగా ఈ తడోబా ఉత్సవాన్ని ఏటా ఘనంగా నిర్వహిస్తుంది.

(చదవండి: కళ్లు చెదిరే అందంతో రంగులీనుతుంది ఆ ఎడారి..అడుగుపెట్టారో అంటే..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement