Hindhi
-
కీర్తీ సురేష్ 'రఘు తాత' వచ్చేశాడు (ట్రైలర్)
రెగ్యులర్ కమర్షియల్ పాత్రలతో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లో పవర్ఫుల్ క్యారెక్టర్స్ కూడా చేస్తుంటారు హీరోయిన్ కీర్తీ సురేష్. మహానటి, పెంగ్విన్, మిస్ ఇండియా వంటి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లో నటించి మెప్పించిన కీర్తి.. తాజాగా మరో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘రఘు తాత’తో వస్తుంది. తాజాగా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. కీర్తీ సురేష్ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమాకు సుమన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఆగష్టు 15న ఈ చిత్రం విడుదల కానుంది. -
'రఘు తాత' వాళ్లకు వ్యతిరేకం కాదు: కీర్తి సురేష్
రెగ్యులర్ కమర్షియల్ క్యారెక్టర్స్ మాత్రమే కాకుండా... వీలైనప్పుడల్లా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లో పవర్ఫుల్ క్యారెక్టర్స్ కూడా చేస్తుంటారు హీరోయిన్ కీర్తీ సురేష్. ‘మహానటి’, ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’ వంటి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లో నటించి, ప్రేక్షకులను మెప్పించారు కీర్తి. తాజాగా ఆమె నటించిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘రఘు తాత’. కీర్తీ సురేష్ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమాకు సుమన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా టీజర్ విడుదలైన సమయం నుంచి పలు వివాదాలు వచ్చాయి. అయితే, తాజాగా కీర్తి వాటికి వివరణ ఇచ్చారు.జాతీయ భాష హిందీ గురించి చాలాకాలంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తమిళనాడులో హిందీ భాషపై చాలా వ్యతిరేకత ఉంది. మాతృభాష (తమిళభాష)పై ప్రేమ చూపించే తమిళనాడులో హిందీ భాషను నేర్చుకోవాలి అనే ఒత్తిడిని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడమే ఇందుకు కారణం. హిందీలో మాట్లాడితేనే ప్రభుత్వ ఉద్యోగాలు అనే నిబంధన విధించడం కూడా ముఖ్య కారణం. ఇక ఇదే అంశాన్ని 'రఘుతాత' సినిమాలో చూపించబోతున్నట్లు టీజర్ ద్వారా కనిపిస్తోంది.కీర్తి సురేష్ మాట్లాడుతూ.. 'ఇది చాలా సంతోషకరమైన సమయం. దర్శకుడు కథ చెబుతూ చాలా చోట్ల నవ్వించాడు. హోంబలే ప్రొడక్షన్స్ వారు తమిళ చిత్రాలను నిర్మిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రంలోని అన్ని పాటలు బాగా వచ్చాయి. రఘు తాత చిత్రాన్ని హిందీలో కూడా విడుదల చేస్తూ.. హిందీకి వ్యతిరేకంగా సినిమా చేయడమేంటి అంటున్నారు. ఇది హిందీ వ్యతిరేక చిత్రం కాదు. కానీ, హిందీని ఉద్దేశపూర్వకంగా ఒకరిపై విధించడాన్ని, మహిళలపై నేటి సమాజంలో విధించిన ఆంక్షలను వ్యతిరేకించే చిత్రం అని నేను చెప్పగలను. వివాదాస్పదం కాకుండా నవ్వించగలిగే మెయిన్ స్ట్రీమ్ సినిమా అవుతుంది. రఘుతాత విభిన్నమైన కథతో తెరకెక్కించాం. ఒక మహిళ ఎదుర్కొనే సవాళ్ల గురించి ఇందులో చూపించాం. సినిమా చూస్తే ఈ విషయం అందరికీ అర్థమవుతుంది. ఇందులో రాజకీయపరమైన వివాదాలు అంటూ ఏమీ లేవు. పూర్తిగా కామెడీ సినిమా మాత్రమే.. ఇందులో పనిచేసిన నటీనటులు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.' అన్నారు. -
మొక్కలతో 'భారత్ మాత' అని రాసి గిన్నిస్ రికార్డు!
మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో తడోబా ఫెస్టివల్ 2024 సందర్భంగా మహారాష్ట్ర అటవీ శాఖ వేలాది మొక్కలను ఉపయోగించి గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పింది. హిందీలో 'భారత్ మాత' అనే పదాన్ని రాసేందుకు దాదాపు 65,724 మొక్కలను ఉపయోగించి ఈ రికార్డును సొంతం చేసుకుంది అటవీ శాఖ. చంద్రాపూర్‌లో జరగనున్న మూడు రోజులు తడోబా ఉత్సవం సందర్భంగా అటవీ శాఖ ఈ వినూత్న ప్రయోగానికి నాంది పలికి తొలి ప్రయత్నంలోనే ప్రపంచ రికార్డును సాధించిందని గిన్నిస్ వరల్డ్ రికార్డు పరిశీలకుడు స్వప్నిల్ దాంగ్రికర్ తెలిపారు. అలాగే 'భారత్ మాత' అనే దేశభక్తి పదంలో మొక్కల అమరికను ప్రదర్శించిన చిత్రాలను అటవీ శాక మంత్రి తడోబా అంధారి టైగర్ రిజర్వ్ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ..తడోభా ఫెస్టివల్ సందర్భంగా రాష్ట్ర అటవీ శాఖ 'భారత్ మాత' అనే పదాన్ని సృష్టించింది. సుమారు 26 రకాల జాతులకు చెందిన 65,724 మొక్కలతో గిన్నిస్ రికార్డు నెలకొల్పింది అని పోస్ట్‌లో పేర్కొన్నారు. The Maharashtra Forest Department, Government of Maharashtra, India has achieved a remarkable feat while paying a tribute to the nation, at Chandrapur.#WWD2024#TadobaFestival#ConnectingPeopleAndPlanet#DigitalInnovation#WildlifeConservation#SaveTigerMission#SaveTheTiger pic.twitter.com/tK2oMY0T78 — Tadoba-Andhari Tiger Reserve (@mytadoba) March 3, 2024 అటవీ శాఖ చేసిన ఈ సాహసాన్ని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సుధీర్ ముంగంటివార్ ఎంతగానో ప్రశంసించారు. ఇలాంటి ప్రయత్నాలు సిబ్బందిలో మనోధైర్యాన్ని పెంచుతాయని అన్నారు. అలాగే ఈ మొక్కలు వృక్షాలుగా పెరిగిన తర్వాత, డ్రోన్ సహాయంతో ఏరియల్ ఫోటోగ్రఫీ చేసినప్పుడు 'భారత్ మాత' అని వ్రాసి ఉన్న మొక్కలను చూడొచ్చని ముంగంటివార్ చెప్పారు. ఇక తడోబా-అంధారి టైగర్ రిజర్వ్ (TATR) వన్యప్రాణుల సంరక్షణ, స్థిరమైన పర్యాటకం. మహారాష్ట్ర వారసత్వాన్ని పరిరక్షించడం లక్ష్యంగా ఈ తడోబా ఉత్సవాన్ని ఏటా ఘనంగా నిర్వహిస్తుంది. चंद्रपुरच्या ‘भारतमाता’ शब्दाची गिनेस बुक ऑफ वर्ल्ड रेकॉर्डमध्ये नोंद..!@narendramodi @GWR @mytadoba @MahaForest #TadobaFestival2024 #GuinnessWorldRecord #SMUpdate #Chandrapur #GreenBharatmata pic.twitter.com/6y2koiqeT0 — Sudhir Mungantiwar (@SMungantiwar) March 3, 2024 (చదవండి: కళ్లు చెదిరే అందంతో రంగులీనుతుంది ఆ ఎడారి..అడుగుపెట్టారో అంటే..!) -
దేశ సమైక్యతకు చిహ్నం ఆ భాష! జాతీయ భాషగా నీరాజనాలు అందుకుంటోంది
భాషతో బంధంజాతి నిర్మాణంలో భాష పాత్ర చాలా గొప్పది. అనేక విషయాలను అధ్యయనం చేయడం, విజ్ఞాన సాంకేతిక తదితర ఉన్నత రంగాల్లో ప్రావీణ్యత పొందడం ఒక భాష ద్వారానే సాధ్యపడుతుంది. ఒక వ్యక్తి సమగ్ర వికాసానికి భాష ఆయువుపట్టు. అదే భాష దేశాన్ని ఒకే తాటిపై నిలబడేలా, జాతీయ సమైక్యతా భావాన్ని పెంపొందించినప్పుడు ఆ భాష ‘జాతీయ భాష’గా నీరాజనాలు అందుకుంటుంది. ఆ పాత్రను అక్షరాలా ‘హిందీ’ భాష నిర్వర్తించింది, నిర్వర్తిస్తోంది కూడా. భారత స్వాతంత్య్ర సమరంలో ప్రజలను జాగృత పరచడంలో క్రియాశీల పాత్ర పోషించి, ప్రపంచంలోనే అత్యధికులు మాట్లాడే రెండవ భాషగా వికసించిన భాష హిందీని కొందరు ఇంకా పరాయి భాషగా భావించడం దురదృష్టకరం. హిందీ ఒక భాష మాత్రమే కాదు, మన దేశ సమైక్యతా చిహ్నం కూడా! దేశంలో హిందీ మాట్లాడేవారు, అర్థం చేసుకునే వారు అధికంగా ఉండడం చేత కేంద్ర ప్రభుత్వము హిందీని అధికార భాషగా ప్రకటించింది. ప్రస్తుతం పదికి పైగా రాష్ట్రాలలో ప్రథమ భాషగా, మిగతా రాష్ట్రాల్లో ద్వితీయ భాషగా హిందీ ప్రచలనములో ఉన్నప్పటికీ, ఆంగ్ల భాషపై మోజుతో హిందీని నిర్లక్ష్యం చేస్తున్నారు. గాంధీజీ స్వయంగా దక్షిణ భారతదేశంలో ఈ భాష ప్రచార కార్యక్రమా నికి ‘దక్షిణ భారత హిందీ ప్రచార సభ’ స్థాపనతో శ్రీకారం చుట్టారు. ఆ మహాత్ముని ఆశయాలను అనుసరిస్తున్న మనం ఆయన విస్తరింపచేసిన భాషను తగిన విధంగా ఆదరించలేక పోవడం విచారకరం. వివిధ దేశాల్లో ఎన్నో విశ్వవిద్యాలయాల్లో హిందీని పాఠ్యాంశంగా బోధించడం గమనార్హం. కానీ, మన దేశంలో మాత్రం అంతగా హిందీకి ప్రాముఖ్యం ఇవ్వడం లేదు. ‘త్రిభాషా సూత్రా’న్ని అనుసరించి మాతృ భాష ప్రథమ భాషగా ద్వితీయ భాషగా హిందీని, తృతీయ భాషగా ఆంగ్లం. పాఠశాల విద్యార్థులకు బోధించాలని కేంద్రం నిర్దేశించింది. కానీ కొన్ని రాష్ట్రాలు ముఖ్యంగా తమిళనాడు లాంటి దక్షిణాది రాష్ట్రాలు ఈ సూత్రాన్ని వ్యతిరేకిస్తున్నాయి. పరాయి భాషలు అవసరానికి ఎన్ని నేర్చుకున్నా, మన మాతృ భాష, అధికార భాషలను నిర్లక్ష్యం చేయరాదు. – భైతి దుర్గయ్య, హిందీ ఉపాధ్యాయుడు (చదవండి: మాట తప్పిన ఆత్రేయ! ముచ్చటపడ్డా.. ఆ కోరిక నెరవేరకుండానే..) -
కేవలం హిందీతోనే వర్క్ ఔట్ అవ్వదు! రాహుల్ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆంగ్ల విద్యను సమర్థిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు పాఠశాలలో ఆంగ్ల విద్యను బోధించొద్దని గొడవ చేస్తున్నారు. కానీ వాళ్ల పిల్లలను మాత్రం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్‌లోనే చదివిస్తున్నారంటూ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. కానీ పేద రైతులు, కూలీలు తమ పిల్లలు మంచిగా ఇంగ్లీష్ నేర్చుకుని మంచి పొజిషన్లో ఉండాలని కలలు కంటారని రాహుల్ అన్నారు. ఈ మేరకు ఆయన రాజస్తాన్‌లో అల్వార్‌లో భారత్ జోడోయాత్రలో భాగంగా పర్యటిస్తున్నప్పుడూ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు కేవలం హిందీ మాత్రమే నేర్చుకుంటే..ప్రపంచంలో ఇతరులతో మాట్లాడటం సాధ్యం కాదని, కేవలం ఆంగ్ల విద్యతోనే అది సాధ్యం అవుతుందని అన్నారు. కాబట్టి మాకు రైతులు, కూలీల పిల్లలు అమెరికన్లతో పోటీపడి ఇంగ్లీష్‌ని నేర్చుకుని తాము అనుకున్నది సాధించాలని కోరుకుంటున్నాని చెప్పారు. రైతులు పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో చదవకూడదని కూడదని బీజేపీ కోరుకుంటోందంటూ రాహుల్ ఆరోపణలు చేశారు. అంతేగాదు ఆయన తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ..హిందీ, తమిళం వంటి ఇతర భాషలను చదవకూడదని చెప్పడం లేదు. ప్రపంచంతో కనెక్ట్ అవ్వాలంటే ఇంగ్లీష్ తెలుసుకోవాలని అన్నారు. రాజస్తాన్‌లో తాము దాదాపు 1700 ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ప్రారంభించినట్లు తెలిపారు. అమెరికన్ పిల్లలకు సవాలు విసురుతూ... విద్యార్థులు ధీటుగా ఇంగ్లీష్ చదవాలని కోరుకుంటున్నాను అని రాహుల్ గాంధీ చెప్పారు. (చదవండి: విద్యార్థులు, సెక్యూరిటీ గార్డుల మధ్య ఘర్షణ..పలువురికి గాయాలు) -
ఏక భాష వద్దు.. ‘నాకు హిందీ తెలియదు’
ఇంగ్లీషుకు ప్రత్యామ్నాయంగా హిందీని అంగీకరించాలని, స్థానిక భాషలను కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ప్రజలపై హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్న వాదన తెరపైకి వచ్చింది. గత వారం న్యూఢిల్లీలో జరిగిన పార్లమెంటరీ అధికార భాషా కమిటీ 37వ సమావేశానికి అధ్యక్షత వహించిన అమిత్ షా మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యకలాపాలు అధికార భాషలో ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారని, ఇది కచ్చితంగా హిందీ ప్రాముఖ్యతను పెంచుతుందని పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు హిందీని విస్తరించేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ‘వివిధ రాష్ట్రాల పౌరులు కమ్యూనికేట్ చేసేటప్పుడు అది భారతదేశ భాషలో ఉండాలి. అదే సమయంలో ప్రాంతీయ భాషల నుంచి పదాలను ఇముడ్చుకునేందుకు అనువుగా హిందీని మార్చాల’ని అమిత్ షా వ్యాఖ్యానించారు. హిందీ ఎక్కువగా మాట్లాడేవారు ఉంటే.. అది దేశాన్ని ఒక్కటిగా ఉంచుతుందన్న భావన కలుగుతుందని అన్నారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో 10వ తరగతి వరకు హిందీని తప్పనిసరి చేయాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు పలు రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అసోం, బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ సహా పలు రాష్ట్రాల నాయకులు దీనిపై స్పందించారు. భాషాపరమైన ఆధిపత్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. ప్రజలను ఏకం చేసే పేరుతో హిందీని అందరిపై రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. హిందీని బలవంతంగా రుద్దడం మానుకుని.. స్థానిక భాషలను పరిరక్షించడం, ప్రోత్సహించడంపై దృష్టి పెట్టాలని కేంద్రాన్ని అసోం సాహిత్య సభ కోరింది. తమిళనాడు నుంచి డీఎంకే, అన్నాడీఎంకేతో పాటు బీజేపీ కూడా కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. ఈ చర్య దేశ సమగ్రతను దెబ్బతీస్తుందని డీఎంకే పేర్కొంది. భారతీయుడని నిరూపించుకోవడానికి హిందీ నేర్చుకోవాల్సిన అవసరం లేదని తమిళనాడు బీజేపీ నేతలు అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ కూడా మోదీ సర్కారు చర్యను తప్పుబట్టింది. తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విటర్లో తన అభిప్రాయాన్ని తెలిపారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ బలంగా గళం వినిపించారు. హిందీని తప్పనిసరి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో #StopHindiImposition హాష్‌ట్యాగ్‌తో ప్రచారం చేశారు. ‘నాకు హిందీ తెలియదు’ అనేది కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్, సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ వంటి సెలబ్రిటీలు కూడా ట్విటర్ వేదికగా తమ నిరసన వ్యక్తం చేశారు. (క్లిక్: నన్ను పట్టించుకోవడం లేదు.. కొత్త పెళ్లికొడుకులా ఉన్నా..) కేవలం హిందీ భాష ద్వారా మాత్రమే భారతదేశానికి గుర్తింపు వస్తుందన్న కేంద్రం వాదనలో పస లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బిహార్ మినహా ప్రతి రాష్ట్రానికి స్వంత భాష ఉందని వెల్లడించారు. అలాంటప్పుడు హిందీ భాషను అన్ని రాష్ట్రాలపై రుద్దడం సరికాదని అంటున్నారు. భాష అనేది కేవలం కమ్యూనికేషన్ సాధనం మాత్రమే కాదని.. సంస్కృతి, గుర్తింపు కూడానని వివరించారు. భాషా వైవిధ్యాన్ని కాపాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, ఏక భాష విధానం సమర్థనీయం కాదని స్పష్టం చేస్తున్నారు. (క్లిక్: ఆరెస్సెస్ అలాంటిది కాదని ఆయనకు చెప్పా) -
భాషా పెత్తనం అనర్ధదాయకం
భిన్న భాషలుండటం, భిన్న మతాలు, సంస్కృతులు వర్థిల్లడం మన దేశ విశిష్టత. ఈ వైవిధ్యతను గర్వకారణంగా భావించేవారికీ... తమ భాషతో సమానంగా ఇతర భాషల్ని గౌరవించి, ప్రేమించే వారికీ కొదవలేదు. పరాయి భాషల పట్ల ఆసక్తి, అనురక్తి ఏర్పడి వాటిని నేర్చుకోవడానికి ప్రయ త్నించేవారూ గణనీయంగా ఉంటారు. అయితే ఈ అమరికలో ఆధిపత్య భావన వచ్చి చేరినప్పుడే పొరపొచ్చాలు మొదలవుతాయి. ఇబ్బందులు తలెత్తుతాయి. ప్రముఖ శాస్త్రవేత్త, ఇస్రో మాజీ చీఫ్ డాక్టర్ కె. కస్తూరిరంగన్ ఆధ్వర్యంలోని 9మంది సభ్యుల కమిటీ రూపొందించిన జాతీయ విద్యా విధానం ముసాయిదా దేశంలో మరోసారి హిందీ వ్యతిరేక ఆందోళనను రగిల్చింది. ఆ ముసా యిదా ఒకటి నుంచి అయిదో తరగతి వరకూ మాతృభాషలో విద్యాబోధన ఉండాలని, ఆ వ్యవ ధిలో పిల్లలకు మూడు భాషల్ని పరిచయం చేయాలని సూచించింది. ఆరో తరగతి నుంచి ఆ మూడు భాషల్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకునేందుకు విద్యార్థికి అవకాశం ఉండాలని ముసాయిదా చెబుతోంది. దాని ప్రకారం హిందీ భాషా ప్రాంతాల్లోని పిల్లలు హిందీ, ఇంగ్లిష్‌తోపాటు మరో ఆధునిక భాషను నేర్చుకోవచ్చు. హిందీయేతర ప్రాంతాల్లో హిందీ, ఇంగ్లిష్‌తోపాటు స్థానిక భాష ఉంటుంది. సారాంశంలో హిందీయేతర రాష్ట్రాల విద్యార్థులు హిందీ నేర్చుకుతీరాలని నిర్దేశించింది. 484 పేజీల ఈ ముసాయిదాలో దాంతోపాటు అనేక కీలకమైన అంశాలున్నాయి. వాటన్నిటిపైనా కూలంకషమైన చర్చ కూడా జరగాల్సి ఉంది. కానీ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల ప్రజలు... మరీ ముఖ్యంగా తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లో ఈ ముసాయిదాపై వ్యతిరేకత పెల్లుబికింది. పశ్చిమ బెంగాల్లో సైతం హిందీని రుద్దేందుకు ప్రయత్నించడాన్ని నిరసిస్తూ ఉద్యమం ప్రారంభించారు. ఇదంతా గమనించాక కేంద్ర ప్రభుత్వం మేల్కొంది. కస్తూరి రంగన్ కమిటీ ఇచ్చింది ముసాయిదా నివేదికే తప్ప విధానం కాదని, ఆ కమిటీ చేసిన సిఫార్సుల్ని ప్రజాభిప్రాయం తెలుసుకోకుండా, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించకుండా అమలు చేయబోమని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్తోపాటు ఇతర మంత్రులంతా హామీ ఇచ్చారు. వాస్తవానికి ముసాయిదా రూపొందించే క్రమంలో కస్తూరి రంగన్ కమిటీ భిన్నరంగాలవారిని సంప్రదించింది. అవన్నీ పూర్తయ్యాక నిరుడు డిసెంబర్లో తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. హిందీ ఆధిపత్యం విషయంలో దక్షిణాది రాష్ట్రాల ప్రజలకున్న అనుమానాలేమిటో, అభ్యంతరా లేమిటో గ్రహించడంలో కమిటీ విఫలమైంది. కనీసం కేంద్ర ప్రభుత్వమైనా ఈ అయిదు నెలల్లో ముసాయిదాను క్షుణ్ణంగా పరిశీలించి వివాదాస్పద అంశాలను గుర్తించాల్సింది. అది జరగకపోబట్టే నిరసనలు చెలరేగాయి. చివరకు ముసాయిదాలోని ఆ వివాదాస్పద క్లాజును సవరిస్తున్నట్టు సోమ వారం కేంద్రం ప్రకటించింది. హిందీ తప్పనిసరన్న నిబంధన స్థానంలో ఆరు లేదా ఏడో తరగతి లోకి ప్రవేశించే విద్యార్థులకే భాషను ఎంపిక చేసుకునే అవకాశం ఇస్తూ కొత్త నిబంధన తెచ్చారు. హిందీ భాషాధిపత్యంపై దక్షిణాది రాష్ట్రాల్లో అనుమానాలు ఈనాటివి కాదు. 1937నాటికే తమిళ భాషా ప్రాంతాల్లో హిందీ వ్యతిరేక ఉద్యమాలు జరిగాయి. ఆ సమయంలోనే విశిష్ట తెలుగు కథా రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి హిందీ భాషా పెత్తనాన్ని ప్రశ్నించారు. స్వాతంత్రోద్య మంలో పనిచేస్తున్నవారు హిందీ విషయంలో మహాత్మా గాంధీనుంచి, కాంగ్రెస్ నుంచి తగిన హామీ పొందాలని డిమాండ్ చేశారు. స్వాతంత్య్రం వచ్చాక హిందీ భాషను దక్షిణాదిపై బలవంతంగా రుద్దుతారన్న అనుమానాలు ఆ స్థాయిలో ఉండేవి. స్వతంత్ర భారతదేశం ఆవిర్భవించాక వచ్చిన ప్రభుత్వాలు ఆ అనుమానాలను నివృత్తి చేయకపోగా వాటిని పెంచుతున్నాయి. 2008లో నాటి యూపీఏ ప్రభుత్వం హిందీ వినిమయాన్ని పెంచడానికంటూ మెట్రిక్, ఆ పై స్థాయి అభ్యర్థులకు నిర్వహించే పోటీ పరీక్షల్లో హిందీ ప్రశ్నపత్రం తప్పనిసరిగా ఉండాలన్న ప్రతిపాదన పెట్టింది. అందరూ నిరసించడంతో వెనక్కి తగ్గింది. ఇంకా వెనక్కు వెళ్తే 1960 ప్రాంతాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో, ప్రత్యేకించి తమిళనాడులో ఉద్యమాలు చెలరేగాయి. భాషను ఇష్టంగా నేర్చుకున్నప్పుడే అందులోని మెలకువలు పట్టుబడతాయి. ఏ భాష అయినా సహజ పద్ధతుల్లో వికసించాలి. చలనచిత్రాలు, చానెళ్లలో వచ్చే సీరియల్స్వంటివి ఆ పని కొంతవరకూ చేస్తున్నాయి. అయితే ప్రభుత్వాలే భాష విషయంలో చాలా వెనకబడి ఉంటున్నాయి. ఇప్పటికీ ప్రభుత్వాలు జారీ చేసే ఉత్తర్వులు మాతృ భాషల్లో ఉంటున్నా అవి ఓ పట్టాన అర్ధంకాని స్థితి ఉంది. కేంద్రం జారీచేసే ఉత్తర్వుల్లో వాడే హిందీ జటిలంగా, కృత్రిమంగా ఉంటున్నదని హిందీ మాతృభాషగా ఉన్నవారు సైతం చెబుతుంటారు. భాషపట్ల అంత ప్రేముంటే జనం భాషకూ, అధికార లావాదేవీల్లో వాడే భాషకూ మధ్య ఉండే ఈ వైరుధ్యాన్ని ముందు సరిచేసుకోవాలి. ఏదేమైనా హిందీ భాష తప్పనిసరి చేయాలన్న ముసాయిదా లోని పాత నిబంధనను సవరించడం హర్షణీయం. ఇప్పుడున్న 10+2+3 విద్యా వ్యవస్థ స్థానంలో 5+3+3+4 వ్యవస్థను తీసుకురావాలని కమిటీ సూచించింది. మొదటి అయిదేళ్లనూ ‘పునాది దశ’గా పరిగణిస్తారు. ఇందులో మూడేళ్ల ప్రీ–ప్రైమరీ విద్య, ఒకటి, రెండు తరగతులు ఉంటాయి. ఆ తర్వాత ‘సన్నాహక దశ’(3,4,5 తరగతులు), అనం తరం ‘మధ్యస్త దశ’(6,7,8 తరగతులు), చివరిగా ‘సెకండరీ దశ’(9,10,11,12 తరగతులు) ఉంటాయి. అనంతరం నాలుగేళ్ల గ్రాడ్యుయేట్ ఆనర్స్ కోర్సులుంటాయి. రెండేళ్ల తర్వాత డిప్లొమో, మూడేళ్ల తర్వాత గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి విద్యార్థి నిష్క్రమించవచ్చు. కొత్త విధానంలో ఇంటర్మీడి యెట్ విద్య కనుమరుగవుతుంది. అలాగే అంగన్వాడీ కేంద్రాలు కూడా కొత్త విద్యావ్యవస్థ పరిధి లోకొస్తాయి. విద్యాసంస్థల్లో ఇప్పుడున్న మధ్యాహ్నభోజనంతోపాటు పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం ఉండాలన్న ప్రతిపాదన ఉంది. వీటన్నిటిపైనా కూలంకషంగా చర్చ జరిగి, సమకాలీన అవసరాలకు అనుగుణమైన, పటిష్టమైన విద్యా వ్యవస్థ అమల్లోకి రావాలని ఆశించాలి. -
ప్రముఖ టీవీ నటుడు అరెస్ట్
ముంబై : ప్రముఖ హిందీ టీవీ నటుడు సిద్దార్ద్ శుక్లా తన ర్యాష్ డ్రైవింగ్‌తో కారు ప్రమాదానికి కారణమయ్యారు. ఈ ప్రమాదంలో ఆయన కారుతో పాటు మరో మూడు కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఓ వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శనివారం సాయంత్రం కారును నడుపుతున్న సిద్దార్ద్ శుక్లా ఒక్కసారిగా పట్టుతప్పి ముందు వస్తున్న కార్లను ఢీకొన్నారు. ఆ తర్వాత ఓ కరెంట్ స్థంబాన్ని ఢీకొన్న అతని కారు ఆగిపోయింది. ఈ ప్రమాదంలో రాజ్‌కుమార్ దూదె అనే కారు యాజమాని స్వల్పగాయాలతో బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నటుడిని అదుపులోకి తీసుకున్నారు. కారు నడుపుతున్న సమయంలో సిద్దార్ద్ శుక్లా తాగి ఉన్నాడా? లేదా? అని తెలుసుకోవటానికి అతని రక్తాన్ని వైద్యపరీక్షల నిమిత్తం పంపినట్లు పోలీసులు తెలిపారు. సిద్దార్ద్ కారు కరెంట్ స్థంబాన్ని ఢీకొన్నా కారులోని ఏయిర్ బ్యాగ్స్ తెరుచుకోలేదని, అయినా అదృష్టం కొద్ది అతడికి ఏ గాయాలుకాలేదని వెల్లడించారు. 279,336,337 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. సిద్దార్ద్ శుక్లా పాపులర్ హిందీ సీరియల్ ‘‘ బాలికా వధు’’ (తెలుగులో ‘‘చిన్నారి పెళ్లికూతురు’’)లో లీడ్ రోల్ చేశారు. -
ప్రముఖ బుల్లితెర నటుడు కన్నుమూత
ముంబై : ప్రముఖ హిందీ బుల్లితెర హాస్య నటుడు కవి కుమార్ ఆజాద్ కన్నుమూశారు. సోమవారం కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఆయన మరణించారు. హిందీ సీరియల్ ‘ తారక్ మెహ్తా కా ఉల్టా చెస్మా’లో డా. హన్షరాజ్ హాథీ పాత్రతో ప్రేక్షకులకు ఎంతో చేరువయ్యారాయన. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ముంబై మీరా రోడ్‌లోని వక్రదంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా నిన్న రాత్రి కోమాలోకి వెళ్లిన ఆయన సోమవారం మధ్యాహ్నం కార్డియాక్ అరెస్ట్ కారణంగా మృతి చెందాడని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయన నటించిన ‘ తారక్ మెహ్తా కా ఉల్టా చెస్మా’ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. అత్యధిక ఎపిసోడ్స్ ప్రసారమైన సీరియల్‌గా ఈ రికార్డును నెలకొల్పింది. కేవలం బుల్లితెర మీదే కాకుండా ఆమిర్ ఖాన్ కథానాయకునిగా నటించిన మేలా, ఫన్తూస్ వంటి సినిమాలలో కవి కుమార్ నటించారు. -
దేశ భాషలందు చిక్కిపోతున్న తెలుగు...!
దేశంలోని అత్యధికులు సంభాషించే మాతృభాషల్లో తెలుగు మూడోస్థానం నుంచి నాలుగో స్థానానికి దిగజారింది. తెలుగు స్థానాన్ని మరాఠి భర్తీచేసి మూడోస్థానానికి చేరుకుంది. 2011 జనాభా గణనలో భాగంగా దేశంలోని మాతృభాషలకు సంబంధించి తాజాగా వెల్లడైన వివరాలను బట్టి ఈ అంశం వెల్లడైంది. మొత్తం జనాభాలో 96.71 శాతం మంది దేశంలో గుర్తించిన 22 భాషల్లో ఏదో ఒక భాషను తమ మాతృభాషగా నమోదు చేసుకున్నారు. మిగతా 3.29 శాతం మంది ఇతర భాషలను తమ భాషగా ఎంపికచేసుకున్నారు. 2001 జనాభా లెక్కల ప్రకారం 7.19 శాతం మంది (మొత్తం దేశజనాభాలో) తెలుగును తమ మాతృభాషగా ఎంచుకున్నారు. అదే 2011 లెక్కలకు వచ్చేప్పటికీ అది 6.93 శాతానికి తగ్గిపోయింది. అదేసమయంలో మరాఠి మాతృభాషగా ఎంపిక చేసుకున్న వారు 6.99 శాతం నుంచి 7.09 శాతానికి వృద్ధి చెందారు. ఈ విధంగా తెలుగును మరాఠి భాష అధిగమించింది. తెలుగు మాట్లాడేవారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకే పరిమితం కాకుండా తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా తదితర రాష్ట్రాల్లోనూ ఉన్నారు. హిందీ టాప్...సంస్కృతం లాస్ట్ దేశ జనాభాలో హిందీని మాతృభాషగా ఎంచుకుంటున్న వారు మాత్రం గణనీయంగా పెరిగారు. 2001 లెక్కల ప్రకారం 41.03 శాతమున్న వీరి సంఖ్య 2011 నాటికి 43.63 శాతానికి పెరిగింది. హిందీ తర్వాత అత్యధికులు మాట్లాడే భాషగా బాంగ్లా (బెంగాలీ) కొనసాగుతోంది. గతంలో 8.11 శాతమున్న బాంగ్లా మాట్లాడే వారి సంఖ్య తాజా లెక్కల్లో 8.3 శాతానికి పెరిగింది. దేశంలో గుర్తించిన (రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చిన) 22 భాషల్లో సంస్కృతం మాత్రం ఈ విషయంలో చిట్టచివరి స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బోడో, మణిపురి, కోంకణి, డోగ్రీ భాషలు మాట్లాడే వారి కంటే కూడా ఈ భాషను తక్కువమంది మాట్లాడుతున్నారు. కేవలం 24,821 మంది మాత్రమే సంస్కృతాన్ని తమ మాతృభాషగా పేర్కొన్నారు. రెండున్నరలక్షల మందికి ఇంగ్లిష్... మన దేశంలో మాతృభాషగా గుర్తించని ఇంగ్లిష్‌ను (షెడ్యూల్డ్ లాంగ్వేజేస్‌లో చేర్చని) మాత్రం 2.6 లక్షల మంది తాము మొదట మాట్లాడే భాష(ఫస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్)గా పేర్కొనడం విశేషం. ఇంగ్లిష్ మాతృభాషగా ఉన్నవారు లక్ష మందికి పైగా మహారాష్ట్రలో నివసిస్తున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కర్ణాటక నిలుస్తున్నాయి. మనదేశంలో గుర్తింపు పొందని భాషల్లో రాజస్థాన్‌లోని కోటి మందికి పైగా భిలి / భిలోడి భాష మాట్లాడుతున్నారు. గోండీ భాషను 29 లక్షల మంది సంభాషిస్తున్నట్టు 2011 జనాభా గణన సమాచారాన్ని బట్టి వెల్లడైంది. గతంలోని జనాభా లెక్కల ప్రకారం ఆరోస్థానంలో ఉన్న ఉర్థూ కాస్తా ప్రస్తుతం ఏడోస్థానానికి పడిపోయింది. మొత్తం 4.74 శాతం మాట్లాడేవారితో గుజరాతీ భాష ఆరోస్థానానికి చేరుకుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే... భాష మాతృభాష మాట్లాడేవారు మొత్తం జనాభాలో శాతం హిందీ 52,83,47,193 43.63 బాంగ్లా 09,72,37,669 08.30 మరాఠి 08,30,26,680 07.09 తెలుగు 08,11,27,740 06.93 తమిళం 06,90,26,881 05.89 -
ఇక హిందీలోనూ ‘గూగుల్ అసిస్టెంట్’
శాన్ఫ్రాన్సిస్కో: 2018 చివరికల్లా హిందీ సహా 30కిపైగా భాషల్లో గూగుల్ అసిస్టెంట్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని ఆ సంస్థ తెలిపింది. ప్రస్తుతం గూగుల్ అసిస్టెంట్ కేవలం ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, జపనీస్, కొరియన్, స్పానిష్, పోర్చుగీస్ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే ఆండ్రాయిడ్, ఐఫోన్ల కోసం హిందీ సహా డానిష్, డచ్, ఇండోనేషియన్, నార్వేజియన్, స్వీడిష్, థాయ్ భాషల్లో గూగుల్ అసిస్టెంట్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. ఒకే వ్యక్తి వేర్వేరు భాషల్లో ఇచ్చే ఆదేశాలను పాటించేలా ఈ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేస్తారు. ఏ స్మార్ట్‌ఫోన్‌లో అయినా హోమ్‌పేజ్ బటన్‌ను కొద్దిసేపు నొక్కిపట్టుకోవడం లేదా ‘ఓకే గూగుల్’ అని చెప్పడం ద్వారా ‘గూగుల్ అసిస్టెంట్’ను యాక్టివేట్ చేయవచ్చు. -
పార్టీకి తయార్
కాలేజీ స్టూడెంట్‌గానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు సిద్ధార్థ్ మల్హోత్రా. అదేనండీ.. కరణ్ జోహార్ దర్శకత్వంలో వచ్చిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమా ద్వారా సిద్ధార్థ్ సిల్వర్ స్క్రీన్‌కి పరిచయం అయ్యారని చెబుతున్నాం. ఆల్మోస్ట్ ఐదేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ స్టూడెంట్‌గా క్లాస్‌రూమ్‌కి వెళ్లేందుకు సిద్ధార్థ్ చర్చలు జరుపుతున్నాడని బీటౌన్ టాక్. అంతేకాదు సిద్ధార్థ్‌తో పాటు సినిమాలో ఉండబోయే గ్యాంగ్ మెంబర్స్ అడ్మిషన్స్ కోసం ఆల్రెడీ ఆడిషన్స్‌ను కూడా స్టార్ట్ చేశారట. మరి.. కాలేజీలో గ్యాంగ్‌ని మెయిన్టైన్ చేస్తారు కదా. కన్నడ సూపర్ హిట్ ‘కిర్రిక్ పార్టీ’కి రీమేక్‌గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఈ సినిమాలో సిద్ధార్థ్‌తో పాటు నటించబోయే స్టూడెంట్స్ కోసం అడ్మిషన్స్.. అదేనండీ.. సెలెక్షన్స్ ఓపెన్ అన్నమాట. ‘కిర్రిక్ పారీ’్ట హిందీ రీమేక్ రైట్స్ దక్కించుకున్న అజయ్‌కపూర్ ఆల్రెడీ సిద్ధార్థ్‌తో మాట్లాడారని, స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయ్యిందని సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే... ఈ ‘కిర్రిక్ పార్టీ’ తెలుగులో నిఖిల్ హీరోగా ‘కిరాక్ పార్టీ’గా రీమేక్ అయింది. ఇందులో సిమ్రన్, సంయుక్తా హెగ్డే కీలక పాత్రలు చేశారు. -
2017 సంవత్సరపు హిందీ పదంగా ‘ఆధార్’
జైపూర్: ఆధార్ కార్డుతో దేశవాసుల మనసుల్లో బాగా నాటుకుపోయిన ‘ఆధార్’కు 2017 సంవత్సరపు హిందీ పదంగా గుర్తింపు లభించింది. జైపూర్ సాహితీ వేడుకలో భాగంగా శనివారం ‘ఆక్స్ఫర్డ్ డిక్షనరీస్’ అంశంపై జరిగిన చర్చలో దీనిపై ఏకాభిప్రాయానికి వచ్చారు. ఆధార్ తర్వాత మిత్రోన్(అసలు రూపం మిత్రో), నోట్‌బందీ, గోరక్షక్ అనేవి హిందీ పదాలు కూడా బాగా ప్రాచుర్యం పొందినట్లు వివిధ రంగాల నిపుణులు పేర్కొన్నారు. అయితే, జనం నోళ్లలో అత్యధికంగా నానిన పదం మాత్రం ఆధారేనని ఈ చర్చ సందర్భంగా పాత్రికేయుడు ద్వివేది వెల్లడించారు. -
హిందీలోనూ ఎన్టీఆర్ బయోపిక్
తెలుగువారి అభిమాన నటులు ఎన్టీఆర్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యారు. ఇందుకు కారణం ఆయన జీవిత చరిత్రతో రెండు సినిమాలు తెరకెక్కనుండటమే. తేజ దర్శకత్వంలో తండ్రి పాత్రలో బాలకృష్ణ నటించి, ఓ సినిమా నిర్మించనున్న విషయం తెలిసిందే. కాగా, ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో రామ్‌గోపాల్ వర్మ కూడా ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కించనున్నట్లు స్పష్టం చేయడంతో పాటు ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేయడం సంచలనం సృష్టించింది. ఒకే వ్యక్తి జీవితకథతో తెలుగులోనే రెండు సినిమాలు తెరకెక్కనుండటంతో ఎన్టీఆర్‌ని ఎవరు ఎలా చూపించనున్నారనే ఆసక్తి అప్పుడే మొదలైంది. కాగా, బాలకృష్ణ–తేజ కాంబినేషన్లో రూపొందనున్న బయోపిక్ ఒక్క తెలుగుకే పరిమితం కావడం లేదు. హిందీలోనూ రూపొందనుంది. మరి.. తెలుగు–హిందీ చిత్రాలను ఏకకాలంలో తెరకెక్కించనున్నారట. ప్రస్తుతం కేయస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. దీనికి ‘కర్ణ’ అనే టైటిల్‌ని అనుకుంటున్నారని టాక్. ఈ చిత్రం షూటింగ్ మరో మూడు నెలల్లో పూర్తి చేయాలనుకుంటున్నారు. జనవరిలో ఎన్టీఆర్ బయోపిక్‌ని ప్రారంభించాలని బాలకృష్ణ–తేజ అనుకుంటున్నారట. -
‘హిందీ’పై వెనక్కు తగ్గిన కేంద్రం
* హిందీ మాట్లాడే రాష్ట్రాలకే పరిమితమని స్పష్టీకరణ * బలవంతంగా రుద్దేది లేదన్న వెంకయ్యనాయుడు న్యూఢిల్లీ/చెన్నై/బెంగళూరు: సామాజిక మాధ్యమాల్లో, అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాల్లో హిందీ వినియోగాన్ని ప్రోత్సహించాలన్న నిర్ణయంపై విమర్శలు చెలరేగడంతో కేంద్రప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ జారీ చేసిన రెండు సర్క్యులర్లు కేవలం ఆ భాష మాట్లాడే రాష్ట్రాలకు మాత్రమే పరిమితమని శుక్రవారం వివరణ ఇచ్చింది. హిందీ భాషేతరులపై హిందీని బలవంతంగా రుద్దేది లేదని స్పష్టం చేసింది. మరోవైపు ఈ సర్క్యులర్లపై డీఎంకే అధినేత ఎం.కరుణానిధి ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేయగా.. తాజాగా తమిళనాడు సీఎం జయలలితతోపాటు బీజేపీ మిత్రపక్షాలు సైతం మండిపడ్డాయి. జయలలిత దీనిపై ప్రధాని నరేంద్ర మోడీకి శుక్రవారం లేఖ రాశారు. హోం శాఖ ప్రతిపాదన అధికార భాషాచట్టాలు, 1963 స్ఫూర్తికి విరుద్ధంగా ఉందన్నారు. మాతృభాషకు అత్యంత ప్రాధాన్యమిచ్చే తమిళనాడు ప్రజలకు ఇది తీవ్ర కలవరాన్ని కలిగిస్తోందన్నారు. సామాజిక మాధ్యమాల్లో అధికారులు హిందీకి బదులుగా ఆంగ్లాన్ని వాడేలా సూచించాలని ప్రధానికి ఆమె విజ్ఞప్తి చేశారు. తమిళనాడులో బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్న పీఎంకే, ఎండీఎంకేలు సైతం కేంద్రం చర్యను తప్పుపట్టాయి. కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు బెంగళూరులో మాట్లాడుతూ.. ఏ ఒక్కరిపైనా హిందీని బలవంతంగా రుద్దే ప్రసక్తి లేదన్నారు.