2017 సంవత్సరపు హిందీ పదంగా ‘ఆధార్‌’ | Aadhaar is the Hindi word of the year for 2017 | Sakshi
Sakshi News home page

2017 సంవత్సరపు హిందీ పదంగా ‘ఆధార్‌’

Published Sun, Jan 28 2018 4:44 AM | Last Updated on Wed, Apr 3 2019 9:21 PM

Aadhaar is the Hindi word of the year for 2017 - Sakshi

ఆధార్‌

జైపూర్‌: ఆధార్‌ కార్డుతో దేశవాసుల మనసుల్లో బాగా నాటుకుపోయిన ‘ఆధార్‌’కు 2017 సంవత్సరపు హిందీ పదంగా గుర్తింపు లభించింది. జైపూర్‌ సాహితీ వేడుకలో భాగంగా శనివారం ‘ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీస్‌’ అంశంపై జరిగిన చర్చలో దీనిపై ఏకాభిప్రాయానికి వచ్చారు. ఆధార్‌ తర్వాత మిత్రోన్‌(అసలు రూపం మిత్రో), నోట్‌బందీ, గోరక్షక్‌ అనేవి హిందీ పదాలు కూడా బాగా ప్రాచుర్యం పొందినట్లు వివిధ రంగాల నిపుణులు పేర్కొన్నారు. అయితే, జనం నోళ్లలో అత్యధికంగా నానిన పదం మాత్రం ఆధారేనని ఈ చర్చ సందర్భంగా పాత్రికేయుడు ద్వివేది వెల్లడించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement