
శాన్‌ఫ్రాన్సిస్కో: 2018 చివరికల్లా హిందీ సహా 30కిపైగా భాషల్లో గూగుల్ అసిస్టెంట్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని ఆ సంస్థ తెలిపింది. ప్రస్తుతం గూగుల్ అసిస్టెంట్ కేవలం ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, జపనీస్, కొరియన్, స్పానిష్, పోర్చుగీస్ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది.
త్వరలోనే ఆండ్రాయిడ్, ఐఫోన్ల కోసం హిందీ సహా డానిష్, డచ్, ఇండోనేషియన్, నార్వేజియన్, స్వీడిష్, థాయ్ భాషల్లో గూగుల్ అసిస్టెంట్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. ఒకే వ్యక్తి వేర్వేరు భాషల్లో ఇచ్చే ఆదేశాలను పాటించేలా ఈ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేస్తారు. ఏ స్మార్ట్‌ఫోన్‌లో అయినా హోమ్‌పేజ్ బటన్‌ను కొద్దిసేపు నొక్కిపట్టుకోవడం లేదా ‘ఓకే గూగుల్’ అని చెప్పడం ద్వారా ‘గూగుల్ అసిస్టెంట్’ను యాక్టివేట్ చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment