I phone
-
ఐఫోన్ ఇక్కడ కొంటే భారీ డిస్కౌంట్..
-
ఐఫోన్ పోగొట్టుకున్న రోహిత్ శర్మ.. ఎలా అంటే?
రాజ్‌కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐ ఫోన్ చోరీకి గురైంది. ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేలకు దూరంగా ఉన్న రోహిత్.. మూడో వన్డేకు జట్టుతో కలిశాడు. ఈ క్రమంలో రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో సహాచర ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గోన్నాడు. ఈ సందర్భంగా రోహిత్ తన ఫోన్‌ను పోగొట్టుకున్నాడు. ప్రాక్టీస్ సెషన్ పూర్తి చేసుకున్న తర్వాత చూసుకోగా తన ఫోన్ పోయిందని హిట్‌మ్యాన్ గుర్తించినట్లు సమాచారం. దీంతో తన ఫోన్ పోయిందని స్థానిక అధికారులతోపాటు పోలీసులకు రోహిత్ ఫిర్యాదు చేశాడు. గ్రౌండ్లో ఎంత వెతికినా రోహిత్ ఫోన్ మాత్రం దొరకలేదు. అయితే ఆ ఫోన్‌ను ఎవరో దొంగిలించి ఉంటారని పోలీస్‌లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా రోహిత్‌కు ఇదేమి కొత్త కాదు. గతంలో కూడా చాలా సార్లు వస్తువులు పోగుట్టుకున్న సందర్బాలు ఉన్నాయి. రోహిత్‌కు మతిమరుపు ఎక్కువ అని సహచర ఆటగాడు కోహ్లి సైతం చాలా సందర్బాల్లో చెప్పుకొచ్చాడు. ఇక ఇది ఇలా ఉండగా.. ఆసీస్‌తో మూడో వన్డేలో హిట్‌మ్యాన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 57 బంతుల్లో 81 పరుగులు చేసి సత్తాచాటాడు. చదవండి: ODI WC 2023: ప్లేయర్స్ ఫీవర్‌తో బాధపడ్డారు.. వరల్డ్ కప్ ప్రిపరేషన్స్‌పై ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు -
యాపిల్ ఐఫోన్ 14 ప్రోపై భారీ డిస్కౌంట్: దాదాపు సగం ధరకే!
యాపిల్ ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.మరికొన్ని రోజుల్లో యాపిల్ మెగా ఈవెంట్‌కు రడీ అవుతున్న తరుణంలో భారీ డిమాండ్ ఉన్న పాపులర్ యాపిల్ ఐఫోన్ 14 ప్రో మోడల్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఐఫోన్ 15 రాకతో ఐఫోన్ 14 ప్రో దశలవారీగా నిలిచిపోనుంది. ఈ నేపథ్యంలో iPhone 14 Pro ఏకంగా రూ. 66,999 తగ్గింపుతో లభిస్తోంది. త్వరలోనే యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు, యాపిల్ వాచెస్ లాంచ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐఫోన్ 13 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 14 ప్రో లభిస్తోంది. గత ఏడాది లాంచ్ అయిన ఐఫోన్ 14 ప్రో లాంచింగ్ ప్రైజ్ రూ. 1,29,900.ఇపుడు ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 14 ప్రో ధరను రూ.66,999 తగ్గించింది. ఇందులో HDFC బ్యాంక్ క్రెడిట్ ,డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై అదనంగా రూ. 3000 తగ్గింపును పొందవచ్చు.అలాగే స్మార్ట్‌ఫోన్ ఎక్సేంజ్ ఆఫర్ దాదాపు రూ. 50,000 ఉంటుంది. ఫలితంగా iPhone 14 Pro ధర కేవలం రూ. 69,999కి దిగి వచ్చింది. (కేంద్రం మరో కీలక నిర్ణయం: విండ్‌ఫాల్ ట్యాక్స్ కట్) ఐఫోన్ 14 ప్రో ఫీచర్లు: 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లే, అత్యాధునిక A16 బయోనిక్ చిప్, 48ఎంపీ ట్రిపుల్ కెమెరా 12 ఎంపీ సెల్పీ కెమెరా ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. (డయానాతో ప్రమాదంలో మరణించిన డోడి తండ్రి, బిజినెస్ టైకూన్ కన్నుమూత) -
యాపిల్ ఐఫోన్ 14 పై భారీ డిస్కౌంట్
యాపిల్ ఐఫోన్ 14 లవర్స్‌కు గుడ్‌న్యూస్. ఈ లగ్జరీస్మార్ట్ఫోన్ ఇపుడు భారీ తగ్గింపులో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 42,600 భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. అంటే దీని ధర రూ. 30,000 కంటే తక్కువన్నమాట. డిస్కౌంట్లు, బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫరలు కలిపి ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 14పై ఈ భారీ తగ్గింపుతో లభిస్తుంది. ఇదీ చదవండి : ట్యూటర్లకు షాక్: ఏఐ చాట్‌బాట్‌పై బిల్‌గేట్స్ కీలక వ్యాఖ్యలు ఐఫోన్ 14 తగ్గింపు ఆఫర్ ఐఫోన్ 14 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ధర రూ. 69,999 వద్ద లిస్ట్ చేసింది. దీని లాంచింగ్ ప్రైస్. రూ.79,900. ప్రస్తుతం రూ. 9901 తగ్గింపు అందుబాటులో ఉంది. దీంతో పాటు, బ్యాంక్ మరియు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లతో మరింత దిగి వచ్చింది. ముఖ్యంగా తమ స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌గా (ఫోన్ పరిస్థితి మోడల్‌పై ఆధారపడి) రూ. 38,600 వరకు ఆఫర్ చేసే ఎక్స్ఛేంజ్ డీల్ లభ్యం. (యోగా గురు రామ్‌దేవ్ లగ్జరీ కార్ల కలెక్షన్: దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు) అలాగే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ. 4,000 వరకు బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌తో లావాదేవీలపై 5శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. ఇవన్నీ వర్తించిన తరువాత యాపిల్ ఐఫోన్ 14 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ కేవలం రూ. 27,399కే కొనుగోలు చేయవచ్చు. -
ఐ ఫోన్ గెలుచుకున్నావు..! అంతలోనే..!!
మహబూబాబాద్: ఐ ఫోన్ గెలుచుకున్నావంటూ మొబైల్‌కు మెసేజ్..కాల్ రాగా దీనిపై ఓ యువకుడు స్పందించి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కి రూ.29వేలు పోగొట్టుకున్న ఘటన శుక్రవారం సాయంత్రం ఖిలావరంగల్‌లో వెలుగుచూసింది. బాధితుడి కథనం ప్రకారం మధ్యకోటకు చెందిన హైమద్ అలీ మొబైల్‌కు శుక్రవారం సైబర్‌నేరగాడు 7837905596 నంబర్‌ను నుంచి మేసేజ్.. ఆ తర్వాత కాల్ వచ్చింది. తనయుడి చేతిలో ఉన్న తండ్రి మొబైల్‌కు వచ్చిన మేసేజ్‌పై వెంటనే యువకుడు స్పందించాడు. మీకు ఐ పాడ్ మొబైల్ గెలుచుకున్నావంటూ మీ మొబైల్‌కు వచ్చిన ఓటీపీ చెప్పాలని సైబర్ నేరగాడు కాల్ చేసి అడిగాడు. ఆ యువకుడు ఆనందంతో ఓటీపీ చెప్పాడు. క్షణాల్లోనే తండ్రి బ్యాంకు ఖాతా నుంచి రూ.29 వేల నగదు మాయమైనట్లు మెసేజ్ వచ్చింది. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కానని బ్యాంకు ఖాతాను బ్లాక్ చేసుకున్నాడు. శుక్రవారం సాయంత్రం మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు హైమద్ అలీ తెలిపారు. -
ఐఫోన్ ధర మరి ఇంత తక్కువా!! ఇంకెందుకు ఆలస్యం..ఇప్పుడే సొంతం చేసుకోండి!!
ప్రముఖ దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ యాపిల్ ఐఫోన్లపై బంపరాఫర్లు ప్రకటించింది. ఐఫోన్11, ఐఫోన్ ఎస్ఈపై భారీ డిస్కౌంట్లతో పాటు, ఎక్ఛేంజ్ ఆఫర్లను అందిస్తున్నట్లు తెలిపింది. పలు రిపోర్ట్‌ల ప్రకారం..టెక్ జెయింట్ యాపిల్ మార్చి 8న ఈవెంట్‌ను నిర్వహించనుంది. ఈ ఈవెంట్లో యాపిల్ కొత్త ప్రొడక్ట్‌లను మార్కెట్‌కు పరిచయం చేయనుంది. అంతకంటే ముందే మార్కెట్లో విడుదల చేసిన పలు ఐఫోన్లపై యాపిల్ భారీ డిస్కౌంట్,ఎక్ఛేంజ్ ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. ఆ ఆఫర్లను ఫ్లిప్‌కార్ట్‌లో అందిస్తున్నట్లు వెల్లడించింది. ఫ్లిప్ కార్ట్ మార్చి 4 నుంచి మార్చి 6 వరకు బిగ్ బచత్ ధమాల్ పేరుతో సేల్ నిర్వహిస్తుంది. ఈ సేల్‌తో పాటు ప్రత్యేకంగా ఐఫోన్ 11, ఐఫోన్ ఎస్ఈ పై ఆఫర్లకే అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్11 అసలు ధర రూ.32,000 ఉండగా..ఎక్ఛేంజ్ ఆఫర్ కింద రూ.17,800కే పొందవచ్చు. ఎక్ఛేంజ్ ఆఫర్‌తో పాటు యాక్సిస్ కార్డ్ వినియోగదారులు ఫోన్ కొనుగోలు చేస్తే 5శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అదే సమయంలో మరో ఈకామర్స్ సంస్థ అమెజాన్ సైతం రూ.14,900వరకు ఎక్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తుంది. మరో యాపిల్ ఐఫోన్ ఎస్ఈని రూ.15,499కే కొనుగోలు చేయోచ్చు. వాస్తవంగా ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ ఎస్ఈ ధర రూ.39,900 ఉండగా..రూ.30,299కే యూజర్లకు అందిస్తున్నట్లు తెలిపింది. ఎక్ఛేంజ్ ఆఫర్‌ను రూ.14,800కే అందిస్తే ఆఫోన్ ధర రూ.15,499కే సొంతం చేసుకోవచ్చు. మీ ఫోన్ పై ఎక్ఛేంజ్ ఆఫర్ ఎంతుందో ఇలా తెలుసుకోండి ఫ్లిప్ కార్ట్, అమెజాన్‌లో ఐఫోన్లపై ఎక్చేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఈ ఆఫర్లో మీరు ఐఫోన్ కొనుగోలు చేయాలంటే సింపుల్ గా రెండు ఈ కామర్స్ సైట్లలో మీ ఫోన్బ్రాండ్ నేమ్, మోడల్, ఐఎంఈ నెంబర్ ఎంటర్‌చేస్తే మీ ఫోన్ పై యాపిల్ సంస్థ ఎక్ఛేంజ్ ఆఫర్లో ఎంత ధర పలుకుతుందో తెలుసుకోవచ్చు. ఐఎంఈ నెంబర్ కావాలంటే ఫోన్లో *#06# డయల్ చేసి పొందవచ్చు. చదవండి: రష్యా - ఉక్రెయిన్ సంక్షోభం, యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఏమంటారో!! -
అయ్యో పాపం! రూ. 1 లక్ష విలువైన ఐ ఫోన్ ఆర్డర్ చేస్తే డెలివరీ ఫ్యాక్‌లో..
ఆన్లైన్ షాపింగ్ చేసి ఖరీదైన వస్తువులను ఆర్డర్ చేస్తే, వాటి స్థానంలో సబ్బులు, ఇటుక రాళ్లు తెచ్చి చేతుల్లో పెట్టడం ఈ మధ్య చూస్తూనే ఉన్నాం. ఈ రోజుల్లో ఆన్లైన్ మోసాలు పరిపాటైపోయాయి. తాజాగా యూకేకు చెందిన ఓ వ్యక్తికి ఇలాంటి చేదులనుభవమే ఎదురైంది. సదరు వ్యక్తి ఆన్లైన్లో ఐ ఫోన్‌ను ఆర్డర్ చేశాడు. ఐతే ఫోన్‌కు బదులుగా 2 వైట్ కలర్ ఓరియో క్యాడ్బరీ చాక్లెట్లు ఆర్డర్ ప్యాక్‌లో ఉండటంతో చూసి లబోదిబోమన్నాడు. ఇంగ్లాండ్‌కు చెందిన డానియెల్ కారోల్ దాదాపు రూ. 1,05, 000 లక్షల విలువైన ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్‌ను ఆర్డర్ చేశాడు. ఆర్డర్ రావల్సిన తేదీకి రెండు వారాలు ఆలస్యంగా డెలివరీ అందింది. దానిని ఓపెన్ చేసిన డానియెల్ లోపల ఐ ఫోన్ లేకపోవడంతో ఒక్క సారిగా ఆశ్చర్యపోయాడు. దాని స్థానంలో వైట్ టాయిలెట్ పేపర్ రోల్‌తో చుట్టిన 120 గ్రాముల వైట్ ఓరియో చాక్లెట్లు ఉన్నాయి. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్లో డానియెల్ ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని పంచుకున్నాడు. పార్సిల్ తాలూకు ఫొటోలు కూడా షేర్ చేశాడు. డిసెంబర్ 2న యాపిల్ అధికారిక వెబ్సైట్లో ఆర్డర్ చేశానని, డిసెంబర్ 17న డెలివరీ అందాల్సి ఉండగా అలా జరగలేదని ట్విటర్లో పేర్కొన్నాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన డీహెచ్ఎల్ డెలివరీ సర్వీస్‌ను సంప్రదించి రిప్లేస్ చేయవల్సిందిగా కోరింది. చదవండి: ‘తల్లిదండ్రుల అనుమతి లేకుండా పెళ్లిళ్లు చేసుకోవడం వల్లే’ Hi Daniel if your are having an issue with your delivery please do DM us with your shipment number and full address so we can check out what has happened. Thanks, Helen https://t.co/HfmWwImQTE — DHLParcelUK (@DHLParcelUK) December 21, 2021 -
ఐఫోన్‌తో కేక్ కట్ చేసి.. ఎమ్మెల్యే కొడుకు బర్త్‌డే వేడుకలు: వైరల్
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని ఓ జీజేపీ ఎమ్మెల్యే కొడుకు ఐఫోన్‌తో బర్త్‌డే కేక్‌లను కట్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. వివకాల్లోకి వెళితే.. కనకగిరి ఎమ్మెల్యే బసవరాజ్ దడేసుగూర్ కొడుకు పుట్టిన రోజు వేడుకలో కేక్‌ను తన ఐఫోన్‌తో కట్ చేశాడు. అతడు పుట్టినరోజును బళ్లారి జిల్లా హోసపేటలో జరుపుకోవడానికి తన స్నేహితులతో కలిసి బీఎండబ్ల్యూలో చేరుకున్నాడు. చదవండి: రైల్లో లోదుస్తులతో ఎమ్మెల్యే చక్కర్లు.. నెటిజన్ల ట్రోలింగ్ కాగా ఈ వీడియోలో మొత్తం 8 కేకులను ఐఫోన్‌తో కట్ చేసి జరుపుకున్నాడు. అయితే దీనిపై అతడి తండ్రి ఎమ్మెల్యే బసవరాజ్ స్పందిస్తూ.. ‘‘నా కొడుకు కష్టపడి డబ్బులు సంపాదించుకున్నాడు. ఆ డబ్బుతో కొన్న ఐఫోన్‌తో కేక్ కట్ చేశాడు. ఇందులో తప్పేముంది? కోవిడ్-19 వల్ల చేతులకు బదులు ఐఫోన్ ఉపయోగించాడు’’ అంటూ వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఈ వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘2018 ఎన్నికలకు ముందు ఎన్నికల ఖర్చుల కోసం ఆయన నియోజకవర్గంలో ప్రజలు డబ్బులు చందాలు వేసుకుని గెలిపించారు. ఆ విధంగా గెలిచిన ఈ ఎమ్మెల్యే ప్రస్తుతం ఖరీదైన కార్లను కొనుగోలు చేశారు. ఈ డబ్బు ఎలా వచ్చింది?’’ అంటూ ప్రశ్నించారు. A Karnataka BJP MLA’s son has stirred a controversy by cutting his birthday cake(s) using his iPhone pic.twitter.com/zht6HhD12X — Soumya Chatterjee (@Csoumya21) September 3, 2021 -
స్టీవ్ జాబ్స్ కలను నెరవేర్చిన యాపిల్ సీఈఓ
కాలిఫోర్నియా: మొబైల్ ఫోన్లను సాంకేతింగా, ఆకర్శనియంగా తీర్చిదిద్దడంలో యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ఓ ట్రెండ్ సెట్ చేశారు. కాగా స్టీవ్ జాబ్స్ 2011సంవత్సరంలో క్యాన్సర్‌తో మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టీవ్ జాబ్స్, టిమ్ కుక్‌లు ఇద్దరు సాంకేతికంగా యాపిల్‌ను నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టారు. స్టీవ్ మరణించాక కుక్ సీఈఓగా బాధ్యతలు చేపట్టే సమయానికి 400 బిలియన్ డాలర్లు మాత్రమే యాపిల్ వద్ద మూలధనంగా ఉండేది. కానీ ఇప్పుడు కుక్ సారథ్యంలో యాపిల్ సంస్థ ఆదాయం ఐదు రెట్లు పెరిగింది. ప్రస్తుతం యాపిల్ సంస్థ మార్కెట్లో ఐఫోన్లతో తన హవా కొనసాగిస్తు యూఎస్‌లో 2 ట్రిలియన్ డాలర్ల ఆదాయం సాధించిన మొదటి కంపెనీగా రికార్డు సృష్టించింది. యాపిల్ సంస్థ బ్రాండ్ కోల్పోకుండా కుక్ తీవ్రంగా శ్రమించారు. ఆయన ఎదుర్కొన్న ముఖ్య సవాళ్లు: ఎఫ్‌బీఐ విపరీత ఆంక్షలు, చైనాతో యూఎస్ ట్రేడ్ వార్, కరోనా వైరస్, ఆర్థిక మాంధ్యం ఇన్ని సమస్యలను అధిగమంచి యాపిల్‌ను ఉన్నత స్థానంలో కుక్ నిలిపాడు. పౌర హక్కులు, పునరుత్పాదక శక్తి లభ్యతపై తన అభిప్రాయాన్ని ప్రపంచానికి చెప్పి మేధావుల మన్ననలను అందుకున్నారు. వినియోగదారులను ఆకట్టుకోవడానికి ప్రత్యేక సాఫ్టవేర్, వారంటీ ప్రోగ్రామ్‌లు సంగీతం, వీడియో, ఆటలు తదితర విభాగాలను ప్రారంభించి వినియోగదారులను ఆకట్టుకోవడంలో విజయం సాధించారు. ఎంటర్టైన్మెంట్ యాప్ నెట్ఫ్లక్స్ను కొనుగోళ్లు చేసి కుక్ తన సత్తా చాటాడు. కంపెనీలకు రేటింగ్ ఇచ్చే ఫార్చ్యూన్ సంస్థ యాపిల్ 50 బిలియన్ వార్షిక ఆదాయాన్ని సంపాదిస్తున్నట్టు పేర్కొంది. మరోవైపు ఇవ్స్ సంస్థ అంచనా ప్రకారం యాపిల్ సేవల విభాగంలో 750బిలియన్ డాలర్ల మూలధనం ఉన్నట్లు తెలిపింది. స్టీవ్ జాబ్స్ కలలు కన్న యాపిల్ సంస్థను కుక్ నెరవేరుస్తున్నారని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: శాంసంగ్‌కు బై, ఆపిల్‌కు సై : వారెన్ బఫెట్ -
అతి చౌక ధరలో ఐఫోన్!
సాక్షి, న్యూఢిల్లీ: ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ కొత్త, బడ్జెట్ ధర స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఐఫోన్ ఎస్ఈ2 (ఐఫోన్ 9) పేరుతో దీన్ని ఏప్రిల్ 15వ తేదీన విడుదల చేసేందుకు యాపిల్ సిద్ధ మవుతున్నట్లు తెలిసింది. అనుకున్నట్టు లాంచింగ్ పూర్తయితే, ఏప్రిల్ 22 నుంచే వినియోగదారులకు ఇది లభ్యం కానుంది. ఈ ఫోన్ కోసం ఐఫోన్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నప్పటికీ కరోనా వైరస్ సంక్షోభంతో విడుదల వాయిదా పడింది. నిజానికి మార్చి 31వ తేదీనే మార్కెట్లో విడుదల కానుందని అంతా భావించినా, కోవిడ్ -19 ఆందోళన నేపథ్యంలో ఈ కార్యక్రమం వాయిదా పడింది. 4.7, 5.5 అంగుళాల డిస్ ప్లే సైజుల్లో అతి చవక ధరలో ఐఫోన్ ప్రేమికులకు అందుబాటులోకి రానున్న ఈ ఫోన్ పై అంచనాలు మాత్రం భారీగానే ఉన్నాయి. ఐఫోన్ ఎస్ఈ 2లో ఐఫోన్ 8 తరహాలోనే డిస్ప్లేను ఏర్పాటు చేసింది. తెలుపు, నలుపు, ఎరుపు మూడు రంగల్లో లాంచ్ కానున్న ఈ ఐఫోన్ లో 3డీ టచ్‌ను జోడించిందట. అయితే ఫేస్ ఐడీ ఫీచర్ చేర్చలేదని సమాచారం. ఇక ధర విషయానికి వస్తే రూ.30 వేల లోపు ధరకే విక్రయించాలని అనుకుంటుందట. ఇందుకు గాను ఆయా దేశాల్లో ఉన్న తమ ఆథరైజ్డ్ డీలర్లతో యాపిల్ ఇప్పటికే సంప్రదింపులు పూర్తి చేసింది. అయితే ఈ విషయంపై స్పష్టతకు మరో నాలుగురోజులు వేచి చూడక తప్పదు. యాపిల్ ఐఫోన్ ఎస్ఈ2 ఫీచర్ల అంచనాలు 4.7 అంగుళాల డిస్ ప్లే 13 బయోనిక్ ప్రాసెసర్ చిప్ 3 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ (బేసిక్) 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ 12 ఎంపీ కెమెరా 1960 ఎంఏహెచ్ బ్యాటరీ చదవండి : అదే ఏకైక డిమాండ్ కావాలి - చిదంబరం -
బీకామ్ విద్యార్థికి ఇన్‌స్టాగ్రామ్‌లో టోకరా
సాక్షి, సిటీబ్యూరో: ఖరీదైన వస్తువులు తక్కువ ధరకు విక్రయిస్తున్నామంటూ అందినకాడికి దండుకునే నేరగాళ్లు యాడ్స్ యాప్ ఓఎల్ఎక్స్ మాత్రమే కాదు.. సోషల్‌మీడియా యాప్ ఇన్స్ట్రాగామ్నూ వాడుతున్నారు. ఇందులోనూ ఆకర్షణీయమైన ప్రకటనలు గుప్పించి అందినకాడికి గుంజేస్తున్నారు. దీనికి సంబంధించి శుక్రవారం తొలికేసు నమోదైంది. రక్షాపురం ప్రాంతానికి చెందిన బీకామ్ విద్యార్థి ఇటీవల ఇన్‌స్ట్రాగామ్‌లో వ్యక్తి పోస్ట్ చేసిన యాడ్ చూశాడు. ఆధునిక ఐ ఫోన్‌ను కేవలం రూ.33 వేలకు విక్రయిస్తున్నట్లు అందులో ఉంది. దీనిపై ఆసక్తి చూపిన సదరు విద్యార్థి ఇన్‌స్ట్రాగామ్ ద్వారా అవతలి వ్యక్తితో చాట్ చేశాడు. తాను ఫోన్ కొంటానని చెప్పిన అతను ఫోన్ నెంబర్ తీసుకున్నారు. వాట్సాప్ కాల్లో మాట్లాడిన నిందితుడు తమకు ఈ ఫోన్లు హోల్‌సేల్‌గా, నేరుగా కంపెనీ నుంచి వస్తాయని అందుకే తక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు నమ్మబలికాడు. అడ్వాన్స్‌గా రూ.22 వేలు చెల్లించాలని షరతు పెట్టాడు. మిగిలిన మొత్తం ఫోన్ అందుకున్న తర్వాత చెల్లించే అవకాశం ఇచ్చాడు. విద్యార్థికి పూర్తి నమ్మకం కలగడానికి అతడి నుంచి చిరునామా సైతం తీసుకున్న నేరగాడు దానిని ఓ కాగితంపై టైప్ చేశాడు. ఓ ఐఫోన్ బాక్సును పార్శిల్ చేస్తున్నట్లు, దానిపై విద్యార్థి చిరునామాతో కూడిన కాగితాన్ని అతికించినట్లు వీడియో తీశాడు. ఆ వీడియోను వాట్సాప్ ద్వారా విద్యార్థికి షేర్ చేశాడు. ఇది చూసిన బాధితుడు పూర్తిగా నేరగాడి వల్లో పడిపోయాడు. అతడు కోరినట్లే రూ.22 వేలు సూచించిన విధంగా బదిలీ చేశాడు. ఆపై నిందితుడి నుంచి స్పందన లేకపోవడం, ఫోన్ సైతం రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ మధుసూదన్ దర్యాప్తు చేపట్టారు. -
రూ 93,900 విలువైన ఐఫోన్‌ను ఆర్డర్ చేస్తే..
బెంగళూర్ : ఐఫోన్ 11 ప్రొ ఆర్డర్ చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు నకిలీ ఫోన్ అందడంతో విస్తుపోయిన ఘటన ఐటీ సిటీ బెంగళూర్‌లో చోటుచేసుకుంది. రూ 93,900 విలువైన ఐఫోన్ 11 ప్రొను తాను ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ చేస్తే నకిలీ ఐఫోన్‌ను పంపారని సాఫ్ట్వేర్ ఇంజనీర్ రజనీకాంత్ కుష్వాహ్ వాపోయారు. తాను రూ 93,900 చెల్లించి ఐఫోన్‌ను ఆర్డర్ చేయగా, ఆన్లైన్ రిటైల్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నిర్వాకం తనను షాక్‌కు గురిచేసిందని 26 ఏళ్ల కుష్వాహ్ చెప్పుకొచ్చారు. తనకు వచ్చిన ప్యాకేజ్‌ను తెరిచిన వెంటనే ఫోన్ కెమెరా స్క్రీన్ నకిలీదని గుర్తించిన కుష్వాహ్ ఫోన్ సాఫ్ట్వేర్ కూడా ఐఓఎస్ కాదని, యాండ్రాయిడ్ యాప్స్‌ను మిక్స్ చేశారని పసిగట్టారు. ప్లిఫ్కార్ట్ను అమ్మకాల వేదికగా ఎంచుకున్న సెల్లర్లు, థర్డ్ పార్టీ కంపెనీలు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నాయని భావిస్తున్నారు. తనకు అందిన పార్సిల్‌పై ఫిర్యాదు చేయగా, ఆర్డర్‌ను రీప్లేస్ చేస్తామని ఫ్లిప్‌కార్ట్ హామీ ఇచ్చినా ఇప్పటివరకూ రీప్లేస్ కాలేదని కస్టమర్ వెల్లడించారు. గతంలోనూ ఫ్లిప్‌కార్ట్‌లో ఫోన్ ఆర్డర్ చేస్తే రాళ్లు, ఇటుకలు, పండ్లు వంటి ఇతర వస్తువులు వచ్చాయంటూ సోషల్ మీడియాలో పలువురు తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్న ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. -
‘ఐఫోన్ 11’ సేల్ 27 నుంచి..
న్యూఢిల్లీ: కాలిఫోర్నియాలో మంగళవారం అట్టహాసంగా విడుదలైన ‘ఐఫోన్ 11’ సిరీస్ స్మార్ట్‌ఫోన్ భారత ధరలను.. యాపిల్ కంపెనీ బుధవారం ప్రకటించింది. మొత్తం ఆరు రంగుల్లో లభ్యంకానున్న ‘ఐఫోన్ 11’ ధర ఇక్కడి మార్కెట్లో . రూ. 64,900 ప్రారంభం కానుంది. ‘ఐఫోన్ 11 ప్రో’ ప్రారంభ ధర రూ. 99,900 కాగా, ‘ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్’ భారత ధర రూ. 1,09,900 వద్ద నిర్ణయించినట్లు ప్రకటించింది. ఈనెల 27 నుంచి ఇక్కడి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. యాపిల్ వాచ్ ధర రూ. 40,900 యాపిల్ ఐ వాచ్ సిరీస్ 5 (జీపీఎస్) ధర రూ. 40,900 నుంచి ప్రారంభం కానుండగా.. వాచ్ సిరీస్ 5 (జీపీఎస్ ప్లస్ సెల్యులార్) ధర రూ. 49,900 నుంచి ప్రారంభంకానున్నట్లు ప్రకటించింది. ఇక వీడియో గేమింగ్ సర్వీస్–ఆర్కేడ్ నెలవారీ ధర రూ. 99 వద్ద నిర్ణయించింది. ఐపాడ్ ధర రూ. 29,900. -
సింహావలోకనం
మార్గదర్శకమైన మార్గాన్ని కనిపెట్టే వైతాళికు నికి తను నమ్మిన నిజాల మీద నిర్దుష్టమైన విశ్వాసం ఉండాలి. మూర్ఖమైన పట్టు దల ఉండాలి. ఓ గుడ్డి లక్ష్యం ఉండాలి. ఓ రకమైన పెళుసుదనం ఉండాలి. ఇన్ని లేకపోతే ఏదో ఒక సంద ర్భంలో తన విశ్వాసం సడలుతుంది. సడలిందా? అతను పోయే అధఃపాతాళానికి మరెవ్వరూ పోలేరు. అలాంటి మార్గాన్ని ఎంచుకుని తన జీవితకాలంలో అఖండ విజయాన్ని సాధించిన అద్భుత పరిశోధ కుడు స్టీవ్‌జాబ్స్. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పరప తిని సాధించిన ఐఫోన్ ప్రారంభదశకి ఆద్యుడు. ఈ దశలోనే ఇలాంటి మరొక మూర్ఖపు పట్టు దలతో విజయాన్ని సాధించిన ఇద్దరి పేర్లు ఏనాడూ కెమెరా ముందు నిలబడని నన్ను ‘వద్దు బాబోయ్!’ అంటున్నా వినిపించుకోకుండా 5 పాటలూ, 42 సీన్లూ ఉన్న ఓ సినీమాలో టైటిల్ రోల్ వేయించి నాకు 39 సంవత్సరాల, 300 సినీమాల కెరీర్‌ని ఇచ్చిన వ్యక్తి నిర్మాత రాఘవ. చాలా సందర్భాలలో నా కారణంగా రాఘవగారు భయంకరమైన ఫెయి ల్యూర్ చవి చూస్తారని భయపడి ఆయనతో అనేవా డిని. ఆయన కేవలం నవ్వి ఊరుకునేవారు. మరొక వ్యక్తి– ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త ఎస్. భావనారాయణగారు. ఊహించని ఉష్ణోగ్ర తల్లో లోహాల్ని కరిగించే మూసలు– ఆ ఉష్ణోగ్రతను తట్టుకునే ఏ మిశ్రమ లోహంతో తయారుకావాలి? సంవత్సరాల తరబడి తపస్సు చేసి– ఫలితాన్ని కనుగొని ఆ వ్యాపారానికి ‘కింగ్’గా నిలవడం నాకు తెలుసు. ఆ రోజుల్లోనే చిరంజీవి హీరోగా ఆయనకి నేను ‘ఐ లవ్ యూ’ రాశాను. ఆయనది విపరీతమైన instinct తొలి రోజుల్లోని ఒక చిత్రాన్ని చూసి ‘మారుతీరావుగారూ! ఈ కుర్రాడు చిదక్కొట్టేస్తాడు– అలా చూస్తూండండి’ అన్నారు. అలా చెప్పిన మరొక కన్నడ హీరో ‘ఒందానొందు కాలదల్లి’ చూశాక శంక రనాగ్ని. ఇద్దరూ దరిమిలాను అక్షరాలా ఆ పని చేశారు. తర్వాత రెండు చిత్రాలు తీసి, ఫెయిలయి ‘లాభం లేదు మారుతీరావుగారూ! నా ‘గురి’ తప్పింది. ఇంక సినీమాలు తీయను’ అని సన్య సించారు. ఏతావాతా స్టీవ్‌జాబ్స్ తన పరిధిలోకి వచ్చి తనని ప్రభావితం చేసేవారిపట్ల అతి క్రూరుడు. తను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అని నమ్మి, ప్రపం చాన్ని నమ్మించిన వ్యాపారి. తన ధోరణి సాగకపోతే పసివాడిలాగా ఏడ్చేవాడు. ఆ ఏడుపు నిస్సహాయత కాదు. తన అహంకారానికి ఆటవిడుపు. స్టీవ్ జాబ్స్‌కి భారతీయ తత్వ సిద్ధాంతమన్నా, సంస్కృతి అన్నా మక్కువ. భారతదేశం వచ్చి ఎన్నో దేవాలయాలు, సంస్థలను చూశాడు. ఆయన నమ్మ కాల పునాదుల్లో కనీసం రెండయినా భారతీయ ఆలో చనా వ్యవస్థ ఇటుకలు ఉన్నాయేమో! స్టీవ్‌జాబ్స్ ఏ కాలేజీకి వెళ్లలేదు. వెళ్లిన ఒక్క కాలేజీ చదువుని అర్ధంతరంగా వదిలి వచ్చేశాడు. తన మామగారి కారు గరాజ్లో పరిశోధనలు ప్రారం భించి మొట్టమొదటి ‘మెకంతోష్’కి రూపకల్పన చేశాడు. వ్యాపార రంగం దిగ్భ్రాంతమయింది. తర్వాత అతని జీవితం చరిత్ర. చివరికి కేన్సర్‌తో కన్నుమూశాడు. మరణ శయ్యమీద స్టీవ్ జాబ్స్ చెప్పిన మాటలు ఏ శ్రీశ్రీ రవిశంకరో, ఏ సద్గురు జగ్గీ వాసుదేవో చెప్పిన సూక్తులలాగ వినిపిస్తాయి. ‘అవసానం కొందరికి అవలోకన. కొందరికి కేవలం యాతన. చాలామందికి నా జీవితం పెద్ద విజయానికి నిదర్శనం. కానీ అందులో చాలా కొద్ది ఆనందమే ఉంది. ఐశ్వర్యం నాకు వ్యసనం. జీవిత మంతా నన్ను ఏమార్చిన మాఫియా. ఇప్పుడు ఆఖరి క్షణాలలో మృత్యువు సమక్షంలో ఈ ఐశ్వర్యం అర్థం లేనిదని అర్థమయింది. నీ కారుని నడపటానికి ఓ మనిషిని జీతానికి కుదుర్చుకోవచ్చు. కానీ– నీ అనారోగ్యాన్ని పంచుకోడానికి నువ్వు ఎప్పుడూ ఒంటరివి’. మిత్రుడు, ప్రముఖ హాస్య రచయిత డాక్టర్ తంబు కేన్సర్‌తో వెళ్లిపోయాడు. చివరి రోజుల్లో ఆయన ఆత్మీయ మిత్రుడు కళ్లనీళ్లు పెట్టుకుంటూ ‘చెప్పరా, నీ కోసం నేను ఏం చెయ్యమన్నా చేస్తాను’ అన్నాడు రుద్ధ కంఠంతో. ‘అయితే నా మూత్రాన్ని నా తరఫున నువ్వు పొయ్యి’ అన్నాడట తంబు అనే డాక్టర్. ఎంత భయంకరమైన నిస్సహాయత. మళ్లీ స్టీవ్‌జాబ్స్: ‘నీ తెలివితేటలు పెరిగి, విజ్ఞత పుంజుకున్నకొద్దీ నీకొకటి అర్థమవుతుంది. 30 రూపాయల వాచీ, 30 వేల రూపాయల వాచీ అదే కాలాన్ని సూచిస్తుంది. వాచీ కాలం విలువని పెంచదు. అర్థంలేని నీ ‘వానిటీ’కి రంగులు దిద్దు తుంది. చివరికి నీ జీవితంలో ఆరుగురే ఉత్తమమైన వైద్యులున్నారు: సూర్యరశ్మి, విశ్రాంతి, వ్యాయామం, ఆహారం, ఆత్మవిశ్వాసం, స్నేహితులు. దేవుడిచ్చిన మనుషుల్ని కాపాడుకో. ఒకరోజు వాళ్ల అవసరం నీకుంటుంది. ‘తొందరగా వెళ్లాలనుకుంటే ఒంటరిగా వెళ్లు. ఎక్కువ దూరం వెళ్లాలనుకుంటే నలుగురైదుగురుతో నడువు. ఎందుకు? ఆలోచించని జీవన ప్రయాణం ఏమారుస్తుంది. ‘ఆలోచన’ అడుగుల్ని అంచనా వేయిస్తుంది’. ఈ మాట ‘నడక’ గురించి కాదు. ‘జీవన ప్రయాణం’ గురించి. వ్యాసకర్త : గొల్లపూడి మారుతీరావు -
వెంటాడే గూగుల్ నిఘా
శాన్ఫ్రాన్సిస్కో: టెక్నాలజీ దిగ్గజం గూగుల్ మీపై నిఘా పెడుతోందా? మీరు వద్దన్నా సరే మీ రాకపోకలు, మేసేజ్‌లు అన్నింటిని రికార్డు చేస్తోందా? అంటే నిపుణులు అవుననే జవాబిస్తున్నారు. తమ ప్రయాణ వివరాలు రికార్డు చేయవద్దని సెట్టింగ్స్ పెట్టినప్పటికీ గూగుల్ ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్ల సమాచార సేకరణను ఆపడంలేదు. అసోసియేటెడ్ ప్రెస్ జరిపిన పరిశోధనలో ఈ సంచలనాత్మక విషయం వెల్లడైంది. ఈ వివరాలను ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ పరిశోధకులకు పంపగా అనుమతి లేకుండా పౌరుల సమాచారాన్ని గూగుల్ సేకరిస్తోందని వారు ధ్రువీకరించారు. ‘గూగుల్ మ్యాప్స్’ వాడేటప్పుడు యూజర్ ఉన్న లొకేషన్ తెల్సుకునేందుకు అనుమతి ఇవ్వాలి. అలా చేస్తే ప్రజలు ఫోన్‌తో ఏ చోట్లకెళ్లారు? అక్కడ ఎంతసేపున్నారు? తదితర అంశాలను ఆటోమేటిక్‌గా రికార్డు చేస్తుంది. అయితే ఇది ఇష్టం లేని యూజర్ల కోసం ‘లొకేషన్ హిస్టరీ ఆప్షన్’ను ఆఫ్ చేసే సౌకర్యాన్ని గూగుల్ తెచ్చింది. దీన్నివాడితే యూజర్లు ఎక్కడున్నారో రికార్డు కాదని గూగుల్ చెప్పింది. తాజాగా పరిశోధకులు ఇది అబద్ధమని తేల్చారు. లొకేషన్ హిస్టరీ ఆప్షన్ ను నిలిపివేసినా కొన్ని గూగుల్యాప్స్ కస్టమర్లు ఎక్కడ, ఎంతసేపు ఉన్నారో రికార్డు చేస్తున్నాయని తేల్చారు. గూగుల్ మ్యాప్ యాప్‌ను ఒక క్షణం ఓపెన్ చేసినా స్క్రీన్ షాట్ ఆటోమేటిక్‌గా గూగుల్ తీసేసుకుంటోందని పరిశోధకులు తెలిపారు. ఆటోమేటిక్‌గా వాతావరణం గురించి చెప్పే యాప్స్ కూడా యూజర్లు ఎక్కడ ఉన్నారన్న సమాచారాన్ని గూగుల్‌కు పంపిస్తూనే ఉంటాయి. లొకేషన్‌కు సంబంధం లేని మరికొన్ని యాప్స్ అయితే కేవలం 30 సెం.మీ కచ్చితత్వంతో ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారుల సమస్త సమాచారాన్ని గూగుల్‌కు అందజేస్తున్నాయి. 200 కోట్ల మందికి పైగా ఉన్న ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారుల సమాచారాన్ని గూగుల్ రికార్డు చేసిందన్నారు. వినియోగదారుల అనుమతి లేకుండా గూగుల్ వారి సమాచారాన్ని దొంగతనంగా సేకరించిందని ప్రిన్స్టన్ వర్సిటీకి చెందిన కంప్యూటర్ శాస్త్రవేత్త జొనాథన్ మేయర్ తెలిపారు. వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు వేర్వేరు మార్గాల్లో తాము యూజర్ల సమాచారాన్ని సేకరిస్తామని గూగుల్ ప్రతినిధి చెప్పారు. యూజర్లు myactivity.google.com ద్వారా తమ సెర్చింగ్లు, ఇతర వివరాలను చూసుకోవచ్చు. -
రూ.85 లక్షలు విలువ చేసే 100 ఐఫోన్లు సీజ్
సాక్షి, న్యూఢిల్లీ : ఖరీదైన 100 ఐఫోన్లను అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఆదివారం దుబాయ్ నుంచి భారత్ వచ్చిన 53 ఏళ్ల వ్యక్తిని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. అతని వద్ద దాదాపు రూ. 85 లక్షలు విలువ చేసే ఐఫోన్ ఎక్స్ ఫోన్లను గుర్తించారు. వాటికి సరైన ఆధారాలు చూపని కారణంగా ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని, ఫోన్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో దుబాయ్ నుంచి వచ్చే ప్రయాణికుల వద్ద అక్రమంగా రవాణా చేస్తున్న బంగారం, ఖరీదైన వస్తువులు భారీగా లభిస్తున్నాయి. -
ఇక హిందీలోనూ ‘గూగుల్ అసిస్టెంట్’
శాన్ఫ్రాన్సిస్కో: 2018 చివరికల్లా హిందీ సహా 30కిపైగా భాషల్లో గూగుల్ అసిస్టెంట్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని ఆ సంస్థ తెలిపింది. ప్రస్తుతం గూగుల్ అసిస్టెంట్ కేవలం ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, జపనీస్, కొరియన్, స్పానిష్, పోర్చుగీస్ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే ఆండ్రాయిడ్, ఐఫోన్ల కోసం హిందీ సహా డానిష్, డచ్, ఇండోనేషియన్, నార్వేజియన్, స్వీడిష్, థాయ్ భాషల్లో గూగుల్ అసిస్టెంట్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. ఒకే వ్యక్తి వేర్వేరు భాషల్లో ఇచ్చే ఆదేశాలను పాటించేలా ఈ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేస్తారు. ఏ స్మార్ట్‌ఫోన్‌లో అయినా హోమ్‌పేజ్ బటన్‌ను కొద్దిసేపు నొక్కిపట్టుకోవడం లేదా ‘ఓకే గూగుల్’ అని చెప్పడం ద్వారా ‘గూగుల్ అసిస్టెంట్’ను యాక్టివేట్ చేయవచ్చు. -
స్మార్ట్‌ఫోన్ యూజర్లకు కొత్త న్యూస్
సాక్షి, టెక్నాలజీ : పలుకే బంగారామాయేనా... అన్నట్లు వాట్సప్, మెసేంజర్లలో ఎందులోనైనా సరే చాటింగ్ చేస్తున్నప్పుడు మన ఫీలింగ్స్‌ను రాసి పంపే కంటే బొమ్మల(ఎమోజీ)తో తెలుపుతాం. కోపంగా ఉన్నామనీ, సిగ్గుపడుతున్నామనీ, ఏడుస్తూ ఉన్నామనీ ఇలా ప్రతీ ఫీలింగ్‌ను నేస్తాలకు తెలియజేస్తాం. రాతల్లో చెప్పలేని మాటలను బొమ్మలతో చెప్పుకుంటాం. ఇలా ఎమోజీలకు అలవాటు పడిన చాటింగ్ ప్రియులకు కొత్తగా మరికొన్ని ఎమోజీలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది చివరికల్లా కొత్తగా తయారుచేసిన 157 ఎమోజీలన్నీ స్మార్ట్‌ఫోన్‌లోకి అందుబాటులోకి రానున్నాయని యూనికోడ్ కన్సార్టియం తెలిపింది. మహిళా సూపర్ హీరో, లైట్ స్కిన్ రెడ్ హెయిర్ ఉన్న అమ్మాయి, డార్క్ స్కిన్ కర్లీ హెయిర్ ఉన్న అబ్బాయి, దోమ, పైరెట్ ఫ్లాగ్(డేంజర్ జోన్లో ఉండే బొమ్మ) ఇలా అనేక రకాల కొత్త ఎమోజీలు ఉన్నట్లు సమాచారం. -
ఐ ఫోన్ కస్టమర్‌కి భారీ ఊరట
ఆపిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు గుజరాత్‌లోని అహ్మదాబాద్ కోర్టు షాక్ ఇచ్చింది. ఖరీదైన ఐ ఫోన్‌ను కొనుగోలు చేస అష్టకష్టాలుపడిన ఓ కస్టమర్‌కి భారీ ఊరటనిస్తూ తీర్పు చెప్పింది. వినియోగదారుడి కోరికపై ఐ ఫోన్ రిఫండ్ చేయాలని, లేదా అదనపు ధర చెల్లింపు తర్వాత హై ఎండ్ మోడల్ ఐ ఫోన్ ను ఇవ్వాలని తీర్పు చెప్పింది. లేదంటే రూ.54వేలు చెల్లించాలని ఆదేశించింది. అంతేకాదు సదరు కస్టమర్ పడిన మానసిక వేదనకు, న్యాయ ఖర్చులకుగాను రూ.4,000 పరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళితే... సౌరాష్ట్ర ధరోజీ టౌన్‌కి చెందిన ఇక్బాల్ దంధల్ అనే విద్యార్థి 2015లో రూ.54వేలు వెచ్చించి ఓ ఐఫోన్‌ను కొన్నాడు. దీంతోపాటు ఫోన్‌కు అదనపు సొమ్ము చెల్లించి డిసెంబర్ 2017 వరకు ఎక్స్టెండెడ్ వారంటీ పొందాడు. అయితే ఇక్బాల్ కొన్న ఐఫోన్ కొద్ది నెలలకే పాడై పోయింది. ఈ విషయాన్ని లోకల్ యాపిల్ డీలర్ దృష్టికి తీసుకెళ్లి, ఆ ఫోన్‌ను మార్చి అదే మోడల్‌కు చెందిన కొత్త ఐఫోన్‌ను తీసుకున్నాడు. అయితే రెండోసారి కూడా సేమ్ సీన రిపీట్. మూడో సారి కూడా ఇక్బాల్‌కు ఈ కష్టాలు తప్పలేదు. దీంతో ఈ బాధలు తన వల్ల కాదని .. తనకు లేటెస్ట్ మోడల్ ఐ ఫోన్ కావాలని...దీనికి అదనంగా డబ్బులు కూడా చెల్లిస్తానని కోరాడు. కానీ ఇందుకు డీలర్ స్పందించకపోవడంతో విసిగిపోయిన ఇక్బాల్ యాపిల్ ఇండియా కంపెనీతోపాటు ఆ డీలర్‌పై రాజ్‌కోట్ కన్జ్యూమర్ కోర్టును ఆశ్రయించాడు. కేసు విచారణ కొనసాగించిన న్యాయస్థానం ఇక్బాల్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. -
ఐ ఫోన్10 మొండికేస్తోందట? ఎందుకు?
శాన్ఫ్రాన్సిస్కో: ఆపిల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా, అత్యంత ఖరీదులో లాంచ్ చేసిన ఐఫోన్ 10పై మరొకటి వార్త వెలుగు చూసింది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్ మొదటి టెస్ట్‌లో కింద పడినపుడు పగిలిందన్న వార్తలకు తోడు ఇపుడు ఐ ఫోన్ అతి చల్లటి వాతావరణంలో పనిచేయడంలేదన్న వార్త ఐ ఫోన్ లవర్స్‌కు షాకింగ్ న్యూసే. ఎలాంటి వాతావారణంలోనైనా పనిచేయాల్సిన స్మార్ట్‌ఫోన్ తీవ్రమైన శీతల పరిస్థితుల్లో పనిచేయనని మొండికేస్తోందట. ఈ సమస్యపై ఆపిల్ కూడా స్పందించింది. త్వరలోనే దీన్ని పరిష్కరిస్తామని చెప్పింది. అత్యంత ఖరీదు పెట్టి కొన్న ఐఫోన్10 అతి చల్లటి వాతావరణంలో పనిచేయడం లేదని కొంతమంది యూజర్లు ఫిర్యాదు చేశారు. చల్లటి వాతావరణంలోకి వెళ్లిన తరువాత రెండు సెకన్లకే టచ్ స్క్రీన్ పనిచేయలేదని ఒక వినియోగాదారుడు వాపోయాడు. అయితే ఇలాంటి సంఘటనలు తమ దృష్టికి వచ్చాయని,కానీ, కొద్ది సెకన్ల తరువాత పూర్తిగా యథావిధిగా ఉంటోందని ఆపిల్ పేర్కొంది. రాబోయే సాఫ్ట్వేర్ అపడేట్లో దీన్ని సవరించనున్నట్టు తెలిపింది. అంతేకాదు 0-35 డిగ్రీల సెల్సియస్ మధ్య వాడాలని కూడా సూచించింది. అతిశీతల, అతి ఉష్ణ వాతావరణంలో ఈ డివైస్ బ్యాటరీ కూడా తాత్కాలికంగా బలహీనపడే అవకాశం ఉందని, అయితే సాధారణ వాతావరణంలోకి వచ్చిన తరువాత మళ్లీ మామూలు స్థితికి వస్తుందని చెప్పింది -
ఐ ఫోన్ ఎక్స్:ఎయిర్టెల్ బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: ఆపిల్10వ వార్షికోత్సవం సందర్భంగా మార్కెట్లోకి వచ్చిన ఆపిల్ అత్యంత ఖరీదైన ఫోన్ ఐఫోన్ ఎక్స్‌పై ఎయిర్టెల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. నవంబర్ 3నుంచి భారత్‌లో విక్రయానికి రానున్నఆపిల్ ఐఫోన్ ఎక్స్ పై ఎయిర్ టెల్ ఆన్లైన్ స్టోర్ ద్వారా రూ. 10వేల క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు ప్రత్యేకంగా ఈ ఆఫర్ లభించనుంది. శుక్రవారం సాయంత్రం ఆరుగంటలనుంచి శనివారంఉదయం 7. గంటల వరకు ఎయిర్ టెల్ పోస్ట్ పెయిడ్వినియోగదారులకు ఈ ఆఫర్అందుబాటులోఉంటుందని భారతి ఎయిర్టెల్ సీఎంఓ రాజ్ పూడిపెద్ది ప్రకటించారు. నవంబర్ 3 సాయంత్రం 6గంటలనుంచి కొత్తగా ప్రారంభించిన ఎయిర్టెల్ ఆన్లైన్ స్టోర్‌లో ఐఫోన్ ఎక్స్ ఫోన్లను ఎయిర్టెల్ విక్రయించనుంది. ముఖ్యంగా సిటీ బ్యాంక్ క్రెడిట్‌కార్డు ద్వారా కొనుగోలుచేసే ఎయిర్టెల్ పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు రూ.10వేల క్యాష బ్యాక్ పొందొచ్చునని ఎయిర్టెల్ ప్రకటించింది. నవంబరు 3వ తేదీ సా. 6గంటలనుంచి మరునాడు ఉదయం 7గంటలవరకు మాత్రమే ఈ సౌలభ్యమని తెలిపింది. పూర్తిగా నగదు చెల్లించిన(నో ఈఎంఐ ఆప్షన్ ) పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల్లో ఫస్ట్ కం ఫస్ట్ సెర్వ్ కింద ఈ ఆఫర్ అందుబాటులోఉంటుందని పేర్కొంది. అయితే ప్రీ ఆర్డర్ కోసం ప్రముఖ ఈ కామర్స్ సైట్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోఉన్నప్పటికీ.. ఎయిర్టెల్ ఆన్లైన్ స్టోర్‌లో ఐఫోన్ఎక్స్ ఇంకా లిస్ట్ అయినట్టు చూపించడం లేదు. కాగాఎయిర్టెల్ ఆన్లైన్ స్టోర్ సేవలు ప్రస్తుతం భారతదేశంలోని 21 నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆపిల్ ఐఫోన్ ఎక్స్ స్మార్ట్‌ఫోన్ నవంబరు 3నుంచి గ్లోబల్ మార్కెట్లలోకి విక్రయానికి రానున్న సంగతి తెలిసిందే. -
కూతురు చేసిన పనికి.. పాపం ఆ తండ్రి..!
శాన్ఫ్రాన్సిస్కో: యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్‌కు మంచి డిమాండ్ ఉంది. తన కూతురు తీసిన వీడియో కారణంగా యాపిల్ సంస్థలో ఓ ఇంజనీర్ ఉద్యోగం ఊడింది. వివరాలివి.. బ్రూక్ అమెలియా పీటర్సన్ తన తండ్రి ఇంజనీర్‌గా పనిచేస్తున్న యాపిల్క్యాంపస్కు ఈవారం మొదట్లో వెళ్లింది. అక్కడ ఆ సమయంలో ఆమె డాక్యుమెంట్ తీసింది. అందులో ప్రత్యేక సిబ్బంది వద్ద క్యూఆర్ కోడ్స్‌తో ఉండే ఇంకా విడుదల కానీ ఐఫోన్-10 గురించి సమాచారం ఉంది. ఇంకా ఆ ఫోన్ పైనున్న కోడ్, ఆ ఫోన్ హోమ్ స్ర్కీన్, కవర్ షీట్ నోటిఫికేషన్ కూడా కనిపించాయి. ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్ అయింది. దీంతో ఆ సంస్థ పీటర్సన్ తండ్రిని ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ ఘటనతో తనపై తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారని ఆమె చెప్పింది. అంతేకాక వీడియో తీయడం యాపిల్ కంపెనీ నిబంధనలకు విరుద్ధమని అన్నారని పీటర్సన్ తెలిపింది. ఆ వీడియోను తొలగించాల్సిందిగా యాపిల్ కంపెనీ ఆమెను కోరింది. అయితే అప్పటికే ఆలస్యమై అది వైరల్ అయింది. -
ఐ ఫోన్ ఎక్స్‌కు చెక్ పెట్టేలా హువాయ్ స్మార్ట్ఫోన్లు
బీజింగ్: చైనా దిగ్గజం హువాయి అమెరికన్ మొబైల్ దిగ్గజం ఆపిల్‌కు చెక్‌పెట్టేలా సరికొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. ముఖ్యంగా ఆపిల్ ఇటీవల విడుదల చేసిన ఐ ఫోన్ 8, 8ప్లస్, X కు ధీటుగా రెండు డివైస్‌లను ప్రవేశపెట్టింది. హువాయి మాట్10, మాట్ 10 ప్రొ లను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రిచర్డ్ యు ఆవిష్కరించారు. అంతేకాకుండా, హువాయి పోర్స్చే డిజైన్ హువాయ్ మాట్ 10 కూడా ఆవిష్కరించారు. స్మార్ట్ఫోన్లలో అత్యంత అధునాతన చిప్సెట్ తో వీటిని రూపొందించామనీ ఇది చాలా శక్తివంతమైందనీ, అల్టిమేట్ పెర్ఫామెన్స్, ఇంటిలిజెన్స్ ఎక్స్పీరియన్స్ అందిస్తాయనీ యు పేర్కొన్నారు. హువాయ్ 10 ధర దాదాపు రూ .53,400గాను, 10 ప్రో ధరను దాదాపు రు .61,000గాను నిర్ణయించింది. మాట్ 10 ప్రోను రెండు వేరియంట్లలో (4 జీబీర్యామ్, 64 జీబీ అంతర్గత నిల్వ, 6జీబీ ర్యామ్, 128జీబీ అంతర్గత నిల్వ ) లాంచ్ చేసింది. పరిమితమార్కెట్లలో అందుబాటులో ఉండే పోర్స్చే డిజైన్ హువాయ్ మాట్ 10 దాదాపు రూ.1,6,6,600లకు లభ్యం కానుంది. డైమండ్ బ్లాక్కలర్లో 6జీబీ ర్యామ్/ 256జీబీ లభ్యమవుతుందని కంపెనీ ప్రకటించింది. నవంబరు నుంచి ఆస్ట్రేలియా, చైనా, ఈజిప్ట్, మలేషియా, మెక్సికో, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, సౌదీ అరేబియా, సింగపూర్, స్పెయిన్,యూఏఈ దేశాల్లో విక్రయాలు మొదలుకానున్నాయి. అలాగే యూరోప్ మరియు ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లో అందుబాటులో కూడా ఉండనుంది. ప్రయోగ మార్కెట్లలో దాదాపు రూ.1,6,6,600 వద్ద అందుబాటులో ఉంచింది. మాట్ 10, 10 ప్రో రెండూ రెండూ ఫుల్ వ్యూ డిస్ప్లేతో, స్వదేశీ HiSilicon Kirin 970 SoC ఆధారితమైనవి, న్యూయరల్-నెట్వర్క్ ప్రాసెసర్ యూనిట్ (NPU) ను కలిగి ఉన్న మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ చిప్ సెట్ అని కంపెనీ చెబుతోంది. అలాగే ఐ ఫోన్లలో ఫింగర్ ప్రింట్ సెన్సర్ మిస్‌అయితే హువాయి మాత్రం ఈరెండు రెండు ఫోన్లలనో ఫింగర్ ప్రింట్ సెన్సార్ జత చేర్చింది. దీంతో ఆపిల్ తరహా స్లిమ్మెర్ బాడీతో, బయోనిక్ స్వంత డ్యూయల్ కోర్ 'నారల్ ఇంజిన్' మద్దతుతో వస్తున్న ఆపిల్ ఐఫోన్లకు గట్టిపోటీ ఇస్తాయని మొబైల్ నిపుణులు భావిస్తున్నారు. హువాయ్ మాట్ 10 ప్రో 6 అంగుళాల ఫుల్ హెచ్డీ అమోలెడ్ డిస్ప్లే 1080x2160 పిక్సెల్స్ రిజల్యూషన్ 4 జీబీ/64 జీబీ అంతర్గత నిల్వ, 6జీబీ ర్యామ్/ 128జీబీ 20మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ 12 మెగాపిక్సెల్ ఆర్జీబీ సెన్సార్ 8 ఎంపి సెల్ఫీ కెమెరా 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, హువాయ్ మాట్ 10 5.9 అంగుళాల డిస్ఫ్లే 1440x2560 పిక్సల్స్ రిజల్యూషన్ 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 256జీబీ దాకా విస్తరించుకునే సదుపాయం 20మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ 12 మెగాపిక్సెల్ ఆర్జీబీ సెన్సార్ 8 ఎంపి సెల్ఫీ కెమెరా 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ -
ఐ ఫోన్ 8, 8ప్లస్ లాంచ్..
సాక్షి, ముంబై: స్మార్ట్ ఫోన్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆపిల్ ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ స్మార్ట్ఫోన్లు భారత మార్కెట్లోకి వచ్చేశాయి. దసర దీపావళి పండుగల సందర్బంగా ఈ కొత్త డివైస్‌లు ఇండియన్ కస్టమర్లను మురిపించనున్నాయి. ఈ సందర్భంగా కస్టమర్లకు ఓ ఆకర్షణీయమైన ఆఫర్ ను రిలయన్స్ జియో అందిస్తోది. సిటీ బ్యాంక్ కార్డ్ ద్వారా బుక్ చేసుకుంటే ఐ ఫోన్ 8 , 8 ప్లస్‌పై భారీ క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. సెప్టెంబర్ 29 న ఇండియాలోలాంచింగ్ సందర్భంగా ఈ ఆఫర్ అందిస్తోంది. అది ఈ ఒక్కరోజు మాత్రమే. ఈ సందర్భంగా ఆపిల్ సీఈవో టిమ్‌కుక్ కు సంబంధించిన స్పెషల్ ఏవీని ప్రదర్శించారు. దీంతోపాటు రిలయన్స్ డిజిటల్, జియో.కాం ద్వారా ఐఫోన్ 8, 8 ప్లస్ కొనుగోలు చేసిన వారికి 70శాతం క్యాష్‌బ్యాక్ (బై బ్యాక్) ఆపర్ అందిస్తోంది. ఈ పథకంలో ఐఫోన్ 8, ఐ ఫోన్ 8ప్లస్ కొనుగోలు చేసి, జియోవినియోగదారులకు ఏడాది తరువాత ఆ క్యాష్ బ్యాక్ అందిచనుంది. నెలకు రూ.799 జియో ప్యాక్ వినియోగదారులకు మాత్రమే బైబ్యాక్ గ్యారెంటీ అందుబాటులో ఉంటుంది. ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ వీటిని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కసమర్ల బెస్ట్ సర్వీస్ ఆపిల్, జియో డీఎన్ఏలో ఉందని ఆకాశ్ పేర్కొన్నారు. ఆపిల్ ఐఫోన్8 వేరియంట్ ధర 64జీబీ రూ. 64వేలు 256 జీబీ రూ.77వేలు ఐ ఫోన్ 8 ప్లస్ వేరియంట్ ధర 64జీబీ రూ. 73వేలు 256 జీబీ రూ. 86వేలు శుక్రవారం సాయంత్రం 6గంటలనుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. అలాగే ఐఫోన్ x ప్రీ బుకింగ్ అక్టోబర్ 27నుంచి అమ్మకాలు నవంబర్3 నుంచి మొదలుకానున్నాయి. Witness the launch of iPhone 8 on Jio - The world’s largest data network. #iPhone8OnJio https://t.co/z1JAkgp7dK — Reliance Jio (@reliancejio) September 29, 2017 -
ఐఫోన్ 8 కోసం సింగపూర్ వెళ్లి..
సింగపూర్: కుమార్తెకు గిఫ్ట్‌గా ఐఫోన్-8 ఇచ్చేందుకు ఓ భారతీయుడు ఏకంగా సింగపూర్‌కు వెళ్లారు. అక్కడ ఏకంగా 13 గంటలపాటు క్యూలో ఉండి అక్కడ ఐఫోన్ సాధించిన మొదటి వ్యక్తి అయ్యారు. సింగపూర్ డెయిలీ తెలిపిన వివరాలివీ... అమిన్ అహ్మద్ ధోలియా(43) అనే భారతీయ వ్యాపారవేత్త కుమార్తె వివాహం త్వరలోనే జరుగనుంది. దీంతో ఆయన తన కుమార్తెకు ఇటీవలే విడుదలైన ఐఫోన్-8 ను గిఫ్ట్‌గా ఇవ్వాలనుకున్నారు. ఇండియాలో ఐఫోన్ రిలీజ్ కాకపోవటంతో సింగపూర్ ప్రయాణమయ్యారు. గురువారం రాత్రి 7 గంటలకు సింగపూర్ నగరంలోని ఆర్చార్డ్ రోడ్డులో ఉన్న యాపిల్ స్టోర్‌కు చేరుకున్నారు. ఆ రాత్రంతా అక్కడే క్యూలో నిలబడిన ఆయన, శుక్రవారం ఉదయం 8 గంటలకు స్టోర్ తెరుచుకునే వరకు అక్కడే ఉండి మొదటి ఫోన్‌ను అందుకున్నారు. కాగా ఆయన వెనుక క్యూలో పలువురు విదేశీయులు సహా 200మంది ఉన్నారు. రాత్రంతా క్యూలో నిలబడి ఉండటం జీవితంలో ఇదే మొదటిసారని ధోలియా అన్నారు. అనుకున్నట్లు ఐఫోన్‌ను సాధించినందుకు సంతోషంగా ఉందని, కానీ రాత్రి వేళ అన్ని గంటలపాటు క్యూలో ఉండటం కష్టసాధ్యమేనన్నారు. కాగా, టెల్కో కాంట్రాక్టు ఫలితంగా సింగపూర్ వాసులకు ఐఫోన్లు సబ్సిడీ ధరకే లభిస్తున్నాయి. ఇదిలా ఉండగా సదరు భారతీయ వ్యాపార వేత్త పూర్తి వివరాలు తెలియరాలేదు.