ఐ ఫోన్‌ 8, 8‍ప్లస్‌ లాంచ్‌.. | Apple iPhone 8 on Jio: Big Festive Surprise in Store For Indian Buyers | Sakshi
Sakshi News home page

ఐ ఫోన్‌ 8, 8‍ప్లస్‌ లాంచ్‌..

Published Fri, Sep 29 2017 1:25 PM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM

Apple iPhone 8 on Jio: Big Festive Surprise in Store For Indian Buyers - Sakshi

సాక్షి,  ముంబై:  స్మార్ట్ ఫోన్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న  ఆపిల్‌ ఐఫోన్‌ 8, ఐఫోన్‌ 8 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లు భారత మార్కెట్లోకి   వచ్చేశాయి. దసర దీపావళి పండుగల సందర్బంగా ఈ కొత్త డివైస్‌లు ఇండియన్‌ కస్టమర్లను మురిపించనున్నాయి. ఈ సందర్భంగా  కస‍్టమర్లకు ఓ  ఆకర్షణీయమైన ఆఫర్‌ ను రిలయన్స్‌ జియో అందిస్తోది.  సిటీ  బ్యాంక్‌ కార్డ్‌ ద్వారా బుక్‌  చేసుకుంటే ఐ ఫోన్‌ 8 , 8 ప్లస్‌పై భారీ క్యాష్‌బ్యాక్‌ అందిస్తోంది.  సెప్టెంబర్‌ 29 న ఇండియాలోలాంచింగ్‌ సందర్భంగా ఈ ఆఫర్‌ అందిస్తోంది.  అది ఈ ఒక్కరోజు మాత్రమే. ఈ సందర్భంగా ఆపిల్‌ సీఈవో టిమ్‌కుక్‌ కు సంబంధించిన స్పెషల్‌ ఏవీని ప్రదర్శించారు.

 దీంతోపాటు  రిలయన్స్‌  డిజిటల్‌, జియో.కాం  ద్వారా ఐఫోన్‌ 8,  8 ప్లస్‌ కొనుగోలు చేసిన వారికి 70శాతం క్యాష్‌బ్యాక్‌ (బై బ్యాక్‌) ఆపర్‌   అందిస్తోంది. ఈ పథకంలో  ఐఫోన్‌ 8, ఐ ఫోన్‌ 8ప్లస్‌ కొనుగోలు చేసి,  జియోవినియోగదారులకు ఏడాది తరువాత ఆ  క్యాష్‌ బ్యాక్‌ అందిచనుంది.  నెలకు రూ.799 జియో  ప్యాక్‌ వినియోగదారులకు మాత్రమే  బైబ్యాక్‌ గ్యారెంటీ అందుబాటులో ఉంటుంది.

ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ కుమారుడు ఆకాశ్‌ అంబానీ వీటిని లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  కసమర‍్ల బెస్ట్‌ సర్వీస్‌ ఆపిల్‌, జియో  డీఎన్‌ఏలో ఉందని

ఆకాశ్‌ పేర్కొన్నారు.

ఆపిల్‌ ఐఫోన్‌8
వేరియంట్ ధర
64జీబీ రూ. 64వేలు
256 జీబీ రూ.77వేలు
ఐ ఫోన్‌ 8 ప్లస్‌
వేరియంట్ ధర
64జీబీ  రూ. 73వేలు
256 జీబీ రూ. 86వేలు

శుక్రవారం సాయంత్రం 6గంటలనుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. అలాగే ఐఫోన్‌ x ప్రీ బుకింగ్‌ అక్టోబర్‌ 27నుంచి అమ‍్మకాలు నవంబర్‌3 నుంచి  మొదలుకానున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement