
ఆపిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు గుజరాత్‌లోని అహ్మదాబాద్ కోర్టు షాక్ ఇచ్చింది. ఖరీదైన ఐ ఫోన్‌ను కొనుగోలు చేస అష్టకష్టాలుపడిన ఓ కస్టమర్‌కి భారీ ఊరటనిస్తూ తీర్పు చెప్పింది. వినియోగదారుడి కోరికపై ఐ ఫోన్ రిఫండ్ చేయాలని, లేదా అదనపు ధర చెల్లింపు తర్వాత హై ఎండ్ మోడల్ ఐ ఫోన్ ను ఇవ్వాలని తీర్పు చెప్పింది. లేదంటే రూ.54వేలు చెల్లించాలని ఆదేశించింది. అంతేకాదు సదరు కస్టమర్ పడిన మానసిక వేదనకు, న్యాయ ఖర్చులకుగాను రూ.4,000 పరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది.
వివరాల్లోకి వెళితే... సౌరాష్ట్ర ధరోజీ టౌన్‌కి చెందిన ఇక్బాల్ దంధల్ అనే విద్యార్థి 2015లో రూ.54వేలు వెచ్చించి ఓ ఐఫోన్‌ను కొన్నాడు. దీంతోపాటు ఫోన్‌కు అదనపు సొమ్ము చెల్లించి డిసెంబర్ 2017 వరకు ఎక్స్‌టెండెడ్ వారంటీ పొందాడు. అయితే ఇక్బాల్ కొన్న ఐఫోన్ కొద్ది నెలలకే పాడై పోయింది. ఈ విషయాన్ని లోకల్ యాపిల్ డీలర్ దృష్టికి తీసుకెళ్లి, ఆ ఫోన్‌ను మార్చి అదే మోడల్‌కు చెందిన కొత్త ఐఫోన్‌ను తీసుకున్నాడు. అయితే రెండోసారి కూడా సేమ్ సీన రిపీట్. మూడో సారి కూడా ఇక్బాల్‌కు ఈ కష్టాలు తప్పలేదు. దీంతో ఈ బాధలు తన వల్ల కాదని .. తనకు లేటెస్ట్ మోడల్ ఐ ఫోన్ కావాలని...దీనికి అదనంగా డబ్బులు కూడా చెల్లిస్తానని కోరాడు. కానీ ఇందుకు డీలర్ స్పందించకపోవడంతో విసిగిపోయిన ఇక్బాల్ యాపిల్ ఇండియా కంపెనీతోపాటు ఆ డీలర్‌పై రాజ్‌కోట్ కన్జ్యూమర్ కోర్టును ఆశ్రయించాడు. కేసు విచారణ కొనసాగించిన న్యాయస్థానం ఇక్బాల్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.