ఐ వాచ్ అయిపోయింది.. ఇప్పుడిక ‘ఐ రింగ్’ | I ring model turns into market | Sakshi
Sakshi News home page

ఐ వాచ్ అయిపోయింది.. ఇప్పుడిక ‘ఐ రింగ్’

Published Mon, Oct 12 2015 2:39 AM | Last Updated on Mon, Aug 20 2018 2:58 PM

ఐ వాచ్ అయిపోయింది.. ఇప్పుడిక ‘ఐ రింగ్’ - Sakshi

ఐ వాచ్ అయిపోయింది.. ఇప్పుడిక ‘ఐ రింగ్’

‘ఐ ఫోన్’తో స్మార్ట్‌ఫోన్ల రంగంలో గొప్ప విప్లవానికి శ్రీకారం చుట్టిన ఆపిల్ కంపెనీ.. ఇప్పుడు వేరబుల్ (ధరించగల) టెక్నాలజీ విషయంలో మరో అడుగు ముందుకేసింది. ఇటీవలే ‘ఐ వాచ్’ను ఆవిష్కరించిన ఈ సంస్థ ఇప్పుడు ‘ఐ రింగ్’కు శ్రీకారం చుట్టింది. ఆపిల్ కంపెనీ ‘ఐ రింగ్’కు పేటెంట్ పొందింది. తద్వారా  మరో కొత్తరకం గాడ్జెట్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు ఆరంభించింది. అత్యంత చిన్నదైన టచ్‌స్క్రీన్ గాడ్జెట్‌గా దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్టుగా ఆపిల్ ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్ స్థాయి ఫీచర్లైన ఫొటోస్, టెక్ట్స్‌తో పాటు ఇంకా అసంఖ్యాకమైన అప్లికేషన్లతో ఈ ఐ రింగ్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టుగా వివరించింది. ఐ రింగ్‌ను వేరబుల్ టెక్నాలజీలో కొత్త విప్లవంగా అభివర్ణించింది. ఐ వాచ్‌లాగానే ఈ స్మార్ట్ రింగ్ కూడా ఐఫోన్‌తో అనుసంధానం కాగలదు.
 
 అన్ని ఫీచర్లూ పొదిగిన రింగ్ ఇది...
 మనం డిక్టేట్ చేసిన పదాలను స్పెల్లింగ్‌తో సహా రాసిపెడుతుంది, ఐ ఫోన్‌లో ఇమిడే అన్ని అప్లికేషన్లనూ ఇముడ్చుకుని వాటిని స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తుంది. ఫోన్‌తో అనుసంధానం అయి ఉండే ఈ రింగ్... ఫోన్‌కు టెక్ట్స్ మెసేజ్‌లు వచ్చినప్పుడు అలర్ట్ టోన్స్‌ను వినిపిస్తుంది. టెక్ట్స్, ఆడియో, వీడియో మెసేజ్‌లను డిస్‌ప్లే చేసే సామర్థ్యం ఉంటుంది ఈ రింగ్‌కి. ఇన్‌బిల్ట్‌గా ఉండే కెమెరాతో ఫొటోలు తీసుకోవచ్చు. దీన్ని ధరించిన వ్యక్తి ఉన్న చోట వాతావరణ పరిస్థితులను, ఉష్ణోగ్రత వివరాలను చెబుతుంది ఈ రింగ్. పేటెంట్ హక్కులు తీసుకున్నామని... ఈ డివైజ్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి వినియోగదారులకు అందుబాటులో తీసుకొస్తామని ఆపిల్ యాజమాన్యం ప్రకటించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement