![జియో ఎఫెక్ట్: ఐడియా కొత్త ఎత్తుగడ](/styles/webp/s3/article_images/2017/09/5/61485505482_625x300.jpg.webp?itok=vXD0RN3j)
జియో ఎఫెక్ట్: ఐడియా కొత్త ఎత్తుగడ
ముంబై: టెలికాం ఆపరేటర్ ఐడియా సెల్యులార్ మార్కెట్లో పోటీని తట్టుకునేందుకు సరికొత్త ఎత్తుగడతో వస్తోంది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కి పోటీగా పూర్తి స్థాయి డిజిటల్ సేవల్లోకి ఏంట్రీ ఇస్తోంది. పూర్తి డిజిటల్ సేవల సంస్థగా మార్చే చర్యల్లో భాగంగా కొత్త యాప్ లను లాంచ్ చేయబోతోంది. సినిమాలు, టీవీ, సంగీతం, గేమ్స్ ఇలా అంతటా కొత్త యాప్ లను త్వరలోనే ప్రారంభించబోతోంది.
మ్యూజిక్ అండ్ మూవీ కంటెంట్ ను అందించేందుకు ఒప్పందాలు చేసుకుంది. వాల్యూ ఏడెడ్ సర్వీసుల విస్తరణకు, వినోదం, సమాచారం, కమ్యూనికేషన్ అండ్ యుటిలిటీస్ లాంటి వివిధ కేటగిరీల్లో బ్రాండెడ్ డిజిటల్ సేవలకోసం ఒప్పందాలపై సంతకాలు చేసింది. వాయిస్ కాల్స్, డాటా సర్వీసులతో పాటు తాము పూర్తి డిజిటల్ సొల్యూషన్స్ కంపెనీ గా అవతరించనున్నట్టు ఐడియా మేనేజింగ్ డైరెక్టర్ హిమాన్షు కపానియా వెల్లడించారు. భారతీయ వినియోగదారుల వినోదం, ఆన్ లైన్ డిమాండ్ లను నెరవేర్చే దిశగా తమ వాగ్దానికి కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. డాటా ట్రాఫిక్ లో వీడియో డిమాండ్ 2020 నాటికి 60 శాతం పెరిగనున్నట్టు ఇటీవల ఆర్థిక ఫలితాల ప్రకటన సందర్భంగా వ్యాఖ్యానించింది.
కాగా జియో ప్రభావంతో గత కొన్ని నెలలుగా టెల్కో లు కంటెంట్ ఆఫర్స్ పై దృష్టిపెడుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ముఖేష్ అంబానీ నేతృత్వంలోని జియో 4జీలోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత డిజిటల్ కంటెంట్ సంస్థగా రూపొందుతున్నాయన్నారు. డేటా ట్రాఫిక్ లో క్లిష్టమైన కంటెంట్ పై దృష్టిపెడుతున్నట్టు చెప్పారు.