రిలయన్స్ జియో ఎఫెక్ట్‌తో ఐడియా తన పోస్టు పెయిడ్ యూజర్లకూ కొత్త ప్లాన్స్‌ను ప్రవేశపెట్టింది. నిర్వానా పోస్టు పోస్టు పెయిడ్ ప్లాన్స్ పేరుతో వీటిని లాంచ్ చేసింది. ఈ పోస్టు పెయిడ్ ప్లాన్స్ రిలయన్స్ జియోతో పాటు, ఎయిర్‌టెల్, వొడాఫోన్‌లకు కౌంటర్‌గా నిలువనున్నాయి. నిర్వానా ప్లాన్స్ రూ.389 నుంచి ప్రారంభమై.. రూ.2,999 వరకు ఉన్నాయి. ఎనిమిది ఆఫర్లు ఉన్నాయి. ఈ ప్లాన్స్ కింద అపరమిత కాలింగ్, ఉచిత రోమింగ్ సౌకర్యం, అపరమిత మెసేజింగ్ వంటి అందిస్తోంది. ఎయిర్‌టెల్, వొడాఫోన్‌లలో అందిస్తున్న డేటా రోల్ ఓవర్ ఆఫర్ తరహాలోనే ఐడియా కూడా నిర్వానా పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను వాడే కస్టమర్లకు డేటా క్యారీ ఫార్వార్డ్ ఆఫర్‌ను వీటిలో ప్రవేశపెట్టింది. దీని వల్ల ఒక నెలలో యూజర్ తనకు లభించిన మొబైల్ డేటా వాడకపోతే అది మరుసటి నెలలో వచ్చే డేటా లిమిట్‌లో యాడ్ అవుతుంది.
కొత్త ప్లాన్ల వివరాలు..
రూ.389 ఐడియా నిర్వానా పోస్టు పెయిడ్ ప్లాన్..
అపరిమిత లోకల్, ఎస్టీడీ కాలింగ్, ఉచిత ఇన్‌కమింగ్ రోమింగ్ కాల్స్, 10 జీబీ హైస్పీడ్ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్, మూవీలు, గేమ్స్, మ్యూజిక్‌కు 12 నెలల వరకు ఉచిత సబ్‌స్క్రిప్షన్
రూ.499 ఐడియా నిర్వానా పోస్టు పెయిడ్ ప్లాన్..
అపరిమిత లోకల్, ఎస్టీడీ కాలింగ్, ఉచిత ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ రోమింగ్ కాల్స్, 20 జీబీ హైస్పీడ్ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్, 200జీబీ వరకు డేటా క్యారీ ఫార్వడ్ లిమిట్
రూ.649 ఐడియా నిర్వానా పోస్టు పెయిడ్ ప్లాన్..
అపరిమిత లోకల్, ఎస్టీడీ కాలింగ్, నేషనల్ రోమింగ్‌పై ఉచిత ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ కాల్స్, నెలంతా 35 జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్, 200జీబీ వరకు డేటా క్యారీ ఫార్వడ్ లిమిట్
రూ.999 ఐడియా నిర్వానా పోస్టు పెయిడ్ ప్లాన్..
అపరిమిత కాలింగ్, నేషనల్ రోమింగ్‌పై ఉచిత ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ కాల్స్, నెలంతా 60 జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్, 200జీబీ వరకు డేటా క్యారీ ఫార్వడ్ లిమిట్
రూ.1,299 ఐడియా నిర్వానా పోస్టు పెయిడ్ ప్లాన్..
అపరిమిత కాలింగ్, ఉచిత రోమింగ్ కాల్స్, ఉచితంగా 100 ఇంటర్నేషనల్ కాలింగ్ నిమిషాలు, నెలంతా 85 జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్, 200జీబీ వరకు డేటా క్యారీ ఫార్వడ్ లిమిట్
రూ.1,699 ఐడియా నిర్వానా పోస్టు పెయిడ్ ప్లాన్..
అపరిమిత లోకల్, ఎస్టీడీ కాలింగ్, ఉచిత ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ రోమింగ్ కాల్స్, 110జీబీ హైస్పీడ్ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్, 500జీబీ వరకు డేటా క్యారీ ఫార్వడ్ లిమిట్
రూ.1,999 ఐడియా నిర్వానా పోస్టు పెయిడ్ ప్లాన్..
అపరిమిత కాలింగ్, నేషనల్ రోమింగ్‌పై ఉచిత ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ కాల్స్, ఉచితంగా 200 ఇంటర్నేషనల్ నిమిషాలు, నెలంతా 135జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్, 500జీబీ వరకు డేటా క్యారీ ఫార్వడ్ లిమిట్
రూ.2,999 ఐడియా నిర్వానా పోస్టు పెయిడ్ ప్లాన్..
అపరిమిత కాలింగ్, ఉచిత రోమింగ్ కాల్స్, ఉచితంగా 200 ఇంటర్నేషనల్ నిమిషాలు, నెలంతా 220జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్, 500జీబీ వరకు డేటా క్యారీ ఫార్వడ్ లిమిట్
Comments
Please login to add a commentAdd a comment