జియో కస్టమర్లకు ట్విస్ట్ : ఎంట్రీ-లెవల్ రూ.199 ప్లాన్‌ ఇక రూ. 299లు | Reliance Jio postpaid plan price hikes by Rs 100 ceck details | Sakshi
Sakshi News home page

జియో కస్టమర్లకు ట్విస్ట్: ఎంట్రీ-లెవల్ రూ.199 ప్లాన్‌ ఇక రూ. 299లు

Published Fri, Mar 24 2023 1:33 PM | Last Updated on Fri, Mar 24 2023 5:35 PM

Reliance Jio postpaid plan price hikes by Rs 100 ceck details - Sakshi

సాక్షి, ముంబై: రిలయన్స్ జియో ఎంట్రీ లెవల్ పోస్ట్‌ పెయిడ్ ప్లాన్‌ను రూ.199 నుండి రూ.299కి పెంచేసింది. 100 రూపాయిలు పెంచిన ఈ ప్లాన్‌లో మిగిలిన  ప్రయోజనాల్నీ ఒకేలా ఉండగా, 5 జీబీ డేటా అదనంగా అందిస్తోంది.  

(ఇదీ చదవండి: ఫాంటసీ క్రికెట్ యాప్ ‘క్రిక్‌పే’ లాంచ్‌... అదీ ఐపీఎల్‌కు ముందు)

 కొత్త జియో రూ. 299 పోస్ట్‌పెయిడ్ ప్లాన్
వెబ్‌సైట్ ప్రకారం, జియో  ఎంట్రీ-లెవల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ఇప్పుడు రూ. 299 నుండి ప్రారంభమవుతుంది.  ఇందులో  30జీబీ హై-స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌,   రోజుకు 100 SMSల ఉచింతం  అర్హతగల  జియో సబ్‌స్క్రైబర్‌లు అపరిమిత 5జీ డేటాతో Jio వెల్‌కమ్ ఆఫర్‌ను పొందవచ్చు. (సీఈవో సుందర్ పిచాయ్‌కు ఉద్యోగుల బహిరంగ లేఖ: కీలక డిమాండ్లు)

పాత జియో రూ. 199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్
పాత రూ. 199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో  25  జీబీ హై-స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజుకు 100 SMSలను అందించింది. JioPrime సభ్యత్వం కోసం రూ. 99 వసూలు చేస్తుంది. ఈ ప్లాన్ రూ JioTV, JioCinema, JioSecurity , JioCloud వంటి అంతర్గత యాప్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. ఇపుడిక  పాత ఎంట్రీ-లెవల్ పోస్ట్‌పెయిడ్  రూ. 199 ప్లాన్‌ కస్టమర్‌లకు అందుబాటులో లేదు.

కాగా గత వారం రిలయన్స్ జియో పోస్ట్‌పెయిడ్ కస్టమర్‌ల కోసం రూ. 299తో ప్రారంభమయ్యే జియో ప్లస్ పేరుతో నాలుగు కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్లాన్‌లు కూడా ప్రస్తుతం అందుబాటులో  ఉన్నాయి.

(Upasana Konidela:ఉపాసన అరుదైన ఘనత.. సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement