ఎయిర్‌టెల్‌ ఆ ప్లాన్‌ మళ్లీ వచ్చేసింది | Airtel Rs. 649 Postpaid Plan Relaunched | Sakshi
Sakshi News home page

ఎయిర్‌టెల్‌ ఆ ప్లాన్‌ మళ్లీ వచ్చేసింది

Published Thu, Apr 5 2018 9:08 AM | Last Updated on Thu, Apr 5 2018 9:09 AM

Airtel Rs. 649 Postpaid Plan Relaunched - Sakshi

ఎయిర్‌టెల్‌ (ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ : టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ అంతకముందు రద్దు చేసిన ఆ 649 రూపాయల పోస్టు పెయిడ్‌ప్లాన్‌ను మళ్లీ ఆవిష్కరించింది. మైప్లాన్‌ ఇన్ఫినిటీ కింద ‘బెస్ట్‌ సెల్లింగ్‌ పోస్టుపెయిడ్‌ ప్లాన్స్‌’లో భాగంగా దీన్ని ప్రవేశపెట్టింది. ఈ ప్యాక్‌ కింద ప్రస్తుతం 50జీబీ డేటాను, అపరిమిత కాలింగ్‌ను ఆఫర్‌ చేయనున్నట్టు ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. అంతకముందు ఈ ప్లాన్‌ కింద కేవలం కస్టమర్లకు 30జీబీ 3జీ, 4జీ డేటాను మాత్రమే ఆఫర్‌ చేసేది. ప్రస్తుతం అదనంగా 20జీబీ డేటాను పెంచేసింది. రిలయన్స్‌ జియో రూ.509, రూ.799 పోస్టు పెయిడ్‌ ప్లాన్లకు పోటీగా ఎయిర్‌టెల్‌ ఈ ప్లాన్‌ను తీసుకొచ్చింది. 

కొత్త రూ.649 ప్లాన్‌ కింద నెలకు 50జీబీ డేటా మాత్రమే కాక, అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోమింగ్‌లో అవుట్‌గోయింగ్‌ కాల్స్‌ ఉచితం. ఎలాంటి ఎఫ్‌యూపీ పరిమితి లేదు. ఈ పోస్టుపెయిడ్‌ ప్లాన్‌ డేటా రోల్‌ఓవర్‌ సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. అంటే నెలలో సద్వినియోగం చేసుకోని డేటాను, తర్వాతి నెలకు పంపించుకునే అవకాశముంటుంది. ఈ ప్లాన్‌లో అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అమెజాన్‌ ప్రైమ్‌కు ఏడాది సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. వింక్‌ టీవీ సబ్‌స్క్రిప్షన్‌, లైవ్‌టీవీ, మూవీలు, హ్యాండ్‌సెట్‌ డ్యామేజ్‌ ప్రొటెక్షన్‌ను ఇది ఆఫర్‌ చేస్తోంది. ఎయిర్‌టెల్‌ ఇటీవలే 499 రూపాయలతో కొత్తగా ఓ పోస్టు పెయిడ్‌ ప్లాన్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ ప్లాన్‌ కింద అపరిమిత లోకల్‌, ఎస్టీడీ, రోమింగ్‌ ఇన్‌కమింగ్‌/అవుట్‌గోయింట్‌ కాల్స్‌ ఉచితం, 40జీబీ 3జీ,4జీ డేటాను అందిస్తోంది. ఏడాది పాటు అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ను ఆఫర్‌ చేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement