రాజ్‌కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐ ఫోన్ చోరీకి గురైంది. ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేలకు దూరంగా ఉన్న రోహిత్.. మూడో వన్డేకు జట్టుతో కలిశాడు. ఈ క్రమంలో రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో సహాచర ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గోన్నాడు.
ఈ సందర్భంగా రోహిత్ తన ఫోన్‌ను పోగొట్టుకున్నాడు. ప్రాక్టీస్ సెషన్ పూర్తి చేసుకున్న తర్వాత చూసుకోగా తన ఫోన్ పోయిందని హిట్‌మ్యాన్ గుర్తించినట్లు సమాచారం. దీంతో తన ఫోన్ పోయిందని స్థానిక అధికారులతోపాటు పోలీసులకు రోహిత్ ఫిర్యాదు చేశాడు.
గ్రౌండ్‌లో ఎంత వెతికినా రోహిత్ ఫోన్ మాత్రం దొరకలేదు. అయితే ఆ ఫోన్‌ను ఎవరో దొంగిలించి ఉంటారని పోలీస్‌లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా రోహిత్‌కు ఇదేమి కొత్త కాదు. గతంలో కూడా చాలా సార్లు వస్తువులు పోగుట్టుకున్న సందర్బాలు ఉన్నాయి.
రోహిత్‌కు మతిమరుపు ఎక్కువ అని సహచర ఆటగాడు కోహ్లి సైతం చాలా సందర్బాల్లో చెప్పుకొచ్చాడు. ఇక ఇది ఇలా ఉండగా.. ఆసీస్‌తో మూడో వన్డేలో హిట్‌మ్యాన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 57 బంతుల్లో 81 పరుగులు చేసి సత్తాచాటాడు.
చదవండి: ODI WC 2023: ప్లేయర్స్ ఫీవర్‌తో బాధపడ్డారు.. వరల్డ్ కప్ ప్రిపరేషన్స్‌పై ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment