మార్గదర్శకమైన మార్గాన్ని కనిపెట్టే వైతాళికు నికి తను నమ్మిన నిజాల మీద నిర్దుష్టమైన విశ్వాసం ఉండాలి. మూర్ఖమైన పట్టు దల ఉండాలి. ఓ గుడ్డి లక్ష్యం ఉండాలి. ఓ రకమైన పెళుసుదనం ఉండాలి. ఇన్ని లేకపోతే ఏదో ఒక సంద ర్భంలో తన విశ్వాసం సడలుతుంది. సడలిందా? అతను పోయే అధఃపాతాళానికి మరెవ్వరూ పోలేరు. అలాంటి మార్గాన్ని ఎంచుకుని తన జీవితకాలంలో అఖండ విజయాన్ని సాధించిన అద్భుత పరిశోధ కుడు స్టీవ్‌జాబ్స్. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పరప తిని సాధించిన ఐఫోన్ ప్రారంభదశకి ఆద్యుడు.
ఈ దశలోనే ఇలాంటి మరొక మూర్ఖపు పట్టు దలతో విజయాన్ని సాధించిన ఇద్దరి పేర్లు ఏనాడూ కెమెరా ముందు నిలబడని నన్ను ‘వద్దు బాబోయ్!’ అంటున్నా వినిపించుకోకుండా 5 పాటలూ, 42 సీన్లూ ఉన్న ఓ సినీమాలో టైటిల్ రోల్ వేయించి నాకు 39 సంవత్సరాల, 300 సినీమాల కెరీర్‌ని ఇచ్చిన వ్యక్తి నిర్మాత రాఘవ. చాలా సందర్భాలలో నా కారణంగా రాఘవగారు భయంకరమైన ఫెయి ల్యూర్ చవి చూస్తారని భయపడి ఆయనతో అనేవా డిని. ఆయన కేవలం నవ్వి ఊరుకునేవారు.
మరొక వ్యక్తి– ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త ఎస్. భావనారాయణగారు. ఊహించని ఉష్ణోగ్ర తల్లో లోహాల్ని కరిగించే మూసలు– ఆ ఉష్ణోగ్రతను తట్టుకునే ఏ మిశ్రమ లోహంతో తయారుకావాలి? సంవత్సరాల తరబడి తపస్సు చేసి– ఫలితాన్ని కనుగొని ఆ వ్యాపారానికి ‘కింగ్’గా నిలవడం నాకు తెలుసు. ఆ రోజుల్లోనే చిరంజీవి హీరోగా ఆయనకి నేను ‘ఐ లవ్ యూ’ రాశాను. ఆయనది విపరీతమైన instinct తొలి రోజుల్లోని ఒక చిత్రాన్ని చూసి ‘మారుతీరావుగారూ! ఈ కుర్రాడు చిదక్కొట్టేస్తాడు– అలా చూస్తూండండి’ అన్నారు. అలా చెప్పిన మరొక కన్నడ హీరో ‘ఒందానొందు కాలదల్లి’ చూశాక శంక రనాగ్‌ని. ఇద్దరూ దరిమిలాను అక్షరాలా ఆ పని చేశారు. తర్వాత రెండు చిత్రాలు తీసి, ఫెయిలయి ‘లాభం లేదు మారుతీరావుగారూ! నా ‘గురి’ తప్పింది. ఇంక సినీమాలు తీయను’ అని సన్య సించారు.
ఏతావాతా స్టీవ్‌జాబ్స్ తన పరిధిలోకి వచ్చి తనని ప్రభావితం చేసేవారిపట్ల అతి క్రూరుడు. తను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అని నమ్మి, ప్రపం చాన్ని నమ్మించిన వ్యాపారి. తన ధోరణి సాగకపోతే పసివాడిలాగా ఏడ్చేవాడు. ఆ ఏడుపు నిస్సహాయత కాదు. తన అహంకారానికి ఆటవిడుపు.
స్టీవ్ జాబ్స్‌కి భారతీయ తత్వ సిద్ధాంతమన్నా, సంస్కృతి అన్నా మక్కువ. భారతదేశం వచ్చి ఎన్నో దేవాలయాలు, సంస్థలను చూశాడు. ఆయన నమ్మ కాల పునాదుల్లో కనీసం రెండయినా భారతీయ ఆలో చనా వ్యవస్థ ఇటుకలు ఉన్నాయేమో!
స్టీవ్‌జాబ్స్ ఏ కాలేజీకి వెళ్లలేదు. వెళ్లిన ఒక్క కాలేజీ చదువుని అర్ధంతరంగా వదిలి వచ్చేశాడు. తన మామగారి కారు గరాజ్‌లో పరిశోధనలు ప్రారం భించి మొట్టమొదటి ‘మెకంతోష్’కి రూపకల్పన చేశాడు. వ్యాపార రంగం దిగ్భ్రాంతమయింది. తర్వాత అతని జీవితం చరిత్ర.
చివరికి కేన్సర్‌తో కన్నుమూశాడు. మరణ శయ్యమీద స్టీవ్ జాబ్స్ చెప్పిన మాటలు ఏ శ్రీశ్రీ రవిశంకరో, ఏ సద్గురు జగ్గీ వాసుదేవో చెప్పిన సూక్తులలాగ వినిపిస్తాయి.
‘అవసానం కొందరికి అవలోకన. కొందరికి కేవలం యాతన. చాలామందికి నా జీవితం పెద్ద విజయానికి నిదర్శనం. కానీ అందులో చాలా కొద్ది ఆనందమే ఉంది. ఐశ్వర్యం నాకు వ్యసనం. జీవిత మంతా నన్ను ఏమార్చిన మాఫియా.
ఇప్పుడు ఆఖరి క్షణాలలో మృత్యువు సమక్షంలో ఈ ఐశ్వర్యం అర్థం లేనిదని అర్థమయింది. నీ కారుని నడపటానికి ఓ మనిషిని జీతానికి కుదుర్చుకోవచ్చు. కానీ– నీ అనారోగ్యాన్ని పంచుకోడానికి నువ్వు ఎప్పుడూ ఒంటరివి’.
మిత్రుడు, ప్రముఖ హాస్య రచయిత డాక్టర్ తంబు కేన్సర్‌తో వెళ్లిపోయాడు. చివరి రోజుల్లో ఆయన ఆత్మీయ మిత్రుడు కళ్లనీళ్లు పెట్టుకుంటూ ‘చెప్పరా, నీ కోసం నేను ఏం చెయ్యమన్నా చేస్తాను’ అన్నాడు రుద్ధ కంఠంతో. ‘అయితే నా మూత్రాన్ని నా తరఫున నువ్వు పొయ్యి’ అన్నాడట తంబు అనే డాక్టర్. ఎంత భయంకరమైన నిస్సహాయత.
మళ్లీ స్టీవ్‌జాబ్స్: ‘నీ తెలివితేటలు పెరిగి, విజ్ఞత పుంజుకున్నకొద్దీ నీకొకటి అర్థమవుతుంది.
30 రూపాయల వాచీ, 30 వేల రూపాయల వాచీ అదే కాలాన్ని సూచిస్తుంది. వాచీ కాలం విలువని పెంచదు. అర్థంలేని నీ ‘వానిటీ’కి రంగులు దిద్దు తుంది.
చివరికి నీ జీవితంలో ఆరుగురే ఉత్తమమైన వైద్యులున్నారు: సూర్యరశ్మి, విశ్రాంతి, వ్యాయామం, ఆహారం, ఆత్మవిశ్వాసం, స్నేహితులు. దేవుడిచ్చిన మనుషుల్ని కాపాడుకో. ఒకరోజు వాళ్ల అవసరం నీకుంటుంది.
‘తొందరగా వెళ్లాలనుకుంటే ఒంటరిగా వెళ్లు. ఎక్కువ దూరం వెళ్లాలనుకుంటే నలుగురైదుగురుతో నడువు. ఎందుకు? ఆలోచించని జీవన ప్రయాణం ఏమారుస్తుంది. ‘ఆలోచన’ అడుగుల్ని అంచనా వేయిస్తుంది’. ఈ మాట ‘నడక’ గురించి కాదు. ‘జీవన ప్రయాణం’ గురించి.
వ్యాసకర్త : గొల్లపూడి మారుతీరావు
Comments
Please login to add a commentAdd a comment