Maha Kumbh 2025: ప్రయాగ్‌రాజ్‌కు స్టీవ్‌ జాబ్స్‌ సతీమణి | Apple Co Founder Steve jobs wife Laurene Powell to Visit Maha Kumbh Mela | Sakshi
Sakshi News home page

Maha Kumbh 2025: ప్రయాగ్‌రాజ్‌కు స్టీవ్‌ జాబ్స్‌ సతీమణి

Published Sun, Jan 12 2025 8:02 AM | Last Updated on Sun, Jan 12 2025 9:19 AM

Apple Co Founder Steve jobs wife Laurene Powell to Visit Maha Kumbh Mela

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో రేపటి (జనవరి 13) నుంచి కుంభమేళా జరగనుంది. ఈ మేళాకు భారీ ఎత్తున స్వామీజీలు, ప్రముఖులు, భక్తులు హాజరుకానున్నారు. ఆపిల్ సహ వ్యవస్థాపకులు స్టీవ్ జాబ్స్ (Apple co-founder Steve Jobs) భార్య, ప్రపంచంలోని అత్యంత ధనవంతురాలైన మహిళల్లో ఒకరైన లారెన్ పావెల్ కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రయాగ్‌రాజ్‌కు తరలిరానున్నారు. ఈ సమాచారాన్ని ఆధ్యాత్మిక గురువు స్వామి కైలాశానంద జీ తెలిపారు.

స్వామి కైలాసానంద(Swami Kailasananda) మీడియాతో మాట్లాడుతూ ‘లారెన్ మా గురువును కలవడానికి వస్తున్నారు. ఆమె నా కూతురు లాంటిది. మేము ఆమెకు మా గోత్రాన్ని కూడా ఇచ్చి, కమల అని పేరు పెట్టాం. ఆమె భారతదేశానికి రావడం ఇది రెండోసారి. మహా కుంభమేళాకు అందరికీ స్వాగతం. ఆమె మూడు నాలుగు రోజులు  ఇక్కడ ఉంటారు. ఆమె మహా కుంభమేళాకు వచ్చి, సాధువులను కలుసుకుని, మన సంప్రదాయాలను  పాటిస్తారు.

ప్రపంచంలోని చాలా మంది ఏదో ఒక గురువు మార్గదర్శకత్వంలో ముందుకుసాగుతున్నారు. ఈ నేపధ్యంలో చాలా మంది కుంభమేళాకు తరలి వస్తున్నారు. ఇది ఒక మతపరమైన ఉత్సవం. ప్రపంచం నలుమూలల నుండి భారతదేశానికి తరలివస్తున్నారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం వ్యాపారవేత్త లారెన్ 17 రోజుల పాటు భారత్‌లో ఉండనున్నారు. ఈ సమయంలో ఆమె సాధువుల మధ్య సాధారణ జీవితాన్ని గడుపుతారు. ఆమె భర్త స్టీవ్ లాగే, లారెన్‌కు కూడా హిందూ, బౌద్ధమతాలతో ప్రత్యేక  అనుబంధం ఏర్పరుచుకున్నారు.

లారెన్ జనవరి 13న ప్రయాగ్‌రాజ్‌(Prayagraj)కు చేరుకోనున్నారు. లారెన్ పావెల్, ఆమె కుటుంబం ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచ బిలియనీర్ల వార్షిక జాబితాలో 59వ స్థానంలో ఉన్నారు. టైమ్స్ మ్యాగజైన్ ఆమెను ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన మహిళల జాబితాలో చేర్చింది. ఆమె జనవరి 29 వరకు నిరంజని అఖాడాకు చెందిన ఆచార్య మహామండలేశ్వర్ స్వామి ఆశ్రమంలో బసచేయనున్నారు. 

ఇది కూడా చదవండి: Delhi Elections: బీజేపీ రెండవ జాబితా విడుదల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement