కూతురు చేసిన పనికి.. పాపం ఆ తండ్రి..! | Apple engineer sacked after daughter‘s iphone X video viral in San Francisco | Sakshi
Sakshi News home page

ఐఫోన్‌ వీడియో వైరల్‌.. ఊడిన యాపిల్‌ ఇంజనీర్‌ ఉద్యోగం

Published Sun, Oct 29 2017 5:43 PM | Last Updated on Sun, Oct 29 2017 5:52 PM

 Apple engineer sacked after daughter‘s iphone X video viral in San Francisco

శాన్‌ఫ్రాన్సిస్కో: యాపిల్‌ సంస్థకు చెందిన ఐఫోన్‌కు మంచి డిమాండ్‌ ఉంది. తన కూతురు తీసిన వీడియో కారణంగా యాపిల్‌ సంస్థలో ఓ ఇంజనీర్‌ ఉద్యోగం ఊడింది. వివరాలివి.. బ్రూక్‌ అమెలియా పీటర్సన్‌ తన తండ్రి ఇంజనీర్‌గా పనిచేస్తున్న యాపిల్‌​క్యాంపస్‌కు ఈవారం మొదట్లో వెళ్లింది. అక్కడ ఆ సమయంలో ఆమె డాక్యుమెంట్‌ తీసింది.

అందులో ప్రత్యేక సిబ్బంది వద్ద క్యూఆర్‌ కోడ్స్‌తో ఉండే ఇంకా విడుదల కానీ ఐఫోన్‌-10 గురించి సమాచారం ఉంది. ఇంకా ఆ ఫోన్‌ పైనున్న కోడ్‌, ఆ ఫోన్‌ హోమ్‌ స్ర్కీన్‌, కవర్‌ షీట్‌ నోటిఫికేషన్‌ కూడా కనిపించాయి. ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్లో వైరల్‌ అయింది. దీంతో ఆ సంస్థ పీటర్సన్‌ తండ్రిని ఉద్యోగం నుంచి తొలగించింది.  ఈ ఘటనతో తనపై తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారని ఆమె చెప్పింది. అంతేకాక వీడియో తీయడం యాపిల్‌ కంపెనీ నిబంధనలకు విరుద్ధమని అన్నారని  పీటర్సన్‌  తెలిపింది. ఆ వీడియోను తొలగించాల్సిందిగా యాపిల్‌ కంపెనీ ఆమెను కోరింది. అయితే  అప్పటికే ఆలస్యమై అది వైరల్‌ అయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement