అమెరికన్ పార్సిలులో చెత్త కాగితాలు... | I phone Parcel delivered through post office found full of waste papers | Sakshi
Sakshi News home page

అమెరికన్ పార్సిలులో చెత్త కాగితాలు...

Published Fri, Sep 5 2014 1:23 PM | Last Updated on Thu, Apr 4 2019 3:20 PM

అమెరికన్ పార్సిలులో చెత్త కాగితాలు... - Sakshi

అమెరికన్ పార్సిలులో చెత్త కాగితాలు...

జగ్గయ్యపేట : అమెరికా నుంచి వచ్చిన ఓ రిజిస్ట్రర్ ఎయిర్ పార్సిలు చూసిన ఓ వ్యక్తి అవాక్కయిన ఘటన కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే  స్థానిక నివాసం ఉంటున్న ఇంటూరి రాజగోపాల్ బంధువులు అమెరికాలో ఉంటున్నారు. గత నెల 23న బంధువు ...రూ.60వేలు విలువ చేసే ఐ ఫోన్ను అమెరికా నుంచి జగ్గయ్యపేటకు రిజిస్టర్ ఎయిర్మెయిల్ ద్వారా రాజగోపాల్కు పంపాడు.

 

పార్సిల్ తెరిచి చూసిన రాజగోపాల్ ...ఫోన్కు బదులు చెత్త కాగితాలు ఉండటంతో షాక్ తిన్నాడు. వెంటనే ఈ విషయాన్ని ఫోన్ చేసి బంధువుకు తెలిపాడు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కాగా ఫోన్ పోస్టాఫీసులో మిస్ అయ్యిందా లేక కస్టమ్స్ అధికారుల వైఫల్యమా అనేది తేలాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement